18, ఆగస్టు 2010, బుధవారం

క్రైస్తవ మతము


క్రైస్తవ మతము (Christianity) ప్రపంచంలోని అతి పెద్ద మతం. ఏసుక్రీస్తును ఏకకాలంలో దేవుని కుమారుడు గానూ, దేవుడు గానూ నమ్ముతూ ఏక దైవారాధన ను ప్రబోధించే మతం. నజరేయుడైన యేసు జీవితం అంటే ఆయన జననం, ప్రబోధం, శ్రమ, మరణం, పునరుత్థానాలగురించి పౌలు నిర్మించిన సిద్ద్ధాంతాలే క్రైస్తవ మత పునాదులు. బైబిలు లోని క్రొత్త నిబంధన లో యేసు జీవితం, బోధలతో పాటు క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన అనేక విషయాలు వివరించబడ్డాయి. యేసు దేవుని కుమారుడని, పాత నిబంధన లో ప్రవచింప బడిన మెస్సయ్యా అని క్రైస్తవులు నమ్ముతారు. 2001 వ సంవత్సరపు అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవాన్ని అనుసరించే వాళ్ళు 210 కోట్ల మంది ఉన్నారు.

యేసు పునరుత్థానం చెందిన ఏభై రోజుల తర్వాత వచ్చిన పెంతెకోస్తు అనే పండుగ దినాన క్రైస్తవం ఒక సమాజంగా ఏర్పడిందని అపోస్తలుల కార్యాల గ్రంథం పేర్కొంటుంది. తొలుత యూదా మతం లో ఒక శాఖగా మొదలైన ఇది అనతికాలంలోనే ఒక ప్రత్యేక మతంగా ఆవిర్భవించింది. యూదుల మత గ్రంథమైన హెబ్రీ బైబిలు ను విశ్వసిస్తూ దాన్ని పాత నిబంధన గా క్రైస్తవులు పేర్కొంటారు. యూదా మరియు ఇస్లాం మతము లతో పాటు క్రైస్తవం కూడా అబ్రహాము సంబంధిత మతం గా పేర్కొన బడుతుంది. అంతియొకయలోని శిష్యులు మొట్ట మొదటి సారిగా క్రైస్తవులని పిలువ బడ్డారు.

క్రైస్తవులని పిలువబడుతున్న వాళ్ళు సిద్ధాంత పరంగా, ఆచారాల పరంగా వేరు వేరు 3652 సమూహాలుగా తమలో తాము విడిపోయారు. డినామినేషనులు అని పిలువబడే ఈ క్రైస్తవ మత శాఖలను వారనుసరిస్తున్న సంప్రదాయాల ననుసరించి రోమన్ కాథలిక్కులు 2. సనాతన తూర్పు సంఘం 3. ప్రొటెస్టెంట్ లు అనే మూడు ప్రధాన వర్గాలుగా విభజించ వచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి