18, ఆగస్టు 2010, బుధవారం

జైన మతము


జైన మతము సాంప్రదాయికంగా జైన ధర్మ (जैन धर्म) , అని పిలువబడుతుంది. ఈ మతము క్రీ.పూ. 9వ శతాబ్దంలో పుట్టినది.[1][2] ఈ మత స్థాపకుడు మొదటి తీర్థాంకరుడు అయిన వృషభనాథుడు.[3] 23వ తీర్థాంకరుడు పార్శ్వనాథుడు. 24వ తీర్థాంకరుడు వర్థమాన మహావీరుడు. [4]

భారతదేశంలో జైనులు ఒక చిన్న సమూహము. వీరి జనాభా దాదాపు 42 లక్షలు వుంటుంది.[5] జైన మతమును శ్రమన మతమని కూడ తెలియబడును.

ఆంధ్రప్రదేశ్ లో జైన మతం:----

జైనగాథల ప్రకారం జైనమతం క్రీ.పూ నాలుగో శతాబ్దానికే ఆంధ్రదేశంలో ప్రవేశించినట్లు తెలుస్తోంది. కళింగ రాజైన ఖారవేలుడి ఆదరణ వల్ల కృష్ణా నదికి ఉత్తరంగా తీరప్రాంతంలో ముందంజ వేసింది. అశోకుడి పుత్రుడు సంప్రతి ఆంధ్ర, ద్రవిడ దేశాల్లో జైన వ్యాప్తికి కృషి చేశాడు. అమరావతి సమీపంలోని వడ్డమాను కొండపై సంప్రతి విహారం ఏర్పడింది. అక్కడే ఖారవేలుడు మహామేఘ వాహన విహారం నిర్మించాడని శాసనాల వల్ల తెలుస్తోంది. క్రీస్తు శకారంభంలో సుప్రసిద్ధ జైనాచార్యుడైన కొండకుందాచార్యుడు కొనకుండ్ల (అనంతపురం జిల్లా) లో ఆశ్రమం నిర్మించుకుని మతప్రచారం చేస్తూ సిద్ధాంత గ్రంథాలు రచించాడు. వాటిలో సమయసార అనే గ్రంథం శ్వేతాంబర, దిగంభర శాఖలకు ఆదరణీయమైంది.


అహింస:-----


ఆచరణసాధ్యం కానంత తీవ్ర స్థాయి లో అహింస ఉంటుంది.జైనమతం ప్రజాదరణ పొందలేకపోవడానికి ఇది ఒక కారణం.గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుంటారు. నీళ్ళు వడగట్టుకుని తాగుతారు.అడుగు తీసి అడుగువేసేటప్పుడు కాలికింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన పొరకతో నడిచినంతమేరా అడుగేసేముందు నేలను ఊడ్చుకుంటూపోతారు.నేలను చీల్చి దున్నే వ్యవసాయం చేయరు.నేలకింద పండే దుంపకూరలు, ఉల్లి,వెల్లుల్లి, మసూర్ గింజల్లాంటివి కూడా తినరు. వడ్డీ వ్యాపారంచేస్తారు.


జీవులు 5 రకాలు:---


జీవులు అన్నీ తాకినవారిని గుర్తుపడతాయి. పృథ్వీకాయ జీవులు --రాళ్ళు, మట్టి, గవ్వ అప్కాయ జీవులు--మంచు, ఆవిరి, నీరు, వాన తేజోకాయ జీవులు--మంట, మెరుపు, బూడిద వాయుకాయ జీవులు --గాలి, తుఫాన్ వనస్పతిక జీవులు -- మొక్కలు, పొదలు, చెట్లు, వాటి బెరడు, కాండం, ఆకులు, విత్తనాలు...వీటిలో ఒక్కోదానిలో ఒక్కో ఆత్మే ఉంటుంది. అందుకని ఇవి ఏకకాయజీవులు. ఉర్లగడ్డలు, కంద, చేమ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మొదలైనవి అసంఖ్యాక ఆత్మలు గల బహుకాయజీవులు. ఏకేంద్రియ జీవికి 4 ప్రాణాలు (స్పర్శ, శ్వాస, శరీరం, ఆయుష్షు), పంచేంద్రియజీవులకు 10 ప్రాణాలుంటాయి. ఈ ఏకేంద్రియ జీవులు కూడా పదార్థాన్ని ఆహారం, శరీరం, ఇంద్రియాలు, శ్వాసల ద్వారా స్వీకరించి దాన్ని శక్తిగా మార్చుకుని బతుకుతాయి.


జైనులకు మైనారిటీ హోదా:---


మైనారిటీ'లను నిర్వచిస్తూ రాజ్యాంగానికి సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా జైనులు మైనారిటీలుగా గుర్తింపు పొందేందుకు మార్గం సుగమం కానుంది. ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన19.12.2008 న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మైనారిటీలను నిర్వచిస్తూ రాజ్యాంగానికి 103వ సవరణ చేపట్టాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్లు హోంమంత్రి చిదంబరం తెలిపారు. జైనులకు మైనారిటీ హోదా కల్పించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ పలుసార్లు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో చట్టసవరణ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.(

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి