20, ఆగస్టు 2010, శుక్రవారం

జైన మతం -ముఖ్య సిద్ధాంతాలు

అహింస:

ఆచరణసాధ్యం కానంత తీవ్ర స్థాయి లో అహింస ఉంటుంది.జైనమతం ప్రజాదరణ పొందలేకపోవడానికి ఇది ఒక కారణం.గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుంటారు. నీళ్ళు వడగట్టుకుని తాగుతారు.అడుగు తీసి అడుగువేసేటప్పుడు కాలికింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన పొరకతో నడిచినంతమేరా అడుగేసేముందు నేలను ఊడ్చుకుంటూపోతారు.నేలను చీల్చి దున్నే వ్యవసాయం చేయరు.నేలకింద పండే దుంపకూరలు, ఉల్లి,వెల్లుల్లి, మసూర్ గింజల్లాంటివి కూడా తినరు. వడ్డీ వ్యాపారంచేస్తారు.

జీవులు 5 రకాలు:

జీవులు అన్నీ తాకినవారిని గుర్తుపడతాయి. పృథ్వీకాయ జీవులు --రాళ్ళు, మట్టి, గవ్వ అప్కాయ జీవులు--మంచు, ఆవిరి, నీరు, వాన తేజోకాయ జీవులు--మంట, మెరుపు, బూడిద వాయుకాయ జీవులు --గాలి, తుఫాన్ వనస్పతిక జీవులు -- మొక్కలు, పొదలు, చెట్లు, వాటి బెరడు, కాండం, ఆకులు, విత్తనాలు...వీటిలో ఒక్కోదానిలో ఒక్కో ఆత్మే ఉంటుంది. అందుకని ఇవి ఏకకాయజీవులు. ఉర్లగడ్డలు, కంద, చేమ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మొదలైనవి అసంఖ్యాక ఆత్మలు గల బహుకాయజీవులు. ఏకేంద్రియ జీవికి 4 ప్రాణాలు (స్పర్శ, శ్వాస, శరీరం, ఆయుష్షు), పంచేంద్రియజీవులకు 10 ప్రాణాలుంటాయి. ఈ ఏకేంద్రియ జీవులు కూడా పదార్థాన్ని ఆహారం, శరీరం, ఇంద్రియాలు, శ్వాసల ద్వారా స్వీకరించి దాన్ని శక్తిగా మార్చుకుని బతుకుతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి