20, ఆగస్టు 2010, శుక్రవారం

జుడాయిజం -కొన్ని విశేశాలు

ఇబ్రాహీం ప్రాముఖ్యత:


యూదుల కొరకు ఇబ్రాహీం, పితరుడు, పిత, లేదా తండ్రి. సకలలోకాల ప్రభువు, ఇబ్రాహీం సంతతి యందు అనేక ప్రవక్తలను ప్రకటిస్తాడని సెలవిచ్చాడు. యూదుల ప్రకారం, నోవా (నూహ్) ప్రవక్త కాలంలో జరిగిన మహాప్రళయము తరువాత జన్మించి వారిలో, విగ్రహారాధనను సహేతుకంగా తిరస్కరించిన వారిలో ఇబ్రహీం ప్రప్రధముడు. ఇతనే తరువాత ఏకేశ్వరోపాసక మతాన్ని స్థాపించాడు.
క్రైస్తవులు అబ్రహామును ఆత్మపరమైన పితగా అభివర్ణిస్తారు.[5] క్రైస్తవంలో అబ్రహాము, విశ్వాసానికి ఆదర్శం.[6] మరియు ఇతని యొక్క దేవునికి సమర్పించే గుణం, ఏసుక్రీస్తు యొక్క దేవునికి సమర్పించే గుణంతో పోలుస్తారు.[7]
ఇస్లాంలో, ఇబ్రాహీం, ప్రవక్తల గొలుసు క్రమంలో ఒక ముఖ్యమైన ప్రవక్త, ఈ గొలుసుక్రమం ఆదమ్ తో ప్రారంభం అవుతుంది. ఏకేశ్వరోపాసక విధానాన్ని మరియు తత్వానికి పునరుజ్జీవనం ప్రసాదించినవాడు, అందుకే ఇతన్ని "హనీఫ్" అని వ్యవహరిస్తారు. ఇబ్రహీంను "ప్రవక్తల పిత"గా కూడా అభివర్ణిస్తారు.

భగవంతుడు:


ఇస్లాం మరియు యూద మతము, ఏకేశ్వరవాదాన్ని అవలంబిస్తాయి మరియు ఒకే దేవుణ్ణి (వారి వారి ధర్మగ్రంధాలనుసారం) ఉపాసిస్తాయి. క్రైస్తవం కూడా ఏకేశ్వర ఉపాసనను అంగీకరిస్తుంది, కాని "త్రిత్వం" (దేవుడు, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ) అనుసరిస్తుంది. ఈ వాదాన్ని మొదటి రెండు మతాలు స్వీకరించవు. కానీ ఈ క్రైస్తవసముదాయములోని కొందరు మాత్రం ఈ వాదం (త్రిత్వం) రోమనుల సృష్టి అని, జొరాస్ట్రియన్ మతము మరియు పాగన్ల సాంప్రదాయమని, మూల-క్రైస్తవానికి, ఈ త్రిత్వవాదానికి ఏలాంటి సంబంధం లేదని వాదిస్తాయి.


యూద మతములో భగవంతుడు:


యూద ధార్మికత హెబ్రూ బైబిల్ ఆధారితం. ఈ ధర్మానుసారం దేవుడు మోజెస్ ను ధర్మగ్రంధమైన తోరాహ్ ద్వారా తన ఆదేశాలను మరియు ప్రకృతి సిద్ధాంతాలను అవగతం చేశాడు. "ఎలోహిమ్" అనే పదము దేవునికి ఆపాదింపబడినది. ఇస్లాంలో "ఇలాహి" లాగా

జైన మతం -ముఖ్య సిద్ధాంతాలు

అహింస:

ఆచరణసాధ్యం కానంత తీవ్ర స్థాయి లో అహింస ఉంటుంది.జైనమతం ప్రజాదరణ పొందలేకపోవడానికి ఇది ఒక కారణం.గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుంటారు. నీళ్ళు వడగట్టుకుని తాగుతారు.అడుగు తీసి అడుగువేసేటప్పుడు కాలికింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన పొరకతో నడిచినంతమేరా అడుగేసేముందు నేలను ఊడ్చుకుంటూపోతారు.నేలను చీల్చి దున్నే వ్యవసాయం చేయరు.నేలకింద పండే దుంపకూరలు, ఉల్లి,వెల్లుల్లి, మసూర్ గింజల్లాంటివి కూడా తినరు. వడ్డీ వ్యాపారంచేస్తారు.

జీవులు 5 రకాలు:

జీవులు అన్నీ తాకినవారిని గుర్తుపడతాయి. పృథ్వీకాయ జీవులు --రాళ్ళు, మట్టి, గవ్వ అప్కాయ జీవులు--మంచు, ఆవిరి, నీరు, వాన తేజోకాయ జీవులు--మంట, మెరుపు, బూడిద వాయుకాయ జీవులు --గాలి, తుఫాన్ వనస్పతిక జీవులు -- మొక్కలు, పొదలు, చెట్లు, వాటి బెరడు, కాండం, ఆకులు, విత్తనాలు...వీటిలో ఒక్కోదానిలో ఒక్కో ఆత్మే ఉంటుంది. అందుకని ఇవి ఏకకాయజీవులు. ఉర్లగడ్డలు, కంద, చేమ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మొదలైనవి అసంఖ్యాక ఆత్మలు గల బహుకాయజీవులు. ఏకేంద్రియ జీవికి 4 ప్రాణాలు (స్పర్శ, శ్వాస, శరీరం, ఆయుష్షు), పంచేంద్రియజీవులకు 10 ప్రాణాలుంటాయి. ఈ ఏకేంద్రియ జీవులు కూడా పదార్థాన్ని ఆహారం, శరీరం, ఇంద్రియాలు, శ్వాసల ద్వారా స్వీకరించి దాన్ని శక్తిగా మార్చుకుని బతుకుతాయి.

గురుగ్రంధ సాహిబ్

గురుగ్రంధ సాహిబ్ లేదా ఆది గ్రంధ్, లేదా ఆది శ్రీ గురు గ్రంథ్ సాహిబ్, సిక్కు మతస్తుల పవిత్ర గ్రంధం మరియు ఆఖరి గురువు.

గురు గోవింద్ సింగ్ (1666-1708), సిక్కుల గురువు లలో పదవ గురువు, ఆది గ్రంధ్ ను తన వారసురాలిగా ప్రకటించాడు, మానవులలో గురువులుగా ప్రకటించే విధానాన్ని స్వస్తిపలికి, గ్రంధమైన "ఆది గ్రంధ్" ను తన తరువాత గురువుగా ప్రకటించాడు. ఈ గ్రంధం పవిత్రగ్రంధంగానే గాక, పది-గురువుల జీవనవిధానంగానూ పరిగణింపబడినది. గురుగ్రంధ సాహిబ్, ప్రార్థనలకొరకు ఒక వనరుగా పరిగణింపబడినది.మరియుసిక్కు మతములో ప్రార్థనాంగము.

గురు అర్జున్ దేవ్ (1563-1606) చే మొదటిసారిగా ఆది గ్రంధం కూర్పు చేయబడినది. ఇందులో మొదటి ఐదు సిక్కు గురువులు మరియు హిందూ ముస్లింల సాంప్రదాయాలకు చెందిన అనేక గురువుల గురించి వ్రాయబడినది. గ్రంధాన్ని అసలు రూపం ఇచ్చినవారు భాయ్ గురుదాస్ మరియు తరువాత భాయ్ మణిసింగ్. పదవ గురువు పరమదించిన తరువాత, ఆదిగ్రంధ్ చేతివ్రాత ప్రతులను బాబా దీప్ సింగ్ తయారుచేసి పంచిపెట్టాడు. గురుగ్రంధ సాహిబ్ గ్రంధము 1430 పుటలు కలిగిన గ్రంధము. సిఖ్ గురువుల కాలంలో, 1469 నుండి 1708 వరకు గ్రంధరూపం ఇవ్వబడినది. ఈ గ్రంధం స్తోత్రం రూపంలో వున్నది.




గురుగ్రంథ్ సాహిబ్ వాణి


కొన్ని ముఖ్యమైన వాణులు :-

1.ప్రపంచంలోని మానవులంతా సమానమే
2.స్త్రీలందరూ సమానమే
3.అందరికీ ఒకే భగవంతుడు
4.సత్యమునే పలికి సత్యముగా జీవించు
5.ఐదు విషయాలపట్ల శ్రద్ధ వహించు
6.దేవుడి ఆజ్ఞపై జీవించు (ఒకే దేవుడి నిర్ణయం)
7.మానవత్వం, దయ, జాలి, ప్రేమ లను ఆచరించు
8.జీవించి యుండగానే పరమాత్మను చేరే మార్గ తత్వము.
9.గురువు బోధనల ద్వారా దైనందిన జీవితంలోని సమస్యలనుండి బయటపడటం.
10.ఇందులో కథలు లేవు, జీవనమార్గాన్ని సూచించే సూక్తులు, విశాలతత్వంతో జీవించే మార్గాలూ వున్నవి.

బౌద్ధ మతం - ముఖ్య సిద్ధాంతాలు

బౌద్ధ మతం - ముఖ్య సిద్ధాంతాలు:

థేరవాద బౌద్ధంలో - జన్మ జన్మల వేదన, సాధన అనంతరం సత్యాన్ని తెలిసికొని అజ్ఞానాంధకారంనుండి బయటపడి, ఇతరులకు ఆ మార్గాన్ని ఉపదేశించినవారు "బుద్ధులు" అవుతారు. సత్యాన్ని తెలిసికొన్నాగాని ఇతరులకు ఉపదేశం చేయనివారు "ప్రత్యేక బుద్ధులు" అవుతారు. శాక్యముని గౌతమ బుద్ధుడు ఒక్కడే బుద్ధుడు కాదు. అంతకు పూర్వము, ఇంకా ముందు కాలంలోను ఎందరో బుద్ధులు ఉంటారు. సత్యాన్ని తెలుసుకొన్న గౌతమబుద్ధుడు అనేక బుద్ధులలో ఒకడు. బుద్ధుని బోధనలలో "నాలుగు ఆర్య సత్యాలు" ప్రముఖ పాత్ర కలిగి ఉన్నాయి. దుఃఖం లక్షణం, దానికి కారణం, దుఃఖ నివారణ, నివారణా మార్గం - ఇవి ఆ నాలుగు ఆర్య సత్యాలు అలా దుఃఖాన్ని నివారించే మార్గం "అష్టాంగ మార్గం".


బుద్ధుని అనంతరం బౌద్దాన్ని ఆచరించేవారిలో అనేక విభాగాలు ఏర్పడినాయి. వారి ఆచరణలోను, సిద్ధాంతాలలోను, సంస్కృతిలోను నెలకొన్న వైవిధ్యం కారణంగా బౌద్ధం అంటే ఇది అని స్పష్టంగా అందరికీ వర్తించే విషయాలు క్రోడీకరించడం కష్టమవుతున్నది.


బోధి:--

బోధి అనగా "నిద్ర లేచుట" - థేరవాదంలో అరహంతులకు, బుద్ధులకు కూడా జ్ఞానోదయమయ్యే ప్రక్రియను "బోధి" అంటారు. జన్మ జన్మల సాధన, ధ్యానం తరువాతనే ఈ స్థితి సాధ్యమవుతుంది. బౌద్ధం ఆరంభ దశలో "బోధి", "నిర్వాణం" అనే పదాలు ఒకే అర్ధంలో వాడబడ్డాయి. రాగ, ద్వేష, మోహాలు అంతరించడం ఈ ప్రక్రియలో ముఖ్యమైన లక్షణం.


తరువాత వచ్చిన మహాయాన సిద్ధాంతాలలో "నిర్వాణం" అనే స్థితి "బుద్ధత్వం" కంటే కొంత తగ్గింది. రాగ ద్వేషాలనుండి విముక్తి కలిగితే అది నిర్వాణం అవుతుంది, అనగా ఇంకా మోహం ఉంటుంది. ఈ మోహం కూడా తొలగిపోయినపుడు "బోధి" స్థితి లభిస్తుంది. మహాయానంలోని ఈ సిద్ధాంతం ప్రకారం అరహంతులు నిర్వాణాన్ని పొందుతారు కాని, ఇంకా మోహంనుండి విముక్తులు కానందున వారు బోధిత్వం పొందరు. కాని థేరవాదంలోని నమ్మకం ప్రకారం అరహంతులు రాగ, ద్వేష, మోహాలనుండి విముక్తి పొదిన బోధులు.




బోధిత్వం పొందడానికి "నాలుగు ఆర్యసత్యాలను" సంపూర్ణంగా తెలుసుకోవాలి. అందువలన కర్మ నశిస్తుంది. బౌద్ధం ఆరంభ దశలో "పారమిత"ను ప్రస్తావించలేదు అయితే తరువాత వచ్చిన థేరవాద, మహాయాన బౌద్ధ సాహిత్యంలో "పారమిత" సాధన కూడా అవసరం. బోధిత్వం పొదినవారు జనన, మరణ, పుర్జన్మ భూయిష్టమైన సంసార చక్రంనుండి విముక్తులవుతారు. మాయ తొలగిపోయినందువలన "అనాత్మత" అనే సత్యాన్ని తెలుసుకొంటారు.


మధ్యేమార్గం:---

బౌద్ధ మతం సాంప్రదాయాలలోను, విశ్వాసాలలోను మధ్యేమార్గం చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. శాక్యముని గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయానికి ముందు ఈ మార్గాన్ని అవగతం చేసుకొన్నాడని ప్రతీతి. "మధ్యేమార్గం" అన్న పదానికి వివిధ వివరణలు ఉన్నాయి

1.కఠోరమైన దీక్షతో శరీరాన్ని మనస్సును కష్టపెట్టకుండా, అలాగని భోగ లాలసత్వంలో మునగకుండా మధ్య విధంగా సాధన, జీవితం సాగించడం.
2.తత్వ చింతనలో చివరకు "ఇది ఉంది" లేదా "ఇది లేదు" అన్న పిడివాదనలకు పోకుండా మధ్యస్తంగా ఆలోచించడం
3.నిర్వాణంలో ఈ విధమైన ద్వివిధ, విరుద్ధ భావాలు అంతమై పరిపూర్ణమైన జ్ఞానం కలుగడం.


త్రిరత్నాల శరణు:---

సంప్రదాయానుసారంగా త్రిరత్నాలు లేదా రత్నత్రయం శరణు జొచ్చుట బౌద్ధం ఆచరణలో ప్రాధమిక ప్రక్రియ. "బుద్ధుడు", "ధర్మము", సంఘము" అనేవే ఈ త్రిరత్నాలు. దాదాపు బౌద్ధమతావలంబనలో ఇది మొదటి మెట్టుగా భావింపబడుతుంది. ఈ మూడింటికి అదనంగా "లామ" (దీక్ష) అనే నాల్గవ శరణు కూడా టిబెటన్ బౌద్ధంలో పాటించబడుతుంది.




బుద్ధుడు

జ్ఞానోదయమైన, ధర్మ మార్గాన్ని ఎరిగిన అరహంతుల మార్గాన్ని ఆచరించడం.

ధర్మము

బుద్ధుడు తెలిపిన మార్గము. సత్యానికి, అసత్యానికి ఉన్న భేదము. పరమ సత్యము

సంఘము

బౌద్ధ భిక్షువుల సమూహం లేదా సత్యాన్వేషణా మార్గంలో పురోగమిస్తున్నవారి సహవాసం. కొన్ని వివరణల ప్రకారం భౌక్షుకుల సాధనకు సహకరిస్తున్న సామాన్య జనులు కూడా సంఘంలోని వారే.


"బుద్ధుడు" తాను కనుగొన్న మార్గాన్ని ఇతరులు గ్రుడ్డిగా ఆచరించమని చెప్పలేదు. శ్రద్ధతో ఎవరికి వారే తాను బోధించిన "ధర్మము"ను ఆలంబనగా గైకొని స్వయంగా యుక్తాయుక్తాలు విచారించి, "సంఘము" సహకారంతో సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పాడు. బుద్ధుడు బోధించిన ధర్మాన్ని అందరికీ సాధనలో అందుబాటులో ఉంచే సముదాయమే సంఘం.


మహాయానంలో బుద్ధుడు అంటే ఒక వ్యక్తి కాదు. అనంతమైన ధర్మరూపం. కొన్ని మహాయాన సూత్రాలలో బుద్ధుడు, ధర్మము, సంఘము అనే మూడు భావాలూ అవినాభావమైన శాశ్వతత్వానికి ప్రతీకలుగా భావించబడుతాయి. చాలా మంది బౌద్ధులు వేరే లోకంలో తమ కర్మలకు విముక్తి కలుగుతుందని విశ్వసించరు. అష్టాంగ మార్గం ద్వారానే దుఃఖభూయిష్టమైన కర్మలనుండి విమోచన కలుగుతుందని భావిస్తారు. కాని మహాయానంలో కొన్ని సూత్రాల ప్రకారం శ్రవణం, మననం వంటి సాధనల ద్వారా కర్మ బంధాలనుండి విముక్తి కలుగవచ్చునని ఉంది.


నాలుగు మహోన్నత సత్యాలు:---


బౌద్ధమతంలో "నాలుగు పరమసత్యాలు" ప్రవచింపబడ్డాయి. అవి

1.దుఃఖము
2.దుఃఖానికి కారణము
3.దుఃఖంనుండి విముక్తి
4.దుఃఖాన్నిండి ముక్తిని పొందే మార్గం

ఇవి గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయం తరువాత తన సహ సాధకులైన ఐదుగురు శ్రమణులకు చెప్పిన విషయాలు కనుక బుద్ధిని మొదటి బోధనలు, "ధర్మ చక్ర పరివర్తన సూత్రం" అనే బుద్ధుని మొదటి బోధలో బుద్ధుడు మధ్యేమార్గం గురించి, అష్టాంగ సాధనామార్గం గురించి, నాలుగు పరమ సత్యాల గురించి చెప్పాడు. ఈ నాలుగు పరమ సత్యాలు అనే విషయాన్ని ఒక మత ప్రబోధంగా కాక అప్పటి కాలంలో ఉన్న ఉపశమన విధానం (కష్టాలు తీర్చే మార్గం)గా చెప్పాడు. థేరవాదుల భావం ప్రకారం ఈ నాలుగు పరమ సత్యాలూ ధ్యానానికి అర్హులైన సాధకులకు మాత్రమే తెలిసే ఉన్నత భావాలు మహాయానుల భావం ప్రకారం ఉన్నత స్థాయి మహాయాన సూత్రాలను అందుకొనే స్థాయికి ఇంకా ఎదగని సాధకులకు ఆరంభ దశలో చెప్పవలసిన సూత్రాలు ఇవి. దూర ప్రాచ్య దేశాలలో వీటికి చెప్పుకోదగిన ప్రాచుర్యం లేదు.


అష్టాంగ మార్గం:--

నాలుగు పరమ సత్యాలలో నాలగవదైన దుఃఖ విమోచనా మార్గం అష్టాంగ మార్గం.ఆరంభ కాలం బౌద్ధ గ్రంధాలలో (నాలుగు నికాయాలలో) అష్టాంగ మార్గం సామాన్యులకు బోధించేవారు కారు.అష్టాంగ మార్గం మూడు విభాగాలుగా విభజింపబడింది. శీలము (భౌతికమైన చర్యలు), సమాధి (మనస్సును లగ్నం చేయుట, ధ్యానము), ప్రజ్ఞ (అన్నింటినీ తాత్విక దృష్టితో పరిశీలించడం)




శీలము - శరీరం, మాటల ద్వారా చెడును కలుగనీయకుండడం. ఇందులో మూడు భాగాలున్నాయి:

1."సమ్యక్ వచనము" - నొప్పించకుండా, వక్రీకరించకుండా, సత్యంగా మాట్లాడడం
2."సమ్యక్ కర్మము" - హాని కలిగించే పనులు చేయకుండుట
3."సమ్యక్ జీవనము" - తనకు గాని, ఇతరులకు గాని, ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని కీడు కలుగకుండా జీవించడం
సమాధి - మనసును అదుపులోకి తెచ్చుకోవడం. ఇందులో మూడు సంగాలు ఉన్నాయి.

4."సమ్యక్ వ్యాయామము" - ప్రగతి కోసం మంచి ప్రయత్నం చేయుట
5."సమ్యక్ స్మృతి" - స్వచ్ఛమైన దృష్టితో విషయాలను స్పష్టంగా చూడగలగడం
6."సమ్యక్ సమాధి" - రాగ ద్వేషాలుకు అతీతంగా మనసును స్థిరపరచుకొని సత్యాన్ని అన్వేషించడం
ప్రజ్ఞ - మనసును శుద్ధపరచే జ్ఞానము. ఇందులో రెండు అంగాలున్నాయి.

7."సమ్యక్ దృష్టి" - అనిపించేలాగా కాకుండా (భ్రమ పడకుండా) ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం
8."సమ్యక్ సంకల్పము" - ఆలోచించే విధానంలో మార్పు

ఈ ఎనిమిది మార్గాలను పలు విధాలుగా వివరిస్తారు, విశ్లేషిస్తారు. సాధనలో ఒకో మెట్టూ ఎదగవచ్చునని కొందరంటారు. అలా కాక అన్ని మార్గాలనూ ఉమ్మడిగా ఆచరించాలని మరొక భావన.

బైబిల్

బైబిల్ క్రైస్తవ మతం యొక్క పవిత్ర గ్రంథం. క్రైస్తవులు ఇందులో దేవుని పలుకులు ఉన్నాయని భావిస్తారు. బైబిలుకు అనేక పేర్లు ఉన్నాయి. కొందరు పవిత్ర గ్రంథమని, పవిత్ర నిబంధనమని లేదా పరిశుద్ధ గ్రంథమని పిలుస్తారు. బైబిల్ ను మొదట హీబ్రూ, ఆరామిక్ మరియు గ్రీకు భాషలలో రచించబడినది. ఆ తరువాత లాటిన్ ఇంకా తదితర భాషలలోకి అనువదించబడినది. ఇప్పుడు బైబిల్ 2000 కు పైగా భాషలలోకి అనువదించబడినది. పాత నిబంధన లో 39,కొత్త నిబంధన లో 27 కలిపి మొత్తం బైబిల్లో 66 పుస్తకాలున్నాయి.


పాత నిబంధన :



బైబిల్లోని మొదటి భాగాన్ని పాత నిబంధన గ్రంథం అని అంటారు.ఇందులో ఇశ్రాయేలీయుల యూదుల కథలు ఆజ్ఞలు సామెతలు కీర్తనలు మరియు దేవుడు వాళ్లను ఎలా ఎంచుకున్నాడో తెలిపే చరిత్ర ఉంటాయి.ఇవన్నీ హెబ్రూ లో రాశారు. 39 పుస్తకాలు ఇవి:

1.ఆది కాండము
2.నిర్గమ కాండము
3.లేవియ కాండము
4.సంఖ్యా కాండము
5.ద్వితీయోపదేశ కాండము
6.యెహూషువ
7.న్యాయాధిపతులు
8.రూతు
9.సమాయేలు మొదటి గ్రంధము
10.సమాయేలు రెండవ గ్రంధము
11.రాజులు మొదటి గ్రంధము
12.రాజులు రెండవ గ్రంధము
13.దినవ్రుత్తాతములు మొదటి గ్రంధము
14.దినవ్రుత్తాతములు రెండవ గ్రంధము
15.ఎజ్రా
16.సెహెన్యూ
17.ఎస్తేరు
18.యేబు గ్రంధము
19.కీర్తనల గ్రంధము
20.సామెతలు
21.ప్రసంగి
22.పరమగీతము
23.యెషయా గ్రంధము
24.యిర్మీయా
25.విలాపవాక్యములు
26.యెహెజ్కేలు
27.దానియేలు
28.హోషేయ
29.యేబేలు
30.ఆమోసు
31.ఓబద్యా
32.యోనా
33.మీకా
34.నహూము
35.హబక్కూకు
36.జెఫన్యా
37.హగ్గయి
38.జెకర్యా
39.మలాకీ


కొత్త నిబంధన :


రెండవ భాగాన్ని కొత్త నిబంధన గ్రంథం అంటారు. గ్రీకులో యేసుక్రీస్తు జీవితచరిత్రనే నాలుగు సువార్తలుగా నలుగురు రాశారు. సెయింట్ పౌలు వివిధ సంఘాలకు రాసిన ఉత్తరాలు కూడా ఉన్నాయి.27 పుస్తకాలు ఇవి:

1.మత్తయి సువార్త
2.మార్కు సువార్త
3.లూకా సువార్త
4.యోహాను సువార్త
5.అపోస్తలుల కార్యములు
6.రోమీయులకు పత్రిక
7.I కొరంథీలకు పత్రిక
8.II కొరంథీయులకు పత్రిక
9.గలతీయులకు పత్రిక
10.ఎఫసీయులకు పత్రిక
11.ఫిలిప్పీయులకు పత్రిక
12.కొలొస్సైయులకు పత్రిక
13.I థెస్సలొనీకైయులకు పత్రిక
14.II థెస్సలొనీకైయులకు పత్రిక
15.I తెమొథెయుకు పత్రిక
16.II తెమొథెయుకు పత్రిక
17.తీతుకు పత్రిక
18.ఫిలేమోనుకు పత్రిక
19.హెబ్రీయులకు పత్రిక
20.యాకోబు పత్రిక
21.I పేతురు పత్రిక
22.II పేతురు పత్రిక
23.I యోహాను పత్రిక
24.II యోహాను పత్రిక
25.III యోహాను పత్రిక
26.యూదా
27.ప్రకటన గ్రంధము

కేథలిక్కు బైబిల్:

ఇందు లో అదనంగా ఉన్నగ్రంధాలు: 7 వీటిని దైవావేశితంకావనే కారణం చెబుతూ ప్రొటెస్టంటులు అంగీకరించరు.

1.తోబితు
2.యూదితు
3.మక్కబీయులు 1
4.మక్కబీయులు 2
5.సొలోమోను జ్ఞానగ్రంథము
6.సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము
7.బారూకు


తెలుగులో బైబిలు:

1812లో బైబిలులో కొంత భాగము తెలుగులో ప్రచురితమైంది. 1818లో క్రొత్త నిబంధన గ్రంధము ప్రచురించారు. 1854లో పూర్తి బైబిలును తెలుగులో ప్రచురించారు.

1842లో S.P.G. తెలుగు మిషను కడప జిల్లాలో ఆరంభమైంది. రెవ.విలియమ్ హొవెల్ 1842లోనే ప్రార్ధనల పుస్తకాన్ని, కొంత బైబిలును అనువదించాడు. 1858లో S.P.C.K. వారు మద్రాసులో దీనిని ప్రచురించారు. అంతకు ముందే 1849లో పి.ఆర్.హంట్ 'A Teloogoo translation of the Book of Common Prayer'ను మద్రాసు అమెరికన్ ప్రెస్సులో ప్రచురించాడు.

1880లో మద్రాసు డయోసియన్ కమిటీవారు S.P.C.K. ప్రెస్సులో సామాన్య ప్రార్ధనల పుస్తకాన్ని ప్రచురించారు.

కడప, ముత్యాలపాడులలో మిషనరీ కార్యములు నిర్వహించిన రెవ.జాన్ క్లే మంచి తెలుగు పండితుడు. ఆయన ఈ తెలుగు బైబిలును విస్తృతంగా సవరించాడు.

ఖురాన్

ఖురాన్ : కురాన్, ఖొరాన్, ఖుర్‌ఆన్, ఖొర్ఆన్, కొరాన్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.

కురాన్ అరబ్బీ భాష లో అల్లాహ్ (దేవుడు) ముహమ్మద్ ప్రవక్త ద్వారా మానవాళికి పంపిన ఇస్లాం మతము యొక్క చివరి పవిత్ర గ్రంధము.
అరబ్బీ భాషలో 'ఖుర్ ఆన్' అనగా 'చదువుట','వల్లె వేయుట' అని అర్ధము.





నేను మీదగ్గర రెండు వస్తువులు వదలిపెట్టి పోతున్నాను. ఈ రెండింటిని దృఢంగా పట్టుకొని ఆచరించేవారు ఎన్నటికీ దారి తప్పలేరు. వాటిలో ఒకటి దైవగ్రంధం (ఖుర్‌ఆన్). రెండవది నా ప్రవచనాలు, సంప్రదాయాలు (హదీసులు) - మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం - ఆయనపై శాంతి సౌభాగ్యాలు వర్షించుగాక).

ముసల్మానుల నమ్మకము ప్రకారము దేవుని సందేశాలు మొదటి ప్రవక్తయైన ఆదమ్ తో ప్రాంభింపబడి, షుహుఫ్ ఇ ఇబ్రాహిమ్, తోరాహ్ (మోషే ధర్మశాస్త్రము, పాతనిబంధన ), జబూర్ (దావీదు కీర్తనలు), ఇంజీల్ (క్రీస్తు సువార్త), వంటివానితో కొనసాగింపబడి, చివరకు మహమ్మదు ప్రవక్తకు తెలుపజేయబడిన ఖురాన్‌తో ముగిసినవి. పైన చెప్పిన గ్రంధాలలోని వివిధ సందేశాలను ఖుర్‌ఆన్ గుర్తిస్తుంది. యూదు, క్రైస్తవ గ్రంధాలలోని వివిధ ఘటనలు ఖొరాన్‌లో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, కొంత భేదాలతోగాని ప్రస్తావించబడ్డాయి.ఖుర్‌ఆన్ యొక్క సాధికారతను ఖొరానే స్పష్టంగా చెప్పింది. మిగిలిన విషయాన్ని ఇప్పుడు తెలియజేశాము. దీనికి రక్షణకూడా నిశ్చయంగా మేమే అని


.

కురాన్ కి ఉన్న ఇతర పేర్లు:

#వరుస సంఖ్య అరబ్బీ పేరు అంటే అర్ధం ఈ పేరన్న ఖురానువాక్యం కనీసం ఒకటి

1 కితాబ్ అల్లాహ్ గ్రంధం 2:2
2 కితాబ్-ఎ-ముబీన్ స్పష్టమైన ఆదేశాలు గలది 5:57
3 హుదా మార్గదర్శిని 2:120
4 ఫుర్‌ఖాన్ గీటురాయి 25:1
5 బుర్‌హాన్ ఆధారం, నిదర్శనం 4:174
6 మొయిజత్ హితోపదేశం 3:138
7 ముసద్దిఖ్ ధ్రువపచేది 5:46
8 బుష్రా శుభవార్త నిచ్చేది 17:105
9 హఖ్ సత్యం 10:108
10 జిక్రా జ్ఞాపకంవుంచుకొనేది 3:58
11 ఇల్మ్ జ్ఞానం 2:119
12 నూర్ వెలుగు 4:174
13 హకీం వివేచననిచ్చేది 36:1
14 ఇబ్రత్ గుణపాఠం నేర్పేది 12:111
15 రహ్మత్ కరుణగలది 6:157
16 బసాయిరున్ మనోనేత్రాలు తెరిచేది 28:43
17 షిఫా రోగనివారిణి, పిచ్చికుదిర్చేది 10:57, 17:82
18 ముఫస్సల్ సవివరమైనది 6:114
19 మీజాన్ ధర్మకాటా 42:17
20 ముహైమిన్ రక్షించేది 5:48
21 ఇమాం మార్గదర్శి, సారధి, నాయకుడు 16:89
22 మజీద్ మహిమ గలది 46:1
23 కరీం గౌరవప్రదమైనది, ఉన్నతమైనది 56:77
24 ఖురాన్ చదివేది 2.185
25 ముబీన్ స్పష్టమైనది 43.2
26 కలామల్లాహ్ అల్లాహ్ వాక్కులు (దేవుని మాటలు) 2.75
27 మౌవిజాహ్ హెచ్చరించేది 3.138
28 అలియ్యు ఉన్నతమైనది 43.4
29 ముబారక్ దీవెనకరమైనది 6.155
30 బయాన్ ప్రకటన 3.138
31 అజబ్ ఆశ్చర్యకరమైనది 72.1
32 తజ్కిరా బుద్ధిచెప్పేది 73.19
33 ఉర్వతిల్ ఉత్కా నమ్మకంగా నడిపించేది 31.22
34 సిద్క్ సత్యం 39.33
35 హిక్మా పనిచేసే జ్ఞానం 54.5
36 అదల్ ఖచ్చితమైనది 6.115
37 అమ్రుల్లాహ్ దేవుని ఆజ్ఞ 65.5
38 మునాది పిలిచేది 3.193
39 నజీర్ గెలిచేది 41.4
40 అజీజ్ అజేయమైనది 41.41
41 బలగ్ సందేశమిచ్చేది 14.52
42 సుహుఫిమ్ ముకర్రమ ఘనతగల గ్రంధాలు 80.13
43 మర్ఫువా గొప్పది 80.14
44 ముసద్దిఖ్ సాక్షి 2.89
45 బుర్హాన్ ఋజువు 4.174
46 ముహైమిన్ సంరక్షిణి 5.48
47 హబల్ అల్లాహ్ దేవుని త్రాడు 3.103
48 ఫజల్ ముగించేది 86.13
49 అహ్ సనుల్ హదీస్ అందమైన దైవ సందేశం 39.23
50 ఖయ్యీం తిన్ననిది 98.3
51 మథనీ సరిపడేది 39.23
52 ముత్షబీ అలంకారికమైనది 39.23
53 తంజీల్ బయలుపరచినది 56.80
54 రూహ్ ఆత్మ 42.52
55 వహీ దైవ సందేశం 21.45
56 హక్కుల్ యకీన్ స్థిరమైన సత్యం 56.95
57 అరబీ అరబ్బీలో వచ్చింది 12.2

*అర్ధంకాని అరబ్బీ పారాయణం కంటే మాతృభాషలో అర్ధం చేసుకుంటూ చదవటం ఎంతో మేలు.


ఖుర్‌ఆన్ విభాగాలు

.ఖొరాన్‌లో మొదటి ఉపోద్ఘాత ప్రార్ధనా విభాగం తరువాత మొత్తం 114 సూరాలు (అధ్యాయాలు) ఉన్నాయి. మొత్తం సూక్తులు (ఆయత్ లు) 6236, మొత్తం పదాలు 86430, మొత్తం అక్ష రాలు 323760, మొత్తం ఖురాన్ అవతరించిన కాలం 22 సంవత్సరాల 5 నెలల 14 రోజులు, వ్రాసి భద్రపరచిన అనుచరులు (సహాబీలు)40 మంది. మక్కాలో వచ్చిన సూరాలు90, మదీనాలో వచ్చిన సూరాలు 24. ఖురాన్లో అల్లాహ్ పేరు 2697 సార్లు వస్తే ముహమ్మద్ అనే పేరు 4 సార్లు, అహ్మద్ అనే పేరు ఒక్క సారే వచ్చింది. 26గురు ప్రవక్తల పేర్లు ప్రస్తావించబడ్డాయి. మానవ సృష్టి నుండి మొత్తం ప్రవక్తల సంఖ్య 124000. [16] మొదట్లో ఉన్న పెద్ద అధ్యాయాలలో మొహమ్మదు తన చివరికాలంలో చెప్పిన ప్రవచనాలు ఉన్నాయి. చివరిలో ఉన్న చిన్న అధ్యాయాలలో మొహమ్మదుకు తెలియజేయబడిన మొదటి సందేశాలున్నాయి. [17][18]

ఒక్కొక్క సూరాకు ఆ విభాగంలోని ప్రధాన విషయానికి సంబంధించిన శీర్షిక చెప్పబడింది.

హిజ్బ్ లేదా మంజిల్ విభాగాలు


మొదటి విభాగమైన సూరా అల్-ఫాతిహా ను మిహాయించి మిగిలిన కొన్న్ని కొన్ని సూరాలను ఒక హిజ్బ్‌గా విభజించారు. 65 సూరాలు కలిగి ఉన్న ఏడవ హిజ్బ్ ను హిజ్బ్ ముఫాసిల్ అని కూడా అంటారు.

1వ మంజిల్ = 3 సూరాలు (2 నుండి 4 వరకు)
2వ మంజిల్ = 5 సూరాలు (5 నుండి 9 వరకు)
3వ మంజిల్ = 7 సూరాలు (10 నుండి 16 వరకు)
4వ మంజిల్ = 9 సూరాలు (17 నుండి 25 వరకు)
5వ మంజిల్ = 11 సూరాలు (26 నుండి 36 వరకు)
6వ మంజిల్ = 13 సూరాలు (37 నుండి 49 వరకు)
7వ మంజిల్ = 65 సూరాలు (50 నుండి 114 వరకు)


ఖుర్‌ఆన్ ఆవిర్భావం

ప్రవక్తగా గుర్తింపబడడానికి ముందు ముహమ్మద్ తరచుగా మక్కా పట్టణం వెలుపల ఉన్న హీరా గుహ లో దైవధ్యానంలో నిమగ్నుడై ఉండేవాడు. అప్పుడు ఆయనకు దైవదూత అయిన జిబ్రయీల్ (అలైహిస్సలాం - ఆయనకు శాంతి కలుగుగాక) కాంతిమయంగా కనపడి చదువు అని గంభీరమైన స్వరంతో అన్నారు. తనకు చదువురాదని ముహమ్మద్ చెప్పినా అదే ఆదేశం వినిపించింది. చకితుడైన మహమ్మదు ఇంటికి వచ్చి భార్య ఖదీజా (రజిల్లాహు అన్హు - తనపట్ల దేవుడు ప్రసన్నుడగుగాక) కు ఈ విషయం చెప్పాడు. ఆమె తన బంధువు వరఖా బిన్‌ నౌఫల్‌ తో సంప్రదించి, ముహమ్మద్ ను ప్రోత్సహించింది. ఇలా ప్రారంభమయిన దైవ సందేశావతరణ 23 సంవత్సరాలు కొనసాగింది. అల్లాహ్ సందేశాలు అందుకొన్నపుడల్లా ముహమ్మద్ విచిత్రమైన అనుభూతికి లోనయ్యేవారు.

ముహమ్మద్ ప్రవక్త తనకు తెలియజేయబడిన సందేశాలను ప్రకటిస్తూ వుండగా ఆయన సహచరులు వాటిని విని తమకు ఏది అందుబాటులో ఉంటే దానిపై వ్రాశారు. రాసిన తరువాత లేఖకుడు ముహమ్మద్ కు అది చదివి వినిపించేవాడు. అదిగా సరిగా వ్రాశారని నిర్ధారించుకొన్న తరువాత దానిని భద్రపరచేవారు.

ఆదినుండి ఇస్లాం సంప్రదాయం ప్రకారం నమాజ్ లో ఖుర్‌ఆన్ సూక్తులు పఠించడం వలన ఆ సూక్తులను పలువురు కంఠస్తం చేశారు. ఇక చదవడం, రాయడం వచ్చిన సహాబీలు (ప్రవక్త ప్రత్యక్ష అనుచరులు) వివిధభాగాలను స్వయంగా రాసుకొని దాచుకొనేవారు.

(సున్నీ సంప్రదాయానుసారం) ఆ మహనీయుని నిర్యాణానంతరం ఆయన మొదటి ప్రతినిధి (ఖలీఫా) హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రజిల్లాహు అన్హు - తనపట్ల దేవుడు ప్రసన్నుడగుగాక) వివిధ ప్రాంతాలలో ఉన్న హాఫిజ్ అల్ ఖురాన్ (ఖుర్‌ఆన్ స్మర్త) లందరినీ రాజధానికి రావించి, జాయెద్ ఇబిన్ తాబిత్ అల్-అన్సారీ అధ్వర్యంలో ఖురాన్ ను ఒక ప్రామాణిక సంపూర్ణ గ్రంధంగా కూర్పించారు. 'ఆ ప్రతి అబూబక్ర్ వద్ద, అతని మరణానంతరం ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ వద్ద, అతని అనంతరం ఒమర్ కూతురు హఫ్సా బింతె ఉమర్ వద్ద ఉన్నది. [19] మూడవ ఖలీఫా హజ్రత్ ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ (రజిల్లాహు అన్హు - తనపట్ల దేవుడు ప్రసన్నుడగుగాక) పాలనా కాలంలో దాని ప్రతులు తీయించి అధికారికంగా ముస్లిం మతం ప్రచారంలో ఉన్న వివిధ ప్రాంతాలకు పంపించారు. వాటిలో రెండు ప్రతులు ఈనాటికి కూడా లభ్యమౌతున్నాయి. ఖురాన్ ఆదినుండీ ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా పరంపరాగతంగా తరతరాలుగా అందింపబడుతున్నది అని వివిధ పరిశోధనలద్వారా ధృవీకరింపబడింది.


అరబీ భాష, ఖురాన్

ఖుర్‌ఆన్ అవతరించిన అరబ్బీ భాష దాదాపు యాభయ్ కోట్ల మంది ప్రజలకు, 20 పైచిలుకు దేశాలలో మాతృభాషగా ఉంది. వ్యాకరణం, పదకోశం, ఉచ్చారణ, నుడికారాలు ఈ 1400 సంవత్సరాలలో స్థిరంగా ఉన్నందున ఆనాటి అరబ్బులలాగానే ఈనాడు అరబ్బీ భాష మాటలాడేవారు కూడా చదివి అర్ధం చేసుకోగలరు.


ఖురాన్ శైలి విశిష్టమైనదని సర్వత్రా గుర్తిస్తారు. అందులోని పదజాల సౌందర్యం వలన ఇది ప్రాసయుక్తమైన గద్యమని, గద్యరూపంలో ఉన్న పద్యమని వివిధ అభిప్రాయాలున్నాయి. ఇందులో పద్యానికి ఉండవలసిన లాక్షణిక నియతి ఏదీ లేకపోయినా భావగర్భితమైన పదబంధాలు, కవితా సృష్టిలోని నుడికారపు సొంపులు, పదాలంకరణలు మాత్రం ఉన్నాయి. అలాగే మరొకవైపు గద్యానికి వుండవలసిన భావగాంభీర్యం, భావ సమగ్రత, విషయానుశీలనం, వాక్యాల పటుత్వం కొట్టవచ్చినట్లు కన్పిస్తాయి. అయినా ఖురాన్ శైలి గ్రంధ రచనలా వుండదు. ఇది పూర్తిగా ప్రసంగ ధోరణిలో సాగుతుంది.



ఖుర్‌ఆన్ సవాలు


మహమ్మదీయుల విశ్వాసం ప్రకారం ఖుర్‌ఆన్‌లో చెప్పబడిన విషయం అద్భుత సత్యమవడమే కాదు. ఖుర్‌ఆన్ ఆవిర్భావమే ఒక అద్భుతం. ఇది స్వయంగా దైవవాణి. మనిషిచే రచింపబడే అవకాశమే లేదు. ఈ విషయం నిరూపించడానికి ఖుర్‌ఆన్‌లోనే సవాలులు ఉన్నాయి.

"వారు ఖుర్‌ఆన్‌ను గురించి ఆలోచించరా? ఇది అల్లాహ్ వద్దనుండి గాక మరెవరివద్దనుండో వచ్చివుంటే ఇందులో ఎంతో భావవైరుధ్యం ఉండేది గదా?" (4:82)
"మానవజాతి అంతా కలిసి తమ శక్తినంతా కలిపి ధారపోసినా ఇటువంటి గ్రంధాన్ని రచింపజాలరు (17:88)
ఒకవేళ మా దాసునిపై అవతరింపజేసిన ఈ గ్రంధం పట్ల మీకేమైనా అనుమానం ఉంటే, ఇందులో ఉన్నటువంటి ఓ అధ్యాయం రచించి తీసుకురండి. ఈ పనికోసం ఒక్క దేవుడ్ని వదలి మీ సహాయకులందరినీ పిలుచుకోండి. మీరు సత్యమంతులైతే ఈ పని చేసి చూపండి. మీరీ పని చేయలేకపోతే .... ఎంతమాత్రం చేయలేరు.... మనుషులు, పాషాణాలు ఇంధనం కాగల నరకాగ్నికి భయపడండి. సత్య తిరస్కారులకోసం అది సిద్ధంగా ఉంది. (2:23)
ఈ విధమైన సవాలులను ఎదుర్కొనే ప్రయత్నాలు (ముస్లిమేతరుల చేత) జరిగాయిగాని వాటిని ముస్లిం పండితులు ఆమోదించలేదు.



ఖురాన్ సూరాల జాబితా


ఖురాన్ లో 114 సూరాలు గలవు. క్రింది సూరా పేర్లను చూడండి:


సూచన : 'మక్కీ' అనగా మక్కాలో, 'మదనీ' అనగా మదీనాలో అవతరించ (ప్రకటింప) బడినవి.

సంఖ్య సూరా పేరు తెలుగార్థం ఆయత్ లు లేదా సూక్తులు రుకూలు మక్కీ / మదనీ
1 అల్-ఫాతిహా పరిచయం/ప్రారంభం 7 1 మక్కీ
2 అల్-బఖరా గోవు 286 40 మదనీ
3 ఆల్-ఎ-ఇమ్రాన్ ఇమ్రాన్ (మూసా తండ్రి) కుటుంబం 200 20 మదనీ
4 అన్-నిసా స్త్రీలు 176
5 అల్-మాయిదా వడ్డించినవిస్తరి 120
6 అల్-అన్ఆమ్ పశువులు 165
7 అల్-ఆరాఫ్ శిఖరాలు 206
8 అల్-అన్ఫాల్ సమర సొత్తు 75
9 అత్-తౌబా పశ్చాత్తాపం 129
10 యూనుస్ యూనుస్ 109
11 హూద్ హూద్ 123
12 యూసుఫ్ యూసుఫ్ 111
13 అర్-రాద్ మేఘ గర్జన 43
14 ఇబ్రాహీం ఇబ్రాహీం 52
15 అల్-హిజ్ర్ హిజ్ర్ వాసులు 99
16 అన్-నహల్ తేనెటీగ 128
17 బనీ ఇస్రాయీల్ ఇస్రాయీల్ సంతతి 111
18 అల్-కహఫ్ మహాబిలం 110
19 అల్-మర్యం మరియం (ఈసా తల్లి) 98
20 తాహా తాహా 135
21 అల్-అంబియా దైవ ప్రవక్తలు 112
22 అల్-హజ్ హజ్ యాత్ర 78
23 అల్-మోమినీన్ విశ్వాసులు 118
24 అన్-నూర్ జ్యోతి 64
25 అల్-ఫుర్ ఖాన్ గీటురాయి 77
26 అష్-షుఅరా కవులు 227
27 అన్-నమల్ చీమలు 93
28 అల్-ఖసస్ గాధలు 88
29 అల్-అన్కబూత్ సాలెపురుగు 69
30 అర్-రూమ్ రోమ్ వాసులు 60
31 లుఖ్ మాన్ లుఖ్ మాన్ 34 4 మక్కీ
32 అస్-సజ్దా సాష్టాంగ ప్రమాణము 30 3 మక్కీ
33 అల్-అహ్ జబ్ సైనిక దళాలు 73 9 మదనీ
34 సబా సబా జాతి 54 6 మక్కీ
35 ఫాతిర్ సృష్టికర్త 45 5 మక్కీ
36 యాసీన్ యాసీన్ 83 5 మక్కీ
37 అల్-సాఫ్ఫత్ (పంక్తులు తీరినవారు) 182 5 మక్కీ
38 సాద్ సాద్ 88 5 మక్కీ
39 అజ్-జుమర్ బృందాలు 75 8 మక్కీ
40 అల్-మోమిన్ విశ్వాసి 85 9 మక్కీ
41 హా మీమ్ హా మీమ్ 54 6 మక్కీ
42 అష్-షూరా సలహా సంప్రదింపులు 53 5 మక్కీ
43 అజ్-జుఖ్రుఫ్ బంగారు నగలు 89 7 మక్కీ
44 అద్-దుఖాన్ పొగ 59 3 మక్కీ
45 అల్-జాసియా కూలబడినవాడు 37 4 మక్కీ
46 అల్-అహ్ ఖఫ్ ఇసుక కొండల నేల 35 4 మక్కీ
47 ముహమ్మద్ ముహమ్మద్ 38 4 మదనీ
48 అల్-ఫతహ్ విజయం 29 2 మదనీ
49 అల్-హుజూరాత్ నివాస గ్రహాలు 18 2 మదనీ
50 ఖాఫ్ ఖాఫ్ 45 3 మక్కీ
51 అజ్-జారియా గాలి దుమారం 60 3 మక్కీ
52 అత్-తూర్ తూర్ పర్వతం 49 2 మక్కీ
53 అన్-నజ్మ్ నక్షత్రం 62 3 మక్కీ
54 అల్-ఖమర్ చంద్రుడు 55 3 మక్కీ
55 అర్-రహ్మాన్ కరుణామయుడు 78 3 మదనీ
56 అల్-వాఖియా సంఘటన 96 3 మక్కీ
57 అల్-హదీద్ ఇనుము 29 4 మదనీ
58 అల్-ముజాదిలా వాదిస్తున్న స్త్రీ 22 3 మదనీ
59 అల్-హష్ర్ దండయాత్ర 24 3 మదనీ
60 అల్-ముమ్ తహినా పరీక్షిత మహిళ 13 2 మక్కీ
61 అస్-సఫ్ఫ్ సైనిక పంక్తి 14 2 మదీనా
62 అల్-జుమా సప్తాహ సమావేశం (శుక్రవారం) 11 2 మదనీ
63 అల్-మునాఫిఖూన్ కపట విశ్వాసులు 11 2 మదనీ
64 అత్-తగాబూన్ జయాపజయాలు 18 2 మదనీ
65 అత్-తలాఖ్ విడాకులు (ఇస్లాం) 12 2 మదనీ
66 అత్-తహ్రీమ్ నిషేధం 12 2 మదనీ
67 అల్-ముల్క్ విశ్వ సార్వభౌమత్వం 30 2 మక్కీ
68 అల్-ఖలమ్ కలం 52 2 మక్కీ
69 అల్-హాక్ఖా పరమ యదార్థం 52 2 మక్కీ
70 అల్-మారిజ్ ఆరోహణా సోపానాలు 44 2 మక్కీ
71 నూహ్ నూహ్ 28 2 మక్కీ
72 అల్-జిన్న్ జిన్ 28 2 మక్కీ
73 అల్-ముజమ్మిల్ దుప్పట్లో నిదురించేవాడు 20 2 మక్కీ
74 అల్-ముదస్సిర్ దుప్పట్లో పడుకున్నవాడు 56 2 మక్కీ
75 అల్-ఖియామా ప్రళయం 40 2 మక్కీ
76 అద్-దహ్ర్ సమయం 31 2 మక్కీ
77 అల్-ముర్సలాత్ రుతుపవనాలు 50 2 మక్కీ
78 అన్-నబా సంచలనాత్మక వార్త 40 1 మక్కీ
79 అన్-నాజియాత్ దూరి లాగేవారు 46 2 మక్కీ
80 అబస భృకుటి ముడిచాడు 42 1 మక్కీ
81 అత్-తక్వీర్ చాప చుట్టలా 29 1 మక్కీ
82 అల్-ఇన్ ఫితార్ బీటలు 19 1 మక్కీ
83 అల్-ముతఫ్ఫిఫీన్ హస్తలాఘవం 36 1 మక్కీ
84 అల్-ఇన్ షిఖాఖ్ ఖండన 25 1 మక్కీ
85 అల్-బురూజ్ ఆకాశ బురుజులు 22 1 మక్కీ
86 అత్-తారిఖ్ ప్రభాత నక్షత్రం 17 1 మక్కీ
87 అల్-అలా మహోన్నతుడు 19 1 మక్కీ
88 అల్-ఘాషియా ముంచుకొస్తున్న ముప్పు 26 1 మక్కీ
89 అల్-ఫజ్ర్ ప్రాత॰కాలం (ఫజ్ర్) 30 1 మక్కీ
90 అల్-బలద్ పట్టణం 20 1 మక్కీ
91 అష్-షమ్స్ సూర్యుడు 15 1 మక్కీ
92 అల్-లైల్ రాత్రి (లైల్) 21 1 మక్కీ
93 అజ్-జుహా పగటి వెలుతురు 11 1 మక్కీ
94 అలమ్ నష్‌రహ్ మనశ్శాంతి 8 1 మక్కీ
95 అత్-తీన్ అంజూరం 8 1 మక్కీ
96 అల్-అలఖ్ గడ్డకట్టిన రక్తం 19 1 మక్కీ
97 అల్-ఖద్ర్ ఘనత 5 1 మక్కీ
98 అల్-బయ్యినా విస్పష్ట ప్రమాణం 8 1 మదనీ
99 అజ్-జల్ జలా భూకంపం 8 1 మదనీ
100 అల్-ఆదియాత్ తురంగం 11 1 మక్కీ
101 అల్-ఖారిఅ మహోపద్రవం 11 1 మక్కీ
102 అత్-తకాసుర్ ప్రాపంచిక వ్యామోహం 8 1 మక్కీ
103 అల్-అస్ర్ కాల చక్రం 3 1 మక్కీ
104 అల్-హుమజా నిందించేవాడు 9 1 మక్కీ
105 అల్-ఫీల్ ఏనుగు 5 1 మక్కీ
106 ఖురైష్ ఖురైషులు 4 1 మక్కీ
107 అల్-మాఊన్ సాధారణ వినియోగ వస్తువులు 7 1 మక్కీ
108 అల్-కౌసర్ శుభాల సరోవరం 3 1 మక్కీ
109 అల్-కాఫిరూన్ అవిశ్వాసులు 6 1 మక్కీ
110 అన్-నస్ర్ సహాయం 3 1 మక్కీ
111 అల్-లహబ్ అగ్నిజ్వాల 5 1 మక్కీ
112 అల్-ఇఖ్లాస్ ఏకేశ్వరత్వం 4 1 మక్కీ
113 అల్-ఫలఖ్ అరుణోదయం 5 1 మక్కీ
114 అల్-నాస్ మానవాళి 6 1 మక్కీ

భగవద్గీత

భగవద్గీత , మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.


భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.


భగవద్గీత ఆవిర్భావం:--

భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రధసారధి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారూ శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రధాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రధ సారధి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.



భగవద్గీత విశిష్టత:--


భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తులు ఇవి:

సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః
పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్
శ్రీకృష్ణుడను గొల్లవాడు ఉపనిషత్తులనెడు గోవులనుండి అర్జునుడనెడి దూడను నిమిత్తముగా చేసికొని గీత అను అమృతమును పితికెను. బుద్ధిమంతులు అంతా ఈ గీతామృతమును పానము చేయవచ్చును.
ప్రతి వ్యక్తి గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవిపవలెను. అది పద్మనాభుని ముఖ కమలమునుండి ప్రభవించినది. (మహాభారతం - భీష్మ పర్వం)
నేను గీతను ఆశ్రయించి ఉందును. గీత నా నివాసము. గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లే (వరాహ పురాణం)
నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినమూ దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు. (మహాత్మా గాంధీ)


భగవద్గీతలో ముఖ్య విషయాలు:--

గీతా సారము

(భగవద్గీత గురించి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. ఎందరో పండితులు, సామాన్యులు, ఔత్సాహికులు కూడా అర్ధాలు, అంతరార్ధాలు, సందేశాలు, విశేషాలు వివరించారు. కనుక "భగవద్గీత సారం" అన్నవిషయం ఇది వ్రాసేవారికి "అర్ధమయినంత, తోచినంత" అని గ్రహించాలి)

కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చును. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరెవరికీ తెలియని అనేక విషయాలు బోధిస్తాడు.


ఆత్మ నిత్య సత్యమైనది మరియు చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన మరియు జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును.


మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి.


కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భగవంతుని అంశతోనే ఉన్నవి. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునకే చెందుతాయి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసాదించాడు. అనంతము, తేజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయిన ఆ శ్రీకృష్ణుని విశ్వ రూపాన్ని చూసి అర్జునుడు తరించాడు.


ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్తమోగుణాలచే నిండి ఉన్నాయి. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాల బంధంనుండి విముక్తి లభిస్తుంది.





ఆత్మ తత్వము



జీవన కర్తవ్యము - కర్మ, జ్ఞానము, భక్తి



యోగ సాధన



భగవత్తత్వము



శ్రద్ధ, గుణ విభాగము



భగవద్గీత విభాగాలు:


భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు. వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మషట్కము" అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అని అంటారు. 13 నుండి "జ్ఞాన షట్కము". ఒక్కొక్క యోగంలోని ప్రధాన విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.



అర్జునవిషాద యోగము:

"ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో నావారు, పాండుపుత్రులు ఏమి చేశారు సంజయా?" అనే ధృతరాష్ట్రుని ప్రశ్నతో ఈ యోగం మొదలవుతుంది. తరువాత సంజయుడు అక్కడ జరిగినదంతా చెబుతాడు. మొదట ఇరు పక్షాల సేనలను సంజయుడు వర్ణిస్తాడు. అర్జునుని కోరికపై పార్ధసారధియైన కృష్ణుడు ఉభయసేనల మధ్య రధాన్ని నిలిపాడు. అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు,మిత్రులను చూశాడు. - వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు. నేను యుద్ధం చేయను. నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్ధించాడు.


సాంఖ్య యోగము:


సాంఖ్యము అనగా ఆత్మానాత్మ వివేచన. కర్తవ్య విమూఢుడైన అర్జునుని కృష్ణుడు మందలించాడు. తరువాత అర్జునునికి ఆత్మ తత్వాన్ని బోధించాడు. తానే చంపేవాడినన్న భ్రమ వద్దని తెలిపాడు. ఇది గీతలోని తత్వం విశదపరచిన ప్రధానాధ్యాయం. దీనిని సంక్షిప్త గీత అని కూడా అంటారు. శరీరానికి, ఆత్మకు ఉన్న భేదాన్ని భగవంతుడు వివరించాడు. ఆత్మ శాశ్వతమని, దానికి మరణం లేదని, ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని వివరించాడు. దానికి శీతోష్ణ సుఖదుఃఖాలవంటి ద్వంద్వాలు లేవు. ఇంద్రియాలకు విషయ సంపర్కం వలన ద్వంద్వానుభవాలు కలుగుతుంటాయి. సుఖ దుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు వంటి ద్వంద్వ విషయాలపట్ల సమబుద్ధిని కలిగి ఫలాపేక్ష రహితంగా కర్మలు చేయాలి. సుఖము పట్ల అనురాగము, దుఃఖము పట్ల ఉద్విగ్నము లేకుండా కర్మలు చేసేవాడు, ఇంద్రియాలను వశంలో ఉంచుకునేవాడు, అహంకార మమకారాములు వీడినవాడు, బుద్ధిని ఆత్మయందే లగ్నము చేసినవాడు స్థితప్రజ్ఞుడు.


కర్మ యోగము:



కర్మలన్నింటినీ ఆవరిచుకొని కొంత దోషం ఉంటుంది. అలాగని కర్మలు చేయకుండా జీవనం సాధ్యం కాదు. కర్మలవలన సంభవించిన బంధమే జీవుడిని జనన మరణ చక్రబంధంలో కట్టివేస్తుంది. అయితే అహంభావాన్ని, ఫలవాంఛను వీడి కర్మలను ఆచరిస్తే కర్మ బంధాలనుండి విముక్తులు కావచ్చును. అందువలన

1.యుక్తమైన కర్మలు చేస్తూనే ఉండాలి. వాటి ఫలితాన్ని గురించి ఆశించరాదు. అలాగని కర్మలు చేయడం మానరాదు. ఫలితం ప్రియమైనా, అప్రియమైనా గాని దానిని సమబుద్ధితో స్వీకరించాలి.
2.కర్మల పట్ల సంగము (ఆసక్తి, వ్యామోహం) పెంచుకోకూడదు. కార్యం సిద్ధించినా సిద్ధింపకున్నా గాని సమభావం కలిగి ఉండాలి. ఫలాపేక్ష లేకుండా చేసేదే నిష్కామ కర్మ. ఫలాపేక్షతో చేసే కామ్యకర్మలు నీచమైనవి.
3.లోక కళ్యాణం కోసం చేసే కర్మలు భగవంతునికి ప్రీతికరమైనవి. ఇవి బంధం కలిగించవు. మోక్షప్రదాలు.
ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ పవిత్రమైన యజ్ఞం వంటిది. ఇదే కర్మ యోగము.



జ్ఞాన యోగము:


ఆత్మను, పరమాత్ముని గురించిన జ్ఞానమే మోక్షప్రదము. అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది. నిష్కామ కర్మ వలన శుద్ధమైన చిత్తం జ్ఞానోదయానికి సరైన క్షేత్రం. ఈ పరమ జ్ఞానాన్ని పురాతనకాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించాడు. లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి యుగయుగమున భగవంతుడు అవతరిస్తాడు. ఈ అధ్యాయంలో కృష్ణుడు తన పరమాత్మ తత్వాన్ని ఇలా బోధించాడు -


" ధర్మానికి హాని కలిగి ఆదర్మం పెచ్చుమీరినపుడు నేను సాధుసంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ పునస్థాపన కోసం ప్రతియుగంలోనూ అవతరిస్తుంటాను. నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, జనన మరణ రహితుడను అయినా గాని నా మాయాశక్తిచే నన్ను నేను సృజించుకొంటుంటాను. మానవులు నన్ను ఏవిధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తుంటాను. రాగ భయ క్రోధాదులను త్యజించి నన్నే ధ్యానించేవారు నన్ను పొందుతారు. కర్మ ఫలాసక్తిని విడచి, నిత్య తృప్తుడై, అహంకార మమకారాలను పరిత్యజించి, సుఖదుఃఖాలకు అతీతుడైన, సమదృష్టి కలిగిన, త్యాగబుద్ధి కలిగిన సాధకునికి జ్ఞానం సులభంగా లభిస్తుంది. జ్ఞానంతో సమానమైన పావనకరమింకొకటి లేదు. ఇంద్రి నిగ్రహము, శ్రద్ధ కలిగి, ఆత్మ ధ్యానం చేసే సాధకునికి పరమశాంతిని ప్రసాదించే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు ఇహపరలోకాలలోనూ శాంతిని పొందలేడు."


కర్మసన్యాస యోగము:


ఇంతకూ కర్మను చేయాలా? త్యజించాలా? అని అర్జునుడి సందేహం. అందుకు కృష్ణుడు చెప్పిన సమాధానం - "కర్మ చేయకుండా ఉండడం కర్మ సన్యాసం కాదు. నిష్కామ కర్మ ఆచరిస్తూ, కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ సాధన ధ్యానయోగానికి దారి తీస్తుంది. ఫలాసక్తిని విడచి, బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వమూ బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఈ సమత్వమే బ్రహ్మజ్ఞానానికి అత్యవసరం. ఎల్లపుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడు"


ఆత్మసంయమ యోగము:


ఈ అధ్యాయంలో వివిధ యోగసాధనా విధానాలు చెప్పబడ్డాయి. ఇంద్రియ మనో బుద్ధులను అదుపులో ఉంచుకొని ధ్యానంలో మనసు నిలుపుకోవాలి. ఇది సులభం కాదు. ఈ ప్రయత్నంలో ఎవరిని వారే నిగ్రహించుకొని ఉద్ధరించుకోవాలి. ధ్యానం సరిగా సాగాలంటే ఆహారం, నిద్ర, వినోదం, సౌఖ్యం వంటి విషయాలలో సంయమనం పాటించాలి. అతి ఎక్కడా కూడదు. మనస్సు చంచలం కనుక అది చెదిరిపోతూ ఉంటుంది. అభ్యాసం, వైరాగ్యం అనే బలమైన సాధనల ద్వారా మనసును నిగ్రహించుకొనవచ్చును. ధ్యానానికి అంతరాయం కలిగే సంకల్పాలను దూరంగా ఉంచాలి. సమస్త ప్రాణుల సుఖదుఃఖాలనూ తనవిగా తలచి వాటిపట్ల దయ, కరుణ, ఆర్ద్రత, సహాయత చూపాలి. ఒకవేళ యోగసాధన మధ్యలో ఆగిపోయినా దాని ఫలితం వలన ముందుజన్మలో జీవుడు యోగోన్ముఖుడై గమ్యాన్ని చేరగలడు.


జ్ఞానవిజ్ఞాన యోగము:


విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం. ఈ అధ్యాయంలో భగవంతుని తత్వం గూర్చిన జ్ఞానం, ఆయన స్వరూపము, మాయ, సర్వాంతర్యామిత్వం పరిచయం చేయబడినాయి. ఆయనకు శరణుజొచ్చుట మాత్రమే సరయిన భక్తిమార్గం. వారికే ఆయన కరుణ లభిస్తుంది. వేలాదిలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై ప్రయత్నిస్తాడు. వారిలో ఏఒక్కడో భగవంతుని తెలుసుకోగలుగుతాడు.


భగవంతుని ప్రకృతి (మాయ) మనస్సు, బుద్ధి, అహంకారము, పంచభూతములు అనే ఎనిమిది తత్వాలుగా విభజింపబడింది. ఇది అపరా ప్రకృతి. ఇంతకంటె ఉత్తమమైనది పరాప్రకృతి భగవంతుని చైతన్యము. ఈ రెండింటి సంయోగం వలన సృష్టి జరుగుతుంది. మణిహారంలో సూత్రంలాగా భగవంతుడు విశ్వమంతటా వ్యాపించియున్నాడు. భగవంతుకంటె వేరుగా ఏదీ లేదు.


ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే నాలుగు విధాలైన భక్తులు భగవంతుని ఆరాధిస్తారు. వారిలో జ్ఞాని సర్వమూ వాసుదేవమయమని తెలుసుకొని కొలుస్తృఆడు గనుక అతడు భగవంతునికి ప్రియతముడు. అనేక దేవతల రూపాలలో భగవంతుని ఆరాధించే భక్తులను ఆయా దేవతలస్వరూపంలో వాసుదేవుడు అనుగ్రహిస్తాడు. దేవతలనారాధించేవారు దేవతలను, సర్వేశ్వరుని ఆరాధించేవారు సర్వేశ్వరుని పొందుతారు. జన్న జరా మరణాలనుండి మోక్షాన్ని పొందగోరినవారు దేవదేవుని (వాసుదేవుని) ఆశ్రయించి, సమస్తమూ ఆ బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మమును పొందుతారు.


అక్షరపరబ్రహ్మ యోగము:


బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము అనే విషయాల వివరణ ఈ అధ్యాయంలో చెప్పబడింది. నిత్యమైన, సత్యమైన పరమ పదము, పరబ్రహ్మము గూర్చి చెప్పబడినది.


క్షరము అనగా నశించునది. నాశరహితమైన పరబ్రహ్మమే అక్షరము. జన్మరాహిత్యం గురించి బోధించేది ఆత్యమ విద్య. అంత్యకాలంలో భగవంతుని ధ్యానిస్తూ దే్హాన్ని త్యజించేవాడు నిస్సందేహంగా పరబ్రహ్మమును చేరుకొంటాడు. ఓంకారాన్ని ఉచ్ఛరిస్తూ దేహాన్ని విడచేవాడు పరమపదాన్ని పొందుతాడు. అన్య చింతన లేకుండా నిశ్చల మనస్సుతో సదా స్మరణ చేసేవానికి ఇది సాధ్యమౌతుంది. అలా భగవంతుని పొందినవానికి పునర్జన్మ లేదు. బ్రహ్మ చేసిన సృష్టి మరల బ్రహ్మకు రాత్రి కాగానే లయిస్తుంది. సమస్తమూ నశించినా నిశ్చలంగా ఉండే పరబ్రహ్మ స్థానం శ్రీకృష్ణుని ఆవాసం. అక్కడికి చేరినవారికి తిరిగి వెళ్ళడం ఉండదు. అనన్య భక్తి చేతనే ఆ దివ్యపదాన్ని చేరుకోగలరు.


రాజవిద్యారాజగుహ్య యోగము:


కర్మ యోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, జ్ఞాన విజ్ఞాన యోగములలో జీవన విధానానికి మార్గం, భగవత్ప్రాప్తికి సాధనం నిర్దేశించబడినాయి. అక్షర పరబ్రహ్మ యోగంలో పరబ్రహ్మాన్ని గురించిన పరిచయం జరిగింది. 9న అధ్యాయం అయిన "రాజవిద్యా రాజగుహ్య యోగము" కృష్ణుడు తానే భగంతుడనని, సృష్టి స్థితి లయ కారకుడనని తెలిపాడు. ఇది పవిత్రమైన జ్ఞానము. అన్నింటా విస్తరించిన పరమాత్ముని గురించి, ఆయనను పొందు విధము గురించి చెప్పబడినది. కృష్ణుడు ఈ యోగంలో చెప్పిన విషయ సారాంశం.

" విద్యలలో ఉత్తమమైనది, అతి నిగూఢమయినది ఈ బ్రహ్మ విద్య. జీవుని మోక్ష రహస్యాన్ని తెలియజేస్తుంది. అర్జునా! నా అధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది, కల్పాంతంలో నాలోనే విలీనమై మళ్ళీ కల్పాదిలో సృష్టింపబడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మ ఫల ప్రదాతను. ప్రణవ నాదాన్ని. వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగినవాడను నేనే. సర్వాన్నీ భరించేవాడిని, ఆశ్రయాన్ని, బీజాన్ని, శరణునొసగేవాడిని, సాక్షిని, సృష్టి స్థితి లయ కారకుడను, సత్‌స్వరూపుడను, అమృతుడను. మూఢులు నా తత్వాన్ని తెలియజాలక వ్యర్ధమైన ఆశలతోను, నిష్ప్రయోజనమైన కర్మలతోను నశిస్తున్నారు. సజ్జనులు నన్ను సదా కీర్తిస్తూ జహఞానయోగం ద్వారా ఆరాధిస్తారు. అనన్య చింతనతో నన్ను ఉపాసించేవారి యోగ క్షేమాలు నేనే వహిస్తాను."


"అన్య దేవతలను ఆరాధించేవారు కూడా నన్నే ఆరాధిస్తున్నారు. నేనొసగే కామ్యార్ధాలను ఆయా దేవతల ద్వారా పొదుతున్నారు. నన్ను కొలిచేవారు నన్నే పొందుతారు. పవిత్రమైన హృదయంతో నాకు పత్రము, పుష్పము, ఫలము, జలము ఏది తర్పించినా దానిని స్వీకరించి నేను తృప్తుడనౌతాను. ఏ పని చేసినా ఆ కర్మ ఫలం నాకు సమర్పిస్తే నీవు కర్మ బంధంనుండి విముక్తుడవౌతావు. నన్ను ఆరాధించే ఎటువంటి భక్తుడైనా అతడెన్నటికీ నశింపడు. ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే పరమగతిని పొందుతారు. కనుక నాయందే మనసు లగ్నం చేసి, నా భక్తుడవై, నన్నారాధించుము. నన్నే శరణు జొచ్చుము. నన్నే నీవు పొందెదదవు"


విభూతి యోగము:

ఇంతకు ముందు యోగాలలో ముందుగా భగవంతుని పొందడానికి అవుసరమైన సాధన చెప్పబడింది. తరువాత అక్షరమైన పరబ్రహ్మమంటే ఏమిటో, ఎవరో, ఆ పరబ్రహ్మను పొందడానికి ఏమి చేయాలో కృష్ణుడు చెప్పాడు. ఇక ఈ అధ్యాయంలో ఆ పరబ్రహ్మము ఏయే రూపములలో గోచరిస్తుందో తెలిపాడు. సకల చరాచరమలలో, లోకములలో, యుగములలో వ్యాపించియున్న తన అనంతమైన విభూతులలో కొద్ది విభూతులను భగవానుడు అర్జునునకు తెలియజెప్పెను.


" నేను సమస్త ప్రాణుల హృదయాలలో ఆసీనుడనై యున్నాను. సమస్తమునకు ఆది, మధ్య, అంతము నేనే. ఆదిత్యులలో విష్ణువును. తేజోమయమైనవానిలో సూర్యుడను. గోవులలో కామధేనువును. దైత్యులలో ప్రహ్లాదుడను. ఆయుధ ధారులలో రాముడను. నదులలో గంగ. స్త్రీలలో కీర్తి, మేధ, క్షమ. పాండవులలో అర్జునుడను. మునులలో వ్యాసుడను. వృష్ణులలో వాసుదేవుడను. విజయులలో జిగీషను. మోసగాళ్ళలో ద్యూతాన్ని. జలచరాలలో మొసలిని. జలరాశులలో సముద్రాన్ని. వేయేల? ఐశ్వర్యమయము, కాంతిమయము, శక్తి మయము ఐనవన్నియు నా తేజస్సులో ఒక అంశనుండి కలిగినవి. సప్తర్షులు, సనకసనందనాదులు, మనువులు నా మానసమునుండే ఉద్భవించారు. జ్ఞానులు నా దివ్య విభూతులను తెలిసికొన్నవారై, నాయందే మగ్నులై, పరస్పరం నాగురించి ఒకరికొకరు బోధించుకొంటూ ఆనందిస్తుంటారు." - అని తన విభూతులను గురించి తానే ఇలా చెప్పాడు భగవంతుడైన వాసుదేవుడు. ,

విశ్వరూపసందర్శన యోగము:

శ్రీకృష్ణుడు విశ్వరూపములలోభగవానుని దివ్యగుణ వైభవాలను గురించి విన్న అర్జునుడు భగవానుని షడ్గుణైశ్వర్య సంపన్నమైన తేజోరూపమును చూపమని ప్రార్ధించెను. సామాన్య చక్షువులతో ఆ రూపం చూడడం దుర్లభం గనుక కృష్ణుడు అర్జుననకు దివ్యదృష్టిని ప్రసాదించెను. అపుడు అర్జునుడు అసంఖ్యాక ముఖములు, నేత్రములు, అద్భుతాయుధములు ధరించి అనంతముగా విస్తరించిన దేవదేవుని విశ్వరూపమును దర్శించెను. అది దివ్యమాల్యాంబర ధరము, దివ్య గంధానులేపనము. ఆ మహాకాల స్వరూపమును అంతకు ముందెవ్వరును చూడలేదు. అర్జునుడు పులకించి ఆ అనంతరూపుని ఇలా ప్రస్తుతించాడు.


"దేవదేవా! జగత్పతే! అనంతరూపా! సూర్యునివలె ప్రజ్వలించుచున్న నీ అనంత రూపము చూడ నాకు శక్యము గాకున్నది. నీవు దేవదేవుడవు, సనాతనుడవు. అనంత శక్తి సంపన్నుడవు. నీయందు బ్రహ్మాది సమస్త దేవతలు కనిపించుచున్నారు. దేవతు, మహర్షులు, పితరులు నిన్ను స్తుతిస్తున్నారు. ప్రభో! నీకు అనేక నమస్కారములు. మరల మరల నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము" అని ప్రార్ధించాడు.


అర్జునుని కరుణించి భగవానుడు తన రూపాన్ని ఉపసంహరించి ఆ అద్భుత రూపాన్ని దర్శించడం తపస్సు వలన కాని, వేదాధ్యయనం వలన గాని అలవి కాదని చెప్పాడు. అనన్యమైన భక్తి వలన మాత్రమే ఆ దివ్యరూపాన్ని తెలుసుకోవడం సాధ్యమని తెలిపాడు.

భక్తి యోగము:


పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని యెడల అత్యంత ప్రేమ కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి.


క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము:-

మానవుల శరీరము క్షేత్రము. ఆ క్షేత్రమును గూర్చి తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రములలోను అంతర్యామిగానున్న క్షేత్రజ్ఞుడు పరమాత్ముడే. అని, అట్టి పరమాత్ముని స్వరూపమును కృష్ణపరమాత్ముడు తెలియజెప్పెను.

క్షేత్రమంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారములతో కూడుకొని యున్న శరీరము. క్షేత్రజ్ఞుడంటే క్షేత్రంలో ఉండే జీవుడు. అన్ని క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞుడను నేనే అని, ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్యనున్న యదార్ధ సంబంధం తెలిసికోవడం జ్ఞానమని కృష్ణుడు ఉపదేశించాడు. అలాంటి జ్ఞానం కలిగిన జ్ఞాని లక్షణాలు - తనను తాను పొగడుకొనకపోవడం, గర్వం లేకపోవడం, అహింసాచరణ, ఋజుత్వము, గురు సేవా తత్పరత, శుచిత్వము, స్థిర బుద్ధి, ఆత్మ నిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం కలిగి ఉండటం, ఇష్టానిష్టాల పట్ల సమభాఞం కలిగి ఉండడం, ఏకాంత ప్రియత్వం, తత్వ జ్ఞానం యొక్క ధ్యేయాన్ని గ్రహించడం, భగవంతునియందు అనన్యమైన భక్తి కలిగి ఉండడం వంటివి.


ఇలాంటి జ్ఞానం లేని అజ్ఞాని తన ఆత్మ తత్వాన్ని తెలిసికొనలేక, క్షేత్రమే తాను అని భ్రమించిసంసార బంధాలకు లోనౌతాడు. అనేక జన్మలనెత్తుతాడు. యదార్ధంగా శరీరానికి భిన్నంగా, సాక్షీభూతంగా, ప్రభువుగా, భరించువానిగా భగవానుడున్నాడు.

గుణత్రయవిభాగ యోగము:

ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజస్ తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును. అనుచు శ్రీకృష్ణుడు ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును వివరించెను. అందరిలోను ఉన్న సత్వరజస్తమో గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. బ్రహ్మాండమంతా భగవంతుని కారణంగానే సృజింపబడుతుంది.


సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపజేయునది, జీవునికి సుఖంపట్ల జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి జీవుని బంధిస్తుంది. రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది. తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుని బంధిస్తుంది. సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి.


దేనినీ ద్వేషింపకుండా, కాంక్షించకుండా, సమత్వంతో నిర్మ మనస్కుడైనవాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మ పదాన్ని పొందడానికి అర్హుడౌతాడు.


పురుషోత్తమప్రాప్తి యోగము:

త్రిగుణాత్మకమైన సంసార వృక్షమును శ్రీకృష్ణుడు వర్ణించెను. జగత్తులో నాశనమొందువాడు క్షరుడు. వినాశరహితుడు అక్షరుడు. వీరిద్దరికంటె ఉత్తమమైనవాడు, అతీతుడు గనుక భగవంతుడు పురుషోత్తముడు.


దైవాసురసంపద్విభాగ యోగము:

అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును భగవంతుడు వివరించెను.


శ్రద్దాత్రయవిభాగ యోగము:--

వివిధమార్గాలలో పూజలు చేసేవారి శ్రద్ధ ఏ విధమైనది? ఎవరు ఏవిధంగా యజ్ఞానుల, దానాలు చేస్తారు?


మోక్షసన్యాస యోగము:--

కనుక అన్ని సంశయములను పరిత్యజించి, తనయందే మనసు నిలిపి యుద్ధము (కర్మ) చేయమని భగవంతుడు ఉపదేశించెను. అర్జునుడు మోహవిరహితుడయ్యెను. యోగేశ్వరుడగు కృష్ణుడు, ధనుర్ధరుడైన పార్ధుడు ఉన్న చోట సంపద, విజయము తప్పక ఉంటాయని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు.


భగవద్గీత నుండి మార్గదర్శకత్వము పొందినవరిలో ఎందరో యోగులు, తాత్వికులు ఉన్నారు. వారిలో శ్రీ చైతన్య మహాప్రభు ఒకరు. ఈయన "హరే కృష్ణ" మంత్రోత్రొపాసకులు. మహాత్మా గాంధీ తన అహింస సిద్ధాంతానికి గీత నుండే స్పూర్తీని పొందారు. గాంధీ మహాభారత యుద్ధాన్ని నిత్య జీవితంలో జరిగే సంఘర్షణాలన్నిటికి వేదిక వంటిదని వర్ణించారు. అంతిమంగా గీత సారము ఆయనకు బ్రిటిష్ వారి వలస పాలనను ఎదిరించడానికి ఒక ఆయుధము వంటి స్పూర్తిని ఇచ్చింది.

అమెరికా అణు శాస్త్రవేత్త, అణుబాంబు సృష్టించిన 'మాన్ హాటన్ ప్రాజెక్ట్' నిర్దేశకుడైన 'రాబర్ట్ ఒపెన్హీమర్' 1945లో మొదటి అణ్వాయుధ ప్రయోగాన్ని చూసినపుడు ఆ ప్రభావాన్ని వర్ణించడానికి గీతలోని విశ్వరూప ఘట్టాన్నుండి (11-32) ఉదాహరించాడని అంటారు [1].

శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులలో ఆగ్రగణ్యుడైన స్వామి వివేకానంద గీతలోని భక్తి, జ్ఞాన, కర్మ రాజ యోగాలకు ఎంతో విపులంగా నూతన భాష్యాన్ని వ్రాశారు. యోగులు కాదలచిన వారు గీతలోని ప్రతి అధ్యాయాన్ని వివరంగా చదవమని స్వామి శివానంద బోధించారు. ఒక యోగి ఆత్మ కధ రచయిత అయిన పరమహంస యోగానంద, గీతను ప్రపంచములోని అత్యుత్తమ పవిత్ర గ్రంధముగా పేర్కొన్నారు.


భగవద్గీత కాలం:--


భగవద్గీత ఎప్పుడు వ్రాయబడినదో పూర్తిగా నిర్ధారణ కాలేదు, లేదా నిరూపింపబడలేదు. మహాభారత ఇతిహాసమునందలై వివిధ ఖగోళ ఆధారల అనుసరించి, మహాభారత కాలాన్ని క్రీస్తు పూర్వం 3137 గా చెప్పబడుతున్నాయి. ఈ తారీఖులు హిందువుల విశ్వాసమైన కలియుగారంభమై 5000 సంవత్సరాలు అయినాయి అనేదానికి అనుకూలంగానే ఉన్నాయి. పురాణాలను అనుసరించి మాత్రం క్రీస్తుపూర్వం 2500 గా చెప్పబడుతున్నాయి. పాశ్చాత్య విద్వాంసులు మాత్రం ఈ తారీఖులు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలుగా చెప్పుచున్నారు.[2]




గీతా శ్లోక సంఖ్య:--


భగవద్గీతలోని శ్లోకాల సంఖ్య గురించి చాలా పరిశోధన జరిగింది, ఇంకా జరుగుతూ ఉంది. ప్రస్తుతం లభ్యమౌతున్న సంస్కృత మహాభారతంలో భీష్మ పర్వం 43వ అధ్యాయం, 4వ శ్లోకం ఇలా ఉంది:

షట్శతాని సవింశాని శ్లోకానాం ప్రాహకేశవః
అర్జునః సప్తపంచాశత్ సప్తషష్టించ సంజయః
ధృతరాష్ట్రః శ్లోకమేకం గీతాయా మానముచ్యతే
దీన్నిబట్టి కృష్ణుడు 620 శ్లోకాలు, అర్జునుడు 57 శ్లోకాలు, సంజయుడు 67 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 745 శ్లోకాలు. కానీ, వాడుకలో ఉన్న భగవద్గీత ప్రతిని బట్టి కృష్ణుడు 574 శ్లోకాలు, అర్జునుడు 84 శ్లోకాలు, సంజయుడు 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 700. మరి కొన్ని ప్రతులలో 13వ అధ్యాయం "క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం" మొదట్లో అర్జునుడు అడిగినట్లుగా "ప్రకృతిం పురుషం చైవ ..." అని ఒక ప్రశ్న ఉంది. అది కనుక కలుపుకుంటే మొత్తం 701 శ్లోకాలు అవుతాయి.


ఇవి కాకుండా రాజస్థాన్లోని కథియవాడ్‌లో భోజ (భూర్జర) పత్రాలపై రాసిన భగవద్గీత పాఠాంతరం ఒకటి బయటపడిందనీ, దానిలో ఏకంగా 755 శ్లోకాలు ఉన్నాయనీ, తమ 'గీతా మకరందం' (1963) రెండవ ముద్రణలొ (చూడు పే. 13, 1964) విద్యాప్రకాశానందగిరి వారు (శుకబ్రహ్మాశ్రమము, కాళహస్తి) రాశారు. కానీ, దీనిని గురించి మరిన్ని వివరాలు అందుబాటులో లేవు.


ఏది ఏమైనా, మహాభారత శ్లోకం ప్రక్షిప్తం కాదనుకుంటే మరొక 44/45 అమూల్యమైన శ్లోకాలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పచ్చు.


విమర్శలు:--


మహాభారతంలో ఇది ప్రక్షిప్తం అయ్యింది.
యుద్ధ రంగంలో ఇలాంటి ఉపదేశం అవాస్తవికం



వర్ణ వ్యవస్థ



మాయావాదం



సైద్ధాంతిక స్పష్టత లేదు

18, ఆగస్టు 2010, బుధవారం

వర్గీకరణ ---ప్రసిద్ధ మతముల జనాభా విభజన


*సమూహం పేరు


I.ఇబ్రాహీం భావనల మతములు 3.4 బిలియన్లు


1.జుడాయిజం 14 మిలియన్లు క్రీ.పూ. 1300 ఇస్రాయెల్ మరియు యూద సమూహ ప్రాంతాలు, ప్రధానంగా అ.సం.రా. లోనూ యూరోప్ లోనూ నివసిస్తున్నారు.

2.క్రైస్తవ మతము 2.1 బిలియన్లు క్రీ.శ. మొదటి శతాబ్దం ప్రపంచమంతటా, ఉత్తర ఆఫ్రికా, వాయువ్య ఆఫ్రికా, అరేబియా ద్వీపకల్పం, మధ్య ఆసియా, తూర్పు ఆసియా మరియు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలను మినహాయించి.

3.ఇస్లాం మతం 1.5 బిలియన్లు క్రీ.శ. 7 వ శతాబ్దం / హి.శ.పూర్వం 10 మధ్య ప్రాచ్యము, ఉత్తర ఆఫ్రికా, మధ్య ఆసియా, దక్షిణ ఆసియా, పశ్చిమ ఆఫ్రికా, భారత ఉపఖండం, మలయా ద్వీపసమూహం తూర్పు ఆఫ్రికా, బాల్కన్ ద్వీపకల్పం, రష్యా, యూరప్ మరియు చైనా.

4.బహాయి విశ్వాసము 5 మిలియన్లు క్రీ.శ. 19 శతాబ్దం ప్రపంచమంతటా కలరు. కానీ జనాభా సమ్మర్ధాలు లేవు.



*సమూహం పేరు


II. భారతీయ మతములు 1.4 బిలియన్లు

1.హిందూ మతము 900 మిలియన్లు స్థాపకులు లేరు. అతి ప్రాచీన మతము. భారత ఉపఖండం, ఫిజీ, గయానా మరియు మారిషస్

2.బౌద్ధ మతము 376 మిలియన్లు ఇనుప యుగం (క్రీ.పూ. 1200–300) భారత ఉపఖండం, తూర్పు ఆసియా, ఇండోచైనా, రష్యాలోని పలు ప్రాంతాలు.

3.సిక్కు మతము 25.8 మిలియన్లు క్రీ.శ. 15వ శతాబ్దం. భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్రికా, కెనడా, అ.సం.రా., యునైటెడ్ కింగ్ డం.

4.జైన మతము 4.2 మిలియన్లు ఇనుప యుగం (క్రీ.పూ. 1200–300) భారతదేశం, మరియు తూర్పు ఆసియా


*సమూహం పేరు

III. దూర తూర్పు మతములు 500 మిలియన్లు.


1.టావోఇజం క్రీ.పూ. 722-481 చైనా మరియు చైనా ప్రాంతాలు

2.కన్ఫ్యూషియానిజం
క్రీ.పూ. 722-481 చైనా, కొరియా, వియత్నాం మరియు చైనా-వియత్నాం ప్రాంతాలు
షింటో 4 మిలియన్లు స్థాపకులు లేరు జపాన్

3.కావోడాయిజమ్ 1-2 మిలియన్లు క్రీ.శ. 1925 వియత్నాం
కోండోగ్యో 1.13 మిలియన్లు క్రీ.శ. 1812 కొరియా
యిగువాండావో 1-2 మిలియన్లు క్రీ.శ. 1900 తైవాన్

4.చైనా జానపద మతము 394 మిలియన్లు స్థాపకులు లేరు, ఇది టావోఇజం, కన్ఫ్యూషియానిజం, మరియు బౌద్ధమతము యొక్క సమ్మేళణం. చైనా


*సమూహం పేరు

IV.వివిధ జాతులు/తెగలు 400 మిలియన్లు

1.భారతీయ తెగల మతము 300 మిలియన్లు స్థాపకులు లేరు భారతదేశం, ఆసియా

2.ఆఫ్రికా సాంప్రదాయిక మతములు మరియు ఆఫ్రికా ప్రాంతీయ మతములు 100 మిలియన్లు స్థాపకుల వివరాలు తెలియవు ఆఫ్రికా, అమెరికాలు


పైనుదహరించిన ఏ మతములోనూ గుర్తింపు పొందక ప్రత్యేక సమూహాలుగా నివసిస్తున్న సమూహాలు.


1.జూచే (ఉత్తర కొరియా): 19 మిలియన్లు

2.స్పిరిటిజం (సరైన నియంత్రణ లేని మతము): 15 మిలియన్లు

3.నవీన పాగన్లు: 1 మిలియన్

4.యూనిటేరియన్-విశ్వజనీయతత్వము: 800,000

5.రాస్త్రఫారియానిజం: 600,000

6.సైంటాలజీ: 500,000

జొరాస్ట్రియన్ మతము


ఫరావహర్, జొరాస్ట్రియన్‌ల మతపరమయిన చిహ్నం.జొరాస్ట్రియన్ మతము ఈ మతముము "మజ్దాఇజం" అనికూడా అంటారు. దీనిని జొరాస్టర్ (జరాతుష్ట్ర, జర్-తోష్త్) స్థాపించారు. ఈమతములో దేవుని పేరు అహూరా మజ్దా.

ఈ మతస్థుల పవిత్రగ్రంధం, "జెండ్-అవెస్తా" లేదా "అవెస్తా". ఈ మతము ప్రాచీన పర్షియా లో పుట్టింది, కానీ ఈ మతస్థులు ఎక్కువగా భారతదేశంలో నివసిస్తున్నారు. అందులోనూ ముంబాయి లో ఎక్కువగా నివసిస్తున్నారు.

వీరి ప్రార్థనా స్థలం లేదా మందిరం "ఫైర్ టెంపుల్" లేదా "అగియారీ" అని అంటారు.


1996 లో ప్రపంచ వ్యాప్తంగా 2,00,000 పార్శీలు వున్నారు.[1][2] 2001 భారత్ జనగణన ప్రకారం 69,601 పార్శీలు భారత్ లో గలరు.


ప్రముఖ పార్శీలు:--

దాదాభాయ్ నౌరోజీ
జంషెడ్ టాటా
జెఆర్‌డీ టాటా
ఫిరోజ్ షా మెహతా
ఫిరోజ్ గాంధీ
జుబిన్ మెహతా
అర్దెషీర్ ఇరానీ
గాడ్రెజ్ కుటుంబం, వాడియా కుటుంబం, టాటా కుటుంబం వగైరాలు.

జుడాయిజం


యూద మతము లేదా యూదు మతము యెహూదా, "యూదాת, యహెదుత్, [2]) ఇది యూదుల మతము, దీనికి మూలం 'హిబ్రూ బైబిల్'. 2007 నాటికి ప్రపంచంలో యూదుల జనాభా 1 కోటి 32 లక్షలు. ఈ జనాభాలో 41% ఇస్రాయెల్ లోనూ 59% ప్రపంచమంతటా వ్యాపించియున్నారు.[3] అతి పురాతన మతములలొ యూదు మతము కూడా ఒకటి. విగ్రహారాధనని నిషిధ్దము చేసిన మతములలో యూదు మతము ఒకటి. వీరి పవిత్ర గ్రంధం తోరాహ్. వీరి మత స్తాపకుడు మూసా (మోషే) ప్రవక్త . యూదుల ప్రార్థనా మందిరాన్ని సినగాగ్ అంటారు.

బైబిల్ కథనాలు:----

యూదుల ప్రవక్త మోషే (మూసా) విగ్రహారాధకులని చిత్రవధ చేసినట్టు బైబిల్లో కథలు ఉన్నాయి.

ఏసుక్రీస్తు ను చంపించింది కూడా యూదులే.

జైన మతము


జైన మతము సాంప్రదాయికంగా జైన ధర్మ (जैन धर्म) , అని పిలువబడుతుంది. ఈ మతము క్రీ.పూ. 9వ శతాబ్దంలో పుట్టినది.[1][2] ఈ మత స్థాపకుడు మొదటి తీర్థాంకరుడు అయిన వృషభనాథుడు.[3] 23వ తీర్థాంకరుడు పార్శ్వనాథుడు. 24వ తీర్థాంకరుడు వర్థమాన మహావీరుడు. [4]

భారతదేశంలో జైనులు ఒక చిన్న సమూహము. వీరి జనాభా దాదాపు 42 లక్షలు వుంటుంది.[5] జైన మతమును శ్రమన మతమని కూడ తెలియబడును.

ఆంధ్రప్రదేశ్ లో జైన మతం:----

జైనగాథల ప్రకారం జైనమతం క్రీ.పూ నాలుగో శతాబ్దానికే ఆంధ్రదేశంలో ప్రవేశించినట్లు తెలుస్తోంది. కళింగ రాజైన ఖారవేలుడి ఆదరణ వల్ల కృష్ణా నదికి ఉత్తరంగా తీరప్రాంతంలో ముందంజ వేసింది. అశోకుడి పుత్రుడు సంప్రతి ఆంధ్ర, ద్రవిడ దేశాల్లో జైన వ్యాప్తికి కృషి చేశాడు. అమరావతి సమీపంలోని వడ్డమాను కొండపై సంప్రతి విహారం ఏర్పడింది. అక్కడే ఖారవేలుడు మహామేఘ వాహన విహారం నిర్మించాడని శాసనాల వల్ల తెలుస్తోంది. క్రీస్తు శకారంభంలో సుప్రసిద్ధ జైనాచార్యుడైన కొండకుందాచార్యుడు కొనకుండ్ల (అనంతపురం జిల్లా) లో ఆశ్రమం నిర్మించుకుని మతప్రచారం చేస్తూ సిద్ధాంత గ్రంథాలు రచించాడు. వాటిలో సమయసార అనే గ్రంథం శ్వేతాంబర, దిగంభర శాఖలకు ఆదరణీయమైంది.


అహింస:-----


ఆచరణసాధ్యం కానంత తీవ్ర స్థాయి లో అహింస ఉంటుంది.జైనమతం ప్రజాదరణ పొందలేకపోవడానికి ఇది ఒక కారణం.గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుంటారు. నీళ్ళు వడగట్టుకుని తాగుతారు.అడుగు తీసి అడుగువేసేటప్పుడు కాలికింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన పొరకతో నడిచినంతమేరా అడుగేసేముందు నేలను ఊడ్చుకుంటూపోతారు.నేలను చీల్చి దున్నే వ్యవసాయం చేయరు.నేలకింద పండే దుంపకూరలు, ఉల్లి,వెల్లుల్లి, మసూర్ గింజల్లాంటివి కూడా తినరు. వడ్డీ వ్యాపారంచేస్తారు.


జీవులు 5 రకాలు:---


జీవులు అన్నీ తాకినవారిని గుర్తుపడతాయి. పృథ్వీకాయ జీవులు --రాళ్ళు, మట్టి, గవ్వ అప్కాయ జీవులు--మంచు, ఆవిరి, నీరు, వాన తేజోకాయ జీవులు--మంట, మెరుపు, బూడిద వాయుకాయ జీవులు --గాలి, తుఫాన్ వనస్పతిక జీవులు -- మొక్కలు, పొదలు, చెట్లు, వాటి బెరడు, కాండం, ఆకులు, విత్తనాలు...వీటిలో ఒక్కోదానిలో ఒక్కో ఆత్మే ఉంటుంది. అందుకని ఇవి ఏకకాయజీవులు. ఉర్లగడ్డలు, కంద, చేమ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మొదలైనవి అసంఖ్యాక ఆత్మలు గల బహుకాయజీవులు. ఏకేంద్రియ జీవికి 4 ప్రాణాలు (స్పర్శ, శ్వాస, శరీరం, ఆయుష్షు), పంచేంద్రియజీవులకు 10 ప్రాణాలుంటాయి. ఈ ఏకేంద్రియ జీవులు కూడా పదార్థాన్ని ఆహారం, శరీరం, ఇంద్రియాలు, శ్వాసల ద్వారా స్వీకరించి దాన్ని శక్తిగా మార్చుకుని బతుకుతాయి.


జైనులకు మైనారిటీ హోదా:---


మైనారిటీ'లను నిర్వచిస్తూ రాజ్యాంగానికి సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా జైనులు మైనారిటీలుగా గుర్తింపు పొందేందుకు మార్గం సుగమం కానుంది. ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన19.12.2008 న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మైనారిటీలను నిర్వచిస్తూ రాజ్యాంగానికి 103వ సవరణ చేపట్టాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్లు హోంమంత్రి చిదంబరం తెలిపారు. జైనులకు మైనారిటీ హోదా కల్పించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ పలుసార్లు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో చట్టసవరణ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.(

సిక్కు మతము


సిక్కు మతము గురునానక్ ప్రభోధనల ఆధారంగా యేర్పడిన మతము. ఏకేశ్వరోపాసన వీరి అభిమతము. సిక్కు మతములో దేవుని పేరు "వాహే గురు". వీరి పవిత్ర గ్రంధము గురుగ్రంధ సాహిబ్ లేదా ఆది గ్రంధము లేదా ఆది గ్రంధ్. వీరి పవిత్ర క్షేత్రము అమృత్ సర్ లోని స్వర్ణ మందిరము. ఈ మతాన్ని అవలంబించేవారిని సిక్కులు అని సంబోధిస్తారు. వీరు ప్రధానంగా పంజాబు (భారతదేశం మరియు పాకిస్తాన్) లలో నివసిస్తుంటారు. మరియు ప్రపంచమంతటా వ్యాపించియున్న సమూహం.

నమ్మకాలు:---

సిక్కులు విగ్రహారాధన చెయ్యరు. వారు ఏక్ ఓంకార్ (ఏకైక దైవం)ని నమ్ముతారు. సిక్కులు తమ గురువుల్ని దేవుని సందేశహరులుగా భావిస్తారు. సిక్కుల గురువులు తమ మతం హిందూ మతం తరహా మతం అని చెప్పుకున్నారు కానీ సిక్కు మతానికి, హిందూ మతానికి మధ్య చాలా తేడా ఉంది. సిక్కులు స్వర్గ నరకాలని నమ్మరు. స్వర్గ నరకాలు లేకపొతే కర్మ సిధ్ధాంతాలని నమ్మడం కూడా కష్టమే.

గురు నానక్:---

గురు నానక్ దేవ్ (Guru Nanak) 1469లో పాకిస్తాన్ లోని నన్కానా సాహిబ్ లో జన్మించాడు. ఇతను పది మంది సిక్కు గురువులలో మొదటి వాడు. ఇతను హిందూ మరియు ఇస్లామియా మత గ్రంథాలు చదివాడు కానీ ఇతను ఈ రెండు మతాలకి భిన్నమైన సిక్కు మతమును స్థాపించాడు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతము. వీరు ఏక్ ఓంకార్(ఏకైక దేవుడు)ని నమ్మతారు.


గురుగ్రంధ సాహిబ్:----


గురుగ్రంధ సాహిబ్ లేదా ఆది గ్రంధ్, లేదా ఆది శ్రీ గురు గ్రంథ్ సాహిబ్, సిక్కు మతస్తుల పవిత్ర గ్రంధం మరియు ఆఖరి గురువు.[1]

గురు గోవింద్ సింగ్ (1666-1708), సిక్కుల గురువు లలో పదవ గురువు, ఆది గ్రంధ్ ను తన వారసురాలిగా ప్రకటించాడు, మానవులలో గురువులుగా ప్రకటించే విధానాన్ని స్వస్తిపలికి, గ్రంధమైన "ఆది గ్రంధ్" ను తన తరువాత గురువుగా ప్రకటించాడు.[2] ఈ గ్రంధం పవిత్రగ్రంధంగానే గాక, పది-గురువుల జీవనవిధానంగానూ పరిగణింపబడినది.[3] గురుగ్రంధ సాహిబ్, ప్రార్థనలకొరకు ఒక వనరుగా పరిగణింపబడినది.[4] మరియుసిక్కు మతములో ప్రార్థనాంగము.

గురు అర్జున్ దేవ్ (1563-1606) చే మొదటిసారిగా ఆది గ్రంధం కూర్పు చేయబడినది. ఇందులో మొదటి ఐదు సిక్కు గురువులు మరియు హిందూ ముస్లింల సాంప్రదాయాలకు చెందిన అనేక గురువుల గురించి వ్రాయబడినది.[5] గ్రంధాన్ని అసలు రూపం ఇచ్చినవారు భాయ్ గురుదాస్ మరియు తరువాత భాయ్ మణిసింగ్. పదవ గురువు పరమదించిన తరువాత, ఆదిగ్రంధ్ చేతివ్రాత ప్రతులను బాబా దీప్ సింగ్ తయారుచేసి పంచిపెట్టాడు. గురుగ్రంధ సాహిబ్ గ్రంధము 1430 పుటలు కలిగిన గ్రంధము. సిఖ్ గురువుల కాలంలో, 1469 నుండి 1708 వరకు గ్రంధరూపం ఇవ్వబడినది.[1] ఈ గ్రంధం స్తోత్రం రూపంలో వున్నది. [5]



గురుగ్రంథ్ సాహిబ్ వాణి:---


కొన్ని ముఖ్యమైన వాణులు :-

1.ప్రపంచంలోని మానవులంతా సమానమే
2.స్త్రీలందరూ సమానమే
3.అందరికీ ఒకే భగవంతుడు
4.సత్యమునే పలికి సత్యముగా జీవించు
5.ఐదు విషయాలపట్ల శ్రద్ధ వహించు
6.దేవుడి ఆజ్ఞపై జీవించు (ఒకే దేవుడి నిర్ణయం)
7.మానవత్వం, దయ, జాలి, ప్రేమ లను ఆచరించు
8.జీవించి యుండగానే పరమాత్మను చేరే మార్గ తత్వము.
9.గురువు బోధనల ద్వారా దైనందిన జీవితంలోని సమస్యలనుండి బయటపడటం.
10.ఇందులో కథలు లేవు, జీవనమార్గాన్ని సూచించే సూక్తులు, విశాలతత్వంతో జీవించే మార్గాలూ వున్నవి.

బౌద్ధ మతము


మతము లేదా బౌద్ధం(Buddhism) ప్రపంచంలోని ముఖ్యమైన మతాలలో ఒకటి. మొత్తం ప్రపంచంలో బౌద్ధ ధర్మాన్ని ఆచరించేవారు 23 కోట్లనుండి 50 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా.[1] బౌద్ధంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి - మహాయానము, థేరవాదము. [2] తూర్పు ఆసియా, టిబెట్ ప్రాంతాలలో మహాయానం (వజ్రయానం తో కలిపి) అధికంగా ప్రాచుర్యంలో ఉంది.


గౌతమ బుద్ధుడు బోధించిన ధర్మ సూత్రాలు బౌద్ధానికి మూలాధారం. త్రిపిటకములు అనే శాస్త్ర గ్రంధం బౌద్ధానికి ప్రధాన ఆధారమని అధికులు విశ్వసిస్తారు. ఇందుకు అదనంగా మహాయాన బౌద్ధులు "మహాయాన సూత్రాలు" అనే రచనను విశ్వసిస్తారు. దీనిని థేరవాదులు అంగీకరించరు. [3]



సూచిక :---


1 ప్రధాన సంప్రదాయాలు
2 ఆరంభం, చరిత్ర
2.1 ఆరంభ దశ
2.1.1 సుత్త పిటక, వినయపిటక
2.1.2 సంఘాలు
2.1.3 అనంతర పరిణామాలు
2.1.4 మహాయానం ప్రాభవం
2.1.5 వజ్రయానం
2.1.6 దక్షిణ (థేరవాద) బౌద్ధం
2.1.7 తూర్పు దేశాలలో మహాయాన బౌద్ధం
2.1.8 ఉత్తర (టిబెటన్) బౌద్ధం
2.2 సమకాలీన బౌద్ధం
3 కొన్ని ముఖ్య సిద్ధాంతాలు
3.1 బోధి
3.2 మధ్యేమార్గం
3.3 త్రిరత్నాల శరణు
3.4 నాలుగు మహోన్నత సత్యాలు
3.5 అష్టాంగ మార్గం
3.6 తాత్విక భావాలు
4 ధర్మ గ్రంధాలు
5 తెలుగునాట బౌద్ధం
6 చిహ్నాలు



ప్రధాన సంప్రదాయాలు:---


థేరవాద, మహాయాన సంప్రదాయాలు బౌద్ధంలో ఉన్న రెండు ప్రధాన విభాగాలు. ఇంకా కొన్ని శాఖలు కూడా ఉన్నాయి. కాని వీటన్నింటిలో ఏకాభిప్రాయంగా పరిగణింపబడే ముఖ్య సూత్రాలను చెప్పడానికి నిపుణులు ప్రధానంగా పాళీ భాష, టిబెటన్ భాష లోనూ, ఇంకా అనువాద రూపంలో ఉన్న మంగోలియన్, చైనా భాషల గ్రంధాలలోనూ, కొద్దిగా లభించే సంస్కృత మూలాలలోనూ ఉన్న విషయాల ఆధారంగా కొన్ని ప్రధాన సూత్రాలను ఉదాహరిస్తారు. అయితే వీటిలో భిన్నాభిప్రాయాలు, భిన్న సంప్రదాయాలు ఉండవచ్చును.

గౌతమ బుద్ధుడు వారి గురువు, ప్రవక్త
మధ్యేమార్గం , కార్య కారణత్వం (Dependent origination), నాలుగు పరమ సత్యాలు, అష్టాంగ మార్గం - వీటిని సిద్ధాంతపరంగా అంగీకరిస్తారు. కాని కొన్ని సంప్రదాయాల ఆచరణలో వీటిని (కొంత గాని, పూర్తిగా గాని) అమలు చేయకపోవచ్చును.
సామాన్యులు, సంఘ పరివారంలోనివారు కూడా సాధన ద్వారా నిర్వాణం పొందవచ్చును.
నిర్వాణం పరమోత్కృష్ట గమ్యమని భావిస్తారు. థేరవాదులు ల నమ్మకం ప్రకారం బుద్ధుడు పొందిన నిర్వాణమే ఇతరులకూ లభిస్తుంది, రెండు రకాల నిర్వాణాలుండవు. ఈ సాధనా మార్గాన్ని బుద్ధుడు మొదటిగా కనుక్కొని ఇతరులకు బోధించాడు.


ఆరంభం, చరిత్ర:---


బౌద్ధ ధర్మాన్ని మొదటిగా బోధించిన గౌతమ బుద్ధుని అసలు పేరు సిద్ధార్ధుడు. ఇతడు లుంబిని[4] అనే చోట జన్మించాడు. కపిలవస్తు[5] అనే నగరంలో పెరిగాడు. ఇతని తండ్రి శుద్ధోదనుడు అనే రాజు. తల్లి మాయాదేవి


సిద్ధార్ధుని తాత్విక అన్వేషణ గురించి బహుళంగా ప్రచారంలో ఉన్నకధ - సిద్ధార్ధుని జననం తరువాత అతని తండ్రి శుధ్ధోదనునికి "ఈ బాలుడు మునుముందు గొప్ప చకవర్తి లేదా సర్వసంగ పరిత్యాగి అవుతాడు" అని పండితులు జోస్యం చెప్పారు. తన కుమారునికి వైరాగ్యం కలుగరాదనే కోరికతో తండ్రి అతనికి బయటి లోకంలోని చీకు చింతలు తెలియకుండా సకల భోగాలలో పెంచాడు. యశోధర అనే చక్కని యువతితో వివాహం జరిపాడు. వారికి రాహులుడనే పుత్రుడు జన్మించాడు. కాని తన 29వ యేట సిద్ధార్ధుడు నగరంలో ప్రయాణిస్తుండగా జనుల కష్టాలను, ఒక పండు ముసలివానిని, ఒక శవాన్ని, ఒక సాధువును చూచాడు. ఈ దృశ్యాలను "నాలుగు దృశ్యాలు" అంటారు. [6]


ఈ దృశ్యాలను చూచిన సిద్ధార్ధుని మనసు తాత్విక చింతనవైపు మళ్ళింది. ఒకరాత్రివేళ తన కుటుంబాన్ని, రాజ భోగాలను వదలి రాజప్రాసాదంనుండి నిష్క్రమించాడు. సత్యాన్వేషణకై వివిధ మార్గాలను ప్రయత్నించాడు. కొంతకాలం కఠోరమైన దీక్షను సాగించాడు. కాని ఆ విధంగా శరీరాన్ని మనసును క్షోభ పెట్టడం నిరర్ధకమని తెలుసుకొన్నాడు.[7]


తరువాత దీక్షను అవలంబించాడు. అతిగా సుఖలోలత లేకుండా, కఠోరమైన యోగదీక్ష కాకుండా మధ్యేమార్గంలో పయనించాలని నిశ్చయించుకొన్నడు. ఒక గ్రామ యువతి ప్రసాదించిన భిక్షను ఆరగించి, బోధగయలో ఒక రావి చెట్టుక్రింద ధ్యానమగ్నుడయ్యాడు. ఈ చెట్టునే బోధివృక్షమంటారు.[8][9] పరమ సత్యాన్ని కనుగొనేవరకూ కదలరాదని నిశ్చయించుకొన్నాడు. 49 రోజుల ధ్యానం తరువాత అతనికి జ్ఞానోదయమైంది. అప్పటినుండి అతను బుద్ధుడు అయ్యాడు. తాను కనుగొన్న ధర్మాన్ని అందరికీ బోధించసాగాడు.[10]


గౌతమ బుద్ధుడు క్రీ.పూ. 5వ శతాబ్దంలో జీవించాడని పరిశోధకుల అంచనా. కాని అతని జన్మ దినం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. [11] తన 80వ యేట కుశీనగరంలో మరణించాడు. [12]

ఆరంభ దశ:---


బౌద్ధమతం చరిత్రను క్రింది దశలుగా విభజింపవచ్చును[13]

1.ఆరంభ బౌద్ధం - ఈ దశను "హజిమె నకమురా" అధ్యయనకారుడు మళ్ళీ రెండు దశలుగా విభజించాడు.[14] :
1.అసలు బౌద్ధం - బుద్ధుడు బోధించినది (మతంగా రూపొందనిది)
2.సనాతన బౌద్ధం - ఆరంభ దశలో
2.బౌద్ధ సిద్ధాంతం ఆరంభ దశ - నికాయ బౌద్ధం
3.మహాయానం ఆరంభ దశ
4.మహాయానం పరిణతి దశ
5.వజ్రయానం
అయితే ఇవన్నీ ఒకదాని తరువాత ఒకటి వచ్చిన దశలు అనలేము. ఉదాహరణకు మహాయానం ఆవిర్భవించిన తరువాత చాలాకాలం వరకు సనాతన బౌద్ధం అధిక ప్రాభవం కలిగి ఉంది.

సుత్త పిటక, వినయపిటక
ఆరంభ దశలో బౌద్ధం సుత్త పిటకం, వినయ పిటకం అనే మౌలిక పాళీ సూత్రాలపైనా, నాలుగు నికాయ (ఆగమ) సూత్రాలపైనా ఆధారపడింది (కొద్దిమంది పరిశోధకులు మాత్రం ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు[15]). దాదాపు అన్ని ఆరంభకాలపు రచనలలోనూ కనిపించే క్రింది సిద్ధాంతాలు బుద్ధుని బోధనలనుండి నేరుగా గ్రహించబడినవని భావిస్తున్నారు.[16]

మూడు లక్షణాలు లేదా జీవ ధర్మాలు - అనిత్యము, దుఃఖము, అనాత్మత - (పాళీ భాషలో అనిచ్చ, దుక్క, అనత్త)
ఐదు తత్వాలు లేదా పంచ కంధాలు - ఆకారం (రూపం), వేదన (బాధ), సంజ్ఞ (ఇంద్రియాల ద్వారా తెలుసుకోవడం), సంస్కారం (భావనలు కలగడం), విజ్ఞానం
ప్రతి సముత్పాదన (dependent arising) లేదా కార్యకారణత్వం - ఒక దాని కారణంగా మరొకటి జరగడం
కర్మ, పునర్జన్మ
నాలుగు మహోన్నత సత్యాలు - చత్వారి ఆర్య సత్యాణి - దుఃఖము (జన్మ, జీవితం, మరణం కూడా దుఃఖ మయాలు), సముదాయము (సుఖ కాంక్ష వలన దుఃఖము కలుగుతుంది), నిరోధము (కాంక్షను త్యజిస్తే దుఃఖం దూరమవుతుంది), మార్గము (అష్టాంగ మార్గం వలన కాంక్షను త్యజింపవచ్చును)
అష్టాంగ మార్గము - సమ్యగ్వచనము (మంచిమాట), సమ్యగ్‌కర్మ (మంచి పనులు), సమ్యగ్‌జీవనము (మంచి జీవితం), సమ్యగ్‌వ్యాయామము (మంచి ప్రయత్నం), సమ్యగ్‌స్మృతి (మంచి దృక్పధము), సమ్యగ్‌సమాధి (మంచి ధ్యానము), సమ్యగ్‌దృష్టి (సత్యాన్ని చూడడం), సమ్యగ్‌సంకల్పము (మంచి సంకల్పము)
నిర్వాణము
కొందరు పరిశోధకులు వేరే ప్రమాణాలను ప్రతిపాదించారు.[17]


సంఘాలు:---


బుద్ధుని పరినిర్వాణం తరువాత కొద్ది కాలానికే మొదటి బౌద్ధ మండలి (first Buddhist council) సమావేశమయ్యంది. బుద్ధుని అమూల్య బోధనలు కలుషితం కాకుండా వాటిని గ్రంధస్తం చేయడం ఈ మండలి సంకల్పం. బుద్ధుని సన్నిహితుడైన ఆనందుడు తెలిపిన సూత్రాలు సుత్త పిటకం అనీ, మరొక శిష్యుడు ఉపాలి చెప్పిన విషయాలు వినయ పిటకం అనీ ప్రసిద్ది చెందాయి.[18]. సుత్త పిటకంలో బుద్ధుని సూక్తులు ఉన్నాయి. వినయ పిటకంలో బౌద్ధ సంఘంలో ఉండేవారి లక్షణాల గురించి చెప్పబడింది (భిక్షువుల ధర్మాలు). రెండవ బౌద్ధ మండలి తరువాత బౌద్ధంలో వివిధ శాఖలు పొడసూపనారంభించాయని పరిశోధకులు భావిస్తున్నారు.[19] అశోకుని తరువాతనే ఈ శాఖా భేదాలు బలవంతమయ్యాయని కొందరి అభిప్రాయం.


అశోకుడు పాటలీ పుత్ర నగరంలో మూడవ బౌద్ధ మండలిని నిర్వహింప జేశాడు. అయితే కొందరు అబౌద్ధులను సంఘంలోంచి వెలివేసి, సంఘాన్ని ఏకీకృతం చేసినట్లు మాత్రమే అశోకుని శాసనాలు చెబుతున్నాయి. స్థవిరులు అనబడే వారు, మహాసాంఘికులు అనబడేవారు "వినయం" గురించి గట్టిగా ఒకరినొకరు వ్యతిరేకించారు. సంఘంలో ఉండవలసిన వారి అర్హతల గురించి ఈ విభేదాలు పొడసూపాయి. కొంత కాలం ఒకే సంఘారామంలో ఇరు వర్గాలవారు కలసి ఉండి ఉండవచ్చును. కాని షుమారు క్రీ.శ. 100 నాటికి వారు వేరు కుంపట్లు పెట్టుకొని ఉంటారు. [20] స్థవిరులలోంచి వచ్చిన మరొక శాఖ థేరవాదంగా పరిణమించింది. స్థవిరులు సంఘం అర్హతలుగా ప్రతిపాదించిన నియమాలు మరీ కఠినంగా ఉన్నాయని మహాసాంఘికులు అభిప్రాయపడ్డారు. [21]


అనంతర పరిణామాలు:---

ఈ విధమైన విభేదాల ఫలితంగా ఒకో శాఖ తమదైన "అభిధమ్మము" (సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు) ఏర్పరచుకోవడం ప్రాంభించింది. బౌద్ధం విస్తరించిన కొలదీ అభిధమ్మ పిటకం అనే వ్యవస్థీకృత సిద్ధాంతం రూపొందింది. బుద్ధుని సందేశాల పరిధిని విస్తరించడానికి ఇష్టం లేని మహాసాంఘికులు మాత్రం వేరే అభిధమ్మపిటకాన్ని తయారు చేసుకోలేదు అనిపిస్తుంది. అయితే 5వ శతాబ్దానికి చెందిన ఫాహియాన్ మరియు 7వ శతాబ్దానికి చెందిన హ్యూన్‌త్సాంగ్ రచనల ప్రకారం మహాసాంఘికులకు కూడా ఒక అభిధమ్మం ఉంది.


ఆరంభంలో భారత దేశంలో నిదానంగా వ్యాపించిన బౌద్ధం అశోకుని కాలంలో దేశం నలుమూలలా, మరియు దేశాంతరాలలోనూ విస్తరించింది. ఈ కాలంలోనే అనేక స్తూపాల నిర్మాణాలు జరిగాయి. ధర్మ పధాన్ని ప్రచారం చేయడానికి అశోకుని దూతలు దేశదేశాలు ప్రయాణమయ్యారు. శ్రీలంకకు, సెల్యూసిడ్ రాజ్యాలకు, మధ్యధరా రాజ్యాలకు బౌద్ధ భిక్షువులు తరలి వెళ్ళారు. ఇలా దేశపు ఎల్లు దాటిన బౌద్ధం ఒకవైపు శ్రీలంకకు, అటునుండి క్రమంగా ఆగ్నేయ ఆసియా దేశాలకు వ్యాపించింది. మరొకవైపు మధ్య ఆసియా, ఇరాన్ ప్రాంతాలకు విస్తరించి, చైనాలో ప్రవేశానికి మార్గం సుగమం చేసుకొంది. కాలక్రమంగా శ్రీలంక, ఆగ్నేయాసియాలలో థేరవాద బౌద్ధంగాను, టిబెట్ మరియు చైనాలో తాంత్రిక లేదా వజ్రయాన ప్రభావితమైన బౌద్ధంగాను పరిణమించాయి. ఈ కాలంలో బౌద్ధ సంఘంపై ఇతర నాగరికతల ప్రభావం మరింతగా పడసాగింది. అంతే కాకుండా భారతదేశంలో ఇతర (బౌద్ధం కాని) మతాలు బౌద్ధం వలన ప్రభావితం కాగా, బౌద్ధం ఆ మతాలవలన కూడా ప్రభావితమవ సాగింది.



మహాయానం ప్రాభవం:---


మహాయానం ఆరంభం ఎలా ఎప్పుడు జరిగిందో స్పష్టంగా తెలియడంలేదు. షుమారు 1వ శతాబ్దంలో పశ్చిమోత్తరాన కుషాను రాజ్యంలోను, దక్షిణాన శాతవాహనుల దేశంలోను, పశ్చిమాన భరుకచ్చం (భారుచ్) సమీపంలో అజంతా, ఎల్లోరా ప్రాంతాలలోను ఆవిర్భవించిన వివిధ దృక్పథాల సంగమమే మహాయానం కావచ్చును. స్తూపాలను పూజించడం, బోధిసత్వుని గాధలను చిత్రాల ద్వారా సామాన్యులలో ప్రచారం చేయడం అనే విధానాలు మహాయానం ఆవిర్భవానికి మూల ఘటనలు కావచ్చును. కాని ఈ అభిప్రాయాన్ని కొందరు పండితులు త్రోసిపుచ్చుతున్నారు.[22] మహాయానం సిద్ధాంతాలలో "సర్వస్తివాదం" మరియు "ధర్మగుప్తకం" అనే రెండు తెగల ప్రభావం ఎక్కువగా ఉంది.


మహాయానులు బోధిసత్వుని మార్గానికి ప్రాధాన్యతనిస్తారు. 2వ శతాబ్దంలో కుషాణు చక్రవర్తి కనిష్కుడు నాలుగవ బౌద్ధ మండలిని సమావేశపరచాడు. ఈ మండలిని థేరవాదులు అంగీకరించరు. ఈ మండలి సమావేశంలో త్రిపిటకాలకు అదనంగా మరికొన్ని సూత్రాలు (పద్మ సూత్రం, హృదయ సూత్రం, అమితాభసూత్రం వంటివి) ఆమోదం పొందాయి. "అందరికీ" నిర్వాణం లభించడం సాధ్యమేనని ఈ మండలిలో ఆమోదించారు. నిర్వాణం కోసం సాధన చేసేవారికి దైవ స్వరూపులైన బుద్ధులు, బోధిసత్వులు అనే భావాలను ఆంగీకరించారు. నిర్వాణం "అందరికీ" అందుబాటులో ఉన్నందున ఇది "మహాయానం" (పెద్ద బండి) అయ్యింది. అయితే ఈ శాఖ అంతకు ముందే ఉన్న సర్వస్తివాదానికి కేవలం ప్రతిరూపమేనని కొందరు పండితుల అభిప్రాయం.[23]. ఈ సిద్ధాంతాలు గ్రంధస్తం చేయబడి, మధ్య ఆసియా, చైనాలకు దేశాలకు విస్తరించాయి. చైనాలో మరిన్ని మార్పులు జరిగిన మహాయానం ఆ రూపంలో జపాన్, వియత్నాం, కొరియా ప్రాంతాలకు విస్తరించింది.


అయితే మహాయాన బౌద్ధానికి పటిష్టమైన సిద్ధాంతాలను ఏర్పరచింది నాగార్జునుడు. షుమారు 150-250 మధ్య కాలానికి చెందిన ఈ ఆచార్యుని ప్రభావం మహాయానంపై అసమానమైనది. త్రిపిటకాల పరిధిలో ధర్మము, మోక్షము, శూన్యత అనే భావాలను ఏకీకృతం చేసి, అనాత్మత మరియు కార్యకారణత్వం వంటి మౌలిక సూత్రాలతో విభేదం లేకుండా పరిష్కరించాడు. నాగార్జునుడు బోధించిన మార్గాన్ని మాధ్యమిక వాదము అంటారు. కనిష్కుల తరువాత గుప్తుల కాలం (4-6 శతాబ్దాలు)లో కూడా బౌద్ధం భారతదేశంలో బలంగానే ఉంది. ఒక ప్రక్క నాగార్జునుని మాధ్యమిక వాదము, మరొక ప్రక్క యోగాచార బౌద్ధంగా పరిణమించిన సర్వస్తివాదము తమ తమ అనుయాయులలో బలంగా ఉన్నాయి. ఇలా మాధ్యమిక వాదము, యోగాచారము కలగలిపిన సంప్రదాయాలు ఇండో-టిబెటన్ బౌద్ధానికి మూలాలుగా స్థిరపడ్డాయి.


వజ్రయానం:---


తాంత్రిక ఆచారాలతో కూడుకొన్న వజ్రయాన బౌద్ధం ఆరంభమైన విధానాన్ని గురించి కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. టిబెటన్ సంప్రదాయం ప్రకారం శాక్యముని బుద్ధుడే తంత్రాన్ని బోధించాడని, కాని అవి రహస్యాలు గనుక బుద్ధుని అనంతరం చాలా కాలానికి గాని గ్రంధస్తం కాలేదని అంటారు. వజ్రయానం పరిణతిలో నలందా విశ్వవిద్యాలయం ప్రముఖ పాత్ర కలిగి ఉంది. 11వ శతాబ్దం వరకు ఇక్కడినుండి టిబెట్, చైనాలకు ఈ తాంత్రిక విధానాలు సంక్రమించాయి. టిబెటన్ బౌద్ధంలో ఈ విధానాల ప్రభావం బలంగా ఉంది. డేవిడ్ రోనాల్డ్‌సన్ అనే ఆచార్యుని అభిప్రాయం ప్రకారం గుప్తుల అనంతరం బౌద్ధానికి ప్రజలలో ఆదరణ కొరవడింది. సామాన్యులను ఆకట్టుకొనడానికి అప్పటికే సమాజంలో ఆచరణలో ఉన్న సిద్ధ తంత్రాల వినియోగం అధికమయ్యింది. మరో 200 సంవత్సరాల తరువాత ఈ సంప్రదాయాల మిళితం వజ్రయానం అనే సిద్ధాంతంగా రూపొందింది.[24]


పరిసర దేశాలలో బౌద్ధం స్థిరంగా ఉన్నప్పటికీ భారత దేశంలో క్షీణించసాగింది. క్రమంగా సంపూర్ణంగా అంతరించింది.


దక్షిణ (థేరవాద) బౌద్ధం:---


థేరవాదం (పూర్వవాదం లేదా సనాతనవాదం) అనేది బౌద్ధంలో అన్నింటికంటే ప్రధమ దశలో ఆవిర్భవించిన సిద్ధాంతాలకు సమీపంలో ఉన్న సంప్రదాయం.[25] క్రీ.పూ.250లో జరిగిన మూడవ బౌద్ధ మండలి సమావేశంలో ఇతరులతో విభేదించిన స్థవిరులు (విభజ్జన వాదులు) క్రమంగా థేరవాదులయ్యారు. భారతదేశంలో ఈ వాదం క్షీణీంచినప్పటికీ శ్రీలంక, ఆగ్నేయ ఆసియాలలో ఇప్పటి బౌద్ధమతం థేరవాదుల మార్గానికి సమీపంగా ఉంది.




థేరవాదుల విశ్వాసాలు, ఆచరణలు ఆరంభంలో వెలువడిన పాళి సూత్రాలకు, వాటిపై వచ్చిన వ్యాఖ్యలకు పరిమితమై ఉంటాయి. కొన్ని శతాబ్దాలు మౌఖికంగా ఉండిపోయిన వీరి సూత్రాలు క్రీ.పూ.1వ శతాబ్దంలో శ్రీలంకలో గ్రంధస్తం చేయబడ్డాయి. ఆ సమావేశాన్నే థేరవాదులు "నాలుగవ బౌద్ధమండలి"గా భావిస్తారు. మౌలిక సూత్రాలైన సుత్త పిటకం, వినయపిటకం, త్రిరత్నాలు వంటి సిద్ధాంతాలకు థేరవాదులు సంకలనం చేసిన రచనలే ఆరంభదశలోని బౌద్ధ సిద్ధాంతాలకు అతి సమీప ఆధారాలుగా పండితులు భావిస్తారు.


థేరవాదులు విభజ్జన వాదము (విశ్లేషణా బోధన)ను సమర్ధిస్తారు. గ్రుడ్డి నమ్మకాలకు బదులు సాధకుల అనుభవం, విమర్శనాత్మక పరిశీలన మరియు హేతువిచారణ ద్వారానే జ్ఞానం లభిస్తుందని థేరవాదుల సిద్ధాంతం. వీరి బోధనల ప్రకారం కామం, క్రోధం, మోహం వంటి మాలిన్యాలవలన సుఖలాలసత్వం, అందుమూలంగా దుఃఖం కలుగుతాయి. అష్టాంగమార్గ సాధన ద్వారా ఈ మాలిన్యాలను తొలగించి, మోహాన్నుండి బయటపడి దుఃఖాన్నుండి విముక్తులు కావచ్చును. అష్టాంగ మార్గం ద్వారా నాలుగు మహోన్నత సత్యాలు అవగతమౌతాయి. తద్వారా జ్ఞానము, నిర్వాణము లభిస్తాయి. నిర్వాణమే థేరవాదుల పరమార్ధం.


థేరవాదం ప్రస్తుతం ప్రధానంగా శ్రీలంక, మయన్మార్, లావోస్, థాయిలాండ్, కంబోడియా దేశాలలోను, కొద్దిభాగం చైనా , బంగ్లాదేశ్, వియత్నాం, మలేషియాలలోను ఆచరణలో ఉంది. ఐరోపా, అమెరికా ఖండాలలో కూడా థేరవాదం పట్ల ఆకర్షణ పెరుగుతున్నది.


తూర్పు దేశాలలో మహాయాన బౌద్ధం:---

మహాయానం అనే విభాగం సనాతన బౌద్ధ సూత్రాలకు మరికొన్ని సూత్రాలను జోడించడం ద్వారా విస్తరించింది. మహాయానులు "బోధిసత్వ" భావానికి ప్రాముఖ్యత ఇస్తారు. సాధన ద్వారా దుఃఖం నుండి విముక్తి పొందడం అనే ప్రాధమిక లక్ష్యం కంటే మహాయాన సాధకులు లోకంలో ఉండి అందరినీ దుఃఖాన్నుండి విముక్తులను చేయాడమనే లక్ష్యాన్ని ఎన్నుకుంటారు. బోధిసత్వులు సకల జీవులకూ నిర్వాణాన్ని పొందడంలో తోడ్పడతారని వారి విశ్వాసం. అవధులు లేని "మహా కరుణ"యే బోధిసత్వుల లక్షణం. అదే అందరికీ నిర్వాణాన్ని ప్రసాదిస్తుంది.

శూన్యత, ప్రజ్ఞాపారమిత, తథాగతత్వము అనే ఉన్నత తత్వాలు మహాయానంలో తరచు ప్రస్తావించబడుతాయి. తథాగత గర్భ సూత్రాలు పరమ సత్యాన్ని, ధర్మాన్ని, ఇదే అన్నింటికంటే గొప్ప సత్యమనీ మహాయానుల విశ్వాసం. అయితే ప్రస్తుతం చైనాలో అన్ని సూత్రాలకు సమానమైన ప్రాముఖ్యత ఉన్నట్లుగా అనిపిస్తుంది.[26]. మహాయాన సంప్రదాయంలో కొన్నిమార్లు బుద్ధుడు లేక ధర్మం ప్రత్యక్షం అవుతారని సూచనలున్నాయి. ఇది "దేవుడు" అనే భావానికి మహాయానంలో స్థానం కల్పిస్తుంది. మహాయానంలో త్రిపిటకాలకు అదనంగా మహాయాన సూత్రాలు, పద్మ సూత్రాలు, మహాపరినిర్వాణ సూత్రాలు ఉన్నాయి. వీటి సాధన ద్వారా బుద్ధత్వం పొందవచ్చునని వారి విశ్వాసం.


ప్రస్తుత కాలంలో చైనా, టిబెట్, జపాన్, కొరియా, సింగపూర్ దేశాలలోను, కొద్ది భాగం రష్యాలోను, వియత్నా అధిక భాగంలోను అనుసరించే బౌద్ధాన్ని స్థూలంగా క్రింది విభాగాలుగా విభజింపవచ్చును.




'జెన్' లేదా 'చాన్' (Chan/Zen) - "ధ్యాన" అనే సంస్కృత పదం నుండి "చాన్" లేదా "జెన్" అనే చైనీయ పదాలు ఉద్భవించాయి. చైనా, జపాన్ దేశాలలో ఈ సంప్రదాయం బలంగా ఉంది. పేరును బట్టే జెన్ బౌద్ధంలో ధ్యానానికి ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంటుంది. మొత్తానికి జెన్ బౌద్ధులు శాస్త్రాల అధ్యయనానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. అందరిలోనూ బుద్ధుడున్నాడు. ధ్యానం ద్వారా ఆ బుద్ధుని తెలిసికోవచ్చునని వీరి విశ్వాసం. ఇందులో మరిన్ని ఉపశాఖలున్నాయి. "రింజాయ్" జెన్ బౌద్ధులు తమ ధ్యానంలో "koan (meditative riddle or puzzle)" అనే సాధనాన్ని (యంత్రాన్ని) వాడుతారు. "సోటో" శాఖ జెన్ బౌద్ధులు కూడా ఈ యంత్రాన్ని వాడుతారు గాని "shikantaza అనగా కేవలం ఆసీనులై ధ్యానం చేయడం వారి ప్రధాన ఉద్దేశ్యం. ఈ జ్ఞానోదయం క్రమంగా అయ్యే విషయం కాదని, ధ్యానం ద్వారా మాయ తెరలు తొలగినపుడు ఒక్కమారుగా అత్మజ్ఞానం కలుగుతుందని సాధారణంగా జెన్ విశ్వాసాలు, ఆచరణా విధానాలు సూచిస్తాయి.[27]
శుద్ధ భూమి (Pure Land Buddhism) - అధికంగా చైనాలో సామాన్య జనం ఆదరించే విధానం[28] సాధన ద్వారా జ్ఞానం, నిర్వాణం సాధించే అవకాశం సామాన్యులకు కష్టం గనుక ఇతర విధానాల ద్వారా కూడ కొంత రక్షణ సాధ్యమని వీరి విశ్వాసం.[29] జెన్ బౌద్ధులు స్వీయ సాధనను విశ్వసిస్తే, శుద్ధభూమి బౌద్ధులు "అమిద బుద్ధుడు" తమను కాపాడి జ్ఞానం వైపు నడిపిస్తాడని నమ్ముతారు. ప్రార్ధన, స్మరణం వంటి ప్రక్రియల ద్వారా అమితాభ బుద్ధుని "సుఖావతి" (సంతోష స్థానం) చేరుకోవచ్చునని వీరి విశ్వాసం. ఈ "స్వర్గ" సుఖమే నిర్వాణమని, లేదా నిర్వాణానికి ముందు ఘట్టమని (శాఖా భేదాలను బట్టి) నమ్ముతారు. సకల జీవులకూ సంసార బంధాలనుండి విముక్తి కలిగించడానికి కృత నిశ్చయుడైన అమితాభ బుద్ధుడు ఉన్నాడని, అచంచలమైన విశ్వాసం ఉంటే అది తప్పక సాధ్యమని వీరి భావం.
నిచిరెన్ జపాన్‌లో మాత్రమే (Nichiren Buddhism)
షింగన్ (ఒక విధమైన వజ్రయానం) (Shingon)
టెండాయ్ (Tendai)


ఉత్తర (టిబెటన్) బౌద్ధం:----

టిబెట్‌లో అనుసరిస్తున్న బౌద్ధం ప్రధానంగా మహాయానం అయినప్పటికీ అందులో వజ్రయానం ప్రభావం గణనీయంగా ఉంది. మహాయానం ప్రాధమిక నియమాలకు అదనంగా చాలా ఆధ్యాత్మిక, భౌతిక సాధనలు టిబెటన్ బౌద్ధంలో ప్రముఖమైన అంశాలు. సాధనకు అనుకూలమయ్యేలాగా శరీరం యొక్క మరియు మనస్సు యొక్క శక్తులను పెంపొందించుకోవడం వల్ల సాధన త్వరగా సఫలమౌతుందని, ఒక్క జీవిత కాలంలోనే బుద్ధత్వము లభించే అవకాశం కూడా ఉన్నదని వారి విశ్వాసం. కనుక మహాయాన సిద్ధాంత శాస్త్ర్రాలే కాకుండా టిబెటన్ బౌద్ధులు వజ్ర యానానికి సంబంధించిన కొంత తంత్ర సాహిత్యాన్ని గుర్తిస్తారు. వీటిలో కొన్ని చైనా, జపాను దేశాలలోని పురాతన బౌద్ధ సాహిత్యంలో ఉన్నాయి. కొన్ని పాళీ రచనలలో కూడా కనిపిస్తాయి.



సమకాలీన బౌద్ధం:---

బౌద్ధానికి జన్మస్థానమైన భారతదేశంలో బౌద్ధం దాదాపు పూర్తిగా అంతరించిపోయింది. పరిసర దేశాలలో బౌద్ధం బలంగా ఉన్నా గాని విచిత్రంగా ఆ ప్రభావం భారతదేశంలో బౌద్ధం పునరుద్ధరణకు దోహదం చేయలేదు. ఇటీవలి కాలంలో తిరిగి బౌద్ధం కొంత పరిమితమైన ఆదరణ పొందుతున్నది. ప్రపంచం మొత్తం మీద బౌద్ధుల సంఖ్య అంచనాలు 23 కోట్లు - 50 కోట్లు మధ్య ఉంటున్నది. బహుశా 35 కోట్లు అనే సంఖ్య వాస్తవానికి దగ్గరలో ఉండవచ్చును[30]. బౌద్ధ మతస్తుల సంఖ్య సరిగా అంచనా వేయడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి.

"బౌద్ధులు" అనగా ఎవరనే విషయం స్పష్టంగా నిర్వచింపబడకపోవడం;
తూర్పు దేశాలలోని ఇతర మతాలు - టావో మతము, కన్‌ఫ్యూషియన్ మతము, షింటో మతము, మరి కొన్ని చైనా జానపద మతాలు కూడా గణనీయంగా బౌద్ధ మతము ఆచార సంప్రదాయాలను తమలో ఇముడ్చుకొన్నాయి[31][32][33];
బౌద్ధులలో సామూహిక ప్రార్ధనా సమావేశాలు, సామాజిక ఉత్సవాలు అంతగా లేనందున వారిని లెక్కించడం కష్టమవుతుంది[34];



చైనా, వియత్నాం, ఉత్తర కొరియా వంటి దేశాలలో ఉన్న రాజకీయ పరిస్థితుల మూలంగా వ్యక్తుల మతాన్ని వ్వస్థీకృత విధానంలో గుర్తించడంలేదు[35][36].




ఒక అంచనా ప్రకారం క్రైస్తవ మతము, ఇస్లాం, హిందూమతం తరువాత ప్రపంచంలో నాలుగవ పెద్ద మతం బౌద్ధమతం.[37] బుద్ధుని కాలంలో ప్రాంభమైన భిక్షువుల సంఘము ప్రపంచంలోఅత్యంత పురాతనమైన సాంఘిక సమూహము. ప్రపంచంలో ఆచరణలో ఉన్న ముఖ్య బౌద్ధమత విభాగాలు ఇలా ఉన్నాయి.




పాళీ సూత్రాలపైన ఆధారపడిన థేరవాద బౌద్ధం - కంబోడియా, లావోస్, థాయిలాండ్, శ్రీలంక, మయన్మార్‌లలో అధికంగా ఉంది. భారత దేశంలో బి.ఆర్. అంబేద్కర్ ఆరంభించిన దళిత బౌద్ధ ఉద్యమం కూడా ఈ విధానానికి సమీపంలో ఉంది.
చైనా భాషలో రచింపబడిన మహాయాన సూత్రాలను అనుసరించే తూర్పు ఆసియా దేశాలు - చైనా, జపాన్, కొరియా, తైవాన్, సింగపూర్, వియత్నాం.
టిబెటన్ భాషలోని సాహిత్యాన్ని, సంప్రదాయాలను అనుసరించే టిబెటన్ బౌద్ధం ఉన్న చోట్లు - టిబెట్ మరియు దాని పరిసర ప్రాంతాలు (భారత్, భూటాన్, మంగోలియా, నేపాల్, రష్యా)
పశ్చిమ దేశాలలో ఇటీవల కనిపిస్తున్న బౌద్ధ సమూహాలు ఈ తూర్పు దేశాలలోని మూడింటిలో ఏదో ఒక విధానాన్ని అనుసరిస్తారు.
షుమారుగా థేరవాదులు 12.4 కోట్లు, చైనా మహాయాన బౌద్ధులు 18.5 కోట్లు, టిబెటన్ మహాయాన బౌద్ధులు 2 కోట్లు ఉండవచ్చునని ఒక అంచనా. [38]



కొన్ని ముఖ్య సిద్ధాంతాలు:--


థేరవాద బౌద్ధంలో - జన్మ జన్మల వేదన, సాధన అనంతరం సత్యాన్ని తెలిసికొని అజ్ఞానాంధకారంనుండి బయటపడి, ఇతరులకు ఆ మార్గాన్ని ఉపదేశించినవారు "బుద్ధులు" అవుతారు. సత్యాన్ని తెలిసికొన్నాగాని ఇతరులకు ఉపదేశం చేయనివారు "ప్రత్యేక బుద్ధులు" అవుతారు. శాక్యముని గౌతమ బుద్ధుడు ఒక్కడే బుద్ధుడు కాదు. అంతకు పూర్వము, ఇంకా ముందు కాలంలోను ఎందరో బుద్ధులు ఉంటారు. సత్యాన్ని తెలుసుకొన్న గౌతమబుద్ధుడు అనేక బుద్ధులలో ఒకడు. బుద్ధుని బోధనలలో "నాలుగు ఆర్య సత్యాలు" ప్రముఖ పాత్ర కలిగి ఉన్నాయి. దుఃఖం లక్షణం, దానికి కారణం, దుఃఖ నివారణ, నివారణా మార్గం - ఇవి ఆ నాలుగు ఆర్య సత్యాలు.[39] అలా దుఃఖాన్ని నివారించే మార్గం "అష్టాంగ మార్గం".


బుద్ధుని అనంతరం బౌద్దాన్ని ఆచరించేవారిలో అనేక విభాగాలు ఏర్పడినాయి. వారి ఆచరణలోను, సిద్ధాంతాలలోను, సంస్కృతిలోను నెలకొన్న వైవిధ్యం కారణంగా బౌద్ధం అంటే ఇది అని స్పష్టంగా అందరికీ వర్తించే విషయాలు క్రోడీకరించడం కష్టమవుతున్నది.[40]


బోధి:--

బోధి అనగా "నిద్ర లేచుట" - థేరవాదంలో అరహంతులకు, బుద్ధులకు కూడా జ్ఞానోదయమయ్యే ప్రక్రియను "బోధి" అంటారు. జన్మ జన్మల సాధన, ధ్యానం తరువాతనే ఈ స్థితి సాధ్యమవుతుంది. బౌద్ధం ఆరంభ దశలో "బోధి", "నిర్వాణం" అనే పదాలు ఒకే అర్ధంలో వాడబడ్డాయి. రాగ, ద్వేష, మోహాలు అంతరించడం ఈ ప్రక్రియలో ముఖ్యమైన లక్షణం.


తరువాత వచ్చిన మహాయాన సిద్ధాంతాలలో "నిర్వాణం" అనే స్థితి "బుద్ధత్వం" కంటే కొంత తగ్గింది. రాగ ద్వేషాలనుండి విముక్తి కలిగితే అది నిర్వాణం అవుతుంది, అనగా ఇంకా మోహం ఉంటుంది. ఈ మోహం కూడా తొలగిపోయినపుడు "బోధి" స్థితి లభిస్తుంది.[41] మహాయానంలోని ఈ సిద్ధాంతం ప్రకారం అరహంతులు నిర్వాణాన్ని పొందుతారు కాని, ఇంకా మోహంనుండి విముక్తులు కానందున వారు బోధిత్వం పొందరు. కాని థేరవాదంలోని నమ్మకం ప్రకారం అరహంతులు రాగ, ద్వేష, మోహాలనుండి విముక్తి పొదిన బోధులు.




బోధిత్వం పొందడానికి "నాలుగు ఆర్యసత్యాలను" సంపూర్ణంగా తెలుసుకోవాలి. అందువలన కర్మ నశిస్తుంది. బౌద్ధం ఆరంభ దశలో "పారమిత"ను ప్రస్తావించలేదు [42][43] అయితే తరువాత వచ్చిన థేరవాద, మహాయాన బౌద్ధ సాహిత్యంలో "పారమిత" సాధన కూడా అవసరం. బోధిత్వం పొదినవారు జనన, మరణ, పుర్జన్మ భూయిష్టమైన సంసార చక్రంనుండి విముక్తులవుతారు. మాయ తొలగిపోయినందువలన "అనాత్మత" అనే సత్యాన్ని తెలుసుకొంటారు.


మధ్యేమార్గం:---

బౌద్ధ మతం సాంప్రదాయాలలోను, విశ్వాసాలలోను మధ్యేమార్గం చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. శాక్యముని గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయానికి ముందు ఈ మార్గాన్ని అవగతం చేసుకొన్నాడని ప్రతీతి. "మధ్యేమార్గం" అన్న పదానికి వివిధ వివరణలు ఉన్నాయి

1.కఠోరమైన దీక్షతో శరీరాన్ని మనస్సును కష్టపెట్టకుండా, అలాగని భోగ లాలసత్వంలో మునగకుండా మధ్య విధంగా సాధన, జీవితం సాగించడం.
2.తత్వ చింతనలో చివరకు "ఇది ఉంది" లేదా "ఇది లేదు" అన్న పిడివాదనలకు పోకుండా మధ్యస్తంగా ఆలోచించడం[44]
3.నిర్వాణంలో ఈ విధమైన ద్వివిధ, విరుద్ధ భావాలు అంతమై పరిపూర్ణమైన జ్ఞానం కలుగడం.


త్రిరత్నాల శరణు:---

సంప్రదాయానుసారంగా త్రిరత్నాలు లేదా రత్నత్రయం శరణు జొచ్చుట బౌద్ధం ఆచరణలో ప్రాధమిక ప్రక్రియ. "బుద్ధుడు", "ధర్మము", సంఘము" అనేవే ఈ త్రిరత్నాలు. [45] దాదాపు బౌద్ధమతావలంబనలో ఇది మొదటి మెట్టుగా భావింపబడుతుంది. ఈ మూడింటికి అదనంగా "లామ" (దీక్ష) అనే నాల్గవ శరణు కూడా టిబెటన్ బౌద్ధంలో పాటించబడుతుంది.




బుద్ధుడు
జ్ఞానోదయమైన, ధర్మ మార్గాన్ని ఎరిగిన అరహంతుల మార్గాన్ని ఆచరించడం.

ధర్మము
బుద్ధుడు తెలిపిన మార్గము. సత్యానికి, అసత్యానికి ఉన్న భేదము. పరమ సత్యము

సంఘము
బౌద్ధ భిక్షువుల సమూహం లేదా సత్యాన్వేషణా మార్గంలో పురోగమిస్తున్నవారి సహవాసం. కొన్ని వివరణల ప్రకారం భౌక్షుకుల సాధనకు సహకరిస్తున్న సామాన్య జనులు కూడా సంఘంలోని వారే.


"బుద్ధుడు" తాను కనుగొన్న మార్గాన్ని ఇతరులు గ్రుడ్డిగా ఆచరించమని చెప్పలేదు. శ్రద్ధతో ఎవరికి వారే తాను బోధించిన "ధర్మము"ను ఆలంబనగా గైకొని స్వయంగా యుక్తాయుక్తాలు విచారించి, "సంఘము" సహకారంతో సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పాడు. బుద్ధుడు బోధించిన ధర్మాన్ని అందరికీ సాధనలో అందుబాటులో ఉంచే సముదాయమే సంఘం.


మహాయానంలో బుద్ధుడు అంటే ఒక వ్యక్తి కాదు. అనంతమైన ధర్మరూపం. కొన్ని మహాయాన సూత్రాలలో బుద్ధుడు, ధర్మము, సంఘము అనే మూడు భావాలూ అవినాభావమైన శాశ్వతత్వానికి ప్రతీకలుగా భావించబడుతాయి. చాలా మంది బౌద్ధులు వేరే లోకంలో తమ కర్మలకు విముక్తి కలుగుతుందని విశ్వసించరు. అష్టాంగ మార్గం ద్వారానే దుఃఖభూయిష్టమైన కర్మలనుండి విమోచన కలుగుతుందని భావిస్తారు. కాని మహాయానంలో కొన్ని సూత్రాల ప్రకారం శ్రవణం, మననం వంటి సాధనల ద్వారా కర్మ బంధాలనుండి విముక్తి కలుగవచ్చునని ఉంది.


నాలుగు మహోన్నత సత్యాలు:---


బౌద్ధమతంలో "నాలుగు పరమసత్యాలు" ప్రవచింపబడ్డాయి. అవి [46]

1.దుఃఖము
2.దుఃఖానికి కారణము
3.దుఃఖంనుండి విముక్తి
4.దుఃఖాన్నిండి ముక్తిని పొందే మార్గం

ఇవి గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయం తరువాత తన సహ సాధకులైన ఐదుగురు శ్రమణులకు చెప్పిన విషయాలు కనుక బుద్ధిని మొదటి బోధనలు,[47] "ధర్మ చక్ర పరివర్తన సూత్రం" అనే బుద్ధుని మొదటి బోధలో బుద్ధుడు మధ్యేమార్గం గురించి, అష్టాంగ సాధనామార్గం గురించి, నాలుగు పరమ సత్యాల గురించి చెప్పాడు. ఈ నాలుగు పరమ సత్యాలు అనే విషయాన్ని ఒక మత ప్రబోధంగా కాక అప్పటి కాలంలో ఉన్న ఉపశమన విధానం (కష్టాలు తీర్చే మార్గం)గా చెప్పాడు. [48] థేరవాదుల భావం ప్రకారం ఈ నాలుగు పరమ సత్యాలూ ధ్యానానికి అర్హులైన సాధకులకు మాత్రమే తెలిసే ఉన్నత భావాలు[49]. మహాయానుల భావం ప్రకారం ఉన్నత స్థాయి మహాయాన సూత్రాలను అందుకొనే స్థాయికి ఇంకా ఎదగని సాధకులకు ఆరంభ దశలో చెప్పవలసిన సూత్రాలు ఇవి. [50] దూర ప్రాచ్య దేశాలలో వీటికి చెప్పుకోదగిన ప్రాచుర్యం లేదు.[51]


అష్టాంగ మార్గం:--

నాలుగు పరమ సత్యాలలో నాలగవదైన దుఃఖ విమోచనా మార్గం అష్టాంగ మార్గం.ఆరంభ కాలం బౌద్ధ గ్రంధాలలో (నాలుగు నికాయాలలో) అష్టాంగ మార్గం సామాన్యులకు బోధించేవారు కారు.అష్టాంగ మార్గం మూడు విభాగాలుగా విభజింపబడింది. శీలము (భౌతికమైన చర్యలు), సమాధి (మనస్సును లగ్నం చేయుట, ధ్యానము), ప్రజ్ఞ (అన్నింటినీ తాత్విక దృష్టితో పరిశీలించడం)




శీలము - శరీరం, మాటల ద్వారా చెడును కలుగనీయకుండడం. ఇందులో మూడు భాగాలున్నాయి:

1."సమ్యక్ వచనము" - నొప్పించకుండా, వక్రీకరించకుండా, సత్యంగా మాట్లాడడం
2."సమ్యక్ కర్మము" - హాని కలిగించే పనులు చేయకుండుట
3."సమ్యక్ జీవనము" - తనకు గాని, ఇతరులకు గాని, ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని కీడు కలుగకుండా జీవించడం
సమాధి - మనసును అదుపులోకి తెచ్చుకోవడం. ఇందులో మూడు సంగాలు ఉన్నాయి.

4."సమ్యక్ వ్యాయామము" - ప్రగతి కోసం మంచి ప్రయత్నం చేయుట
5."సమ్యక్ స్మృతి" - స్వచ్ఛమైన దృష్టితో విషయాలను స్పష్టంగా చూడగలగడం
6."సమ్యక్ సమాధి" - రాగ ద్వేషాలుకు అతీతంగా మనసును స్థిరపరచుకొని సత్యాన్ని అన్వేషించడం
ప్రజ్ఞ - మనసును శుద్ధపరచే జ్ఞానము. ఇందులో రెండు అంగాలున్నాయి.

7."సమ్యక్ దృష్టి" - అనిపించేలాగా కాకుండా (భ్రమ పడకుండా) ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం
8."సమ్యక్ సంకల్పము" - ఆలోచించే విధానంలో మార్పు

ఈ ఎనిమిది మార్గాలను పలు విధాలుగా వివరిస్తారు, విశ్లేషిస్తారు. సాధనలో ఒకో మెట్టూ ఎదగవచ్చునని కొందరంటారు. అలా కాక అన్ని మార్గాలనూ ఉమ్మడిగా ఆచరించాలని మరొక భావన.



తాత్విక భావాలు:--


పాళీ భాషలోని రచనల ప్రకారం గౌతమ బుద్ధుడు కొన్ని తాత్విక సందేహాలకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు. ప్రపంచం శాశ్వతమా, అశాశ్వతమా? ఆత్మ, శరీరం వేరు వేరా లేక ఒకటేనా? నిర్వాణం లేదా మరణం తరువాత ఉనికి ఉంటుందా? - ఇటువంటి ప్రశ్నలకు బుద్ధుడు సమాధానం ఇవ్వకపోవడానికి కారణం జీవితంలో పనికివచ్చే జ్ఞానానికి అటువంటి అతివాద ప్రశ్నలు అడ్డుగా నిలుస్తాయన్న భావన - అని ఒక అభిప్రాయం. [52]. అంతే కాకుండా అటువంటి ప్రశ్నలు ప్రపంచం, ఆత్మ, వ్యక్తి అనే భావాలకు లేని వాస్తవాన్ని అంటగడతాయని కూడా కొందరంటారు.




పాళీ సూత్రాలలోనూ, చాలా మహాయాన, తాంత్రిక బౌద్ధ సూత్రాలలోనూ బుద్ధుడు ఇలా చెప్పినట్లు పేర్కొనబడింది - వాస్తవం (సత్యం) సామాన్యమైన మనసుకు, వాదానికి అతీతమైనది. ప్రాపంచిక దృష్టితో సత్యాన్ని తెలుసుకోవడం అసాధ్యం. "ప్రజ్ఞా పారమిత" సూత్రాలలో ఇది ఒక ప్రాధమిక అంశం. పఠనం, సాధన, ధ్యానం, విశ్వాసం, సూత్రాలపట్ల గౌరవం వంటి సాధనాల ద్వారా సత్యాన్వేషణకు మార్గం సుగమమౌతుంది. నిజమైన జ్ఞానం స్వయంగా తెలిసికోవలసిందే.


"మహాపరినిర్వాణ సూత్రం" లేదా "ఉత్తర తంత్రం" అనబడే మహాయానసూత్రం ప్రకారం ధర్మాన్ని గురించిన వివేచన అవుసరమే కాని వాదాలు, శాస్త్రాల పట్ల అతిగా ఆధారపడడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే నిజమైన జ్ఞానానికీ, వీటికీ సంబంధం లేదు. ఇదే భావం చాలా తంత్రాలలోను, సిద్ధాంతాలలోను చెప్పబడింది.[53] మహాసిద్ధ తిలోపుడనే భారతీయ బౌద్ధ యోగి కూడా వాదాలను నిరసించాడు. వివిధ శాఖలలో భేదాలున్నాగాని అధికంగా బౌద్ధులు విశ్వసించే ప్రకారం పరమ లక్ష్యం (నిర్వాణం లేదా ముక్తి లేదా బోధి) అనేది మాటలకు అతీతమైనది అని.



ధర్మ గ్రంధాలు:---

లావోస్‌లోని ఒక బౌద్ధారామంలో చిత్రంబౌద్ధమతం గ్రంధాలు అనేకాలు ఉన్నాయి. వీటిని అధ్యయన గ్రంధాలుగాను, కొందరు పూజార్హాలుగానూ కూడా చూస్తారు. ప్రధానంగా బౌద్ధ సూత్రాలు సంస్కృతంలో త్రిపిటకాలు (పాళీ భాషలో "తిపిటక") - అనగా మూడు బుట్టలు. అవి

వినయ పీఠకం - బౌద్ధ సంఘము, భిక్షువులు, భిక్షుణిల నియమాలు, విధానాలు గురించినది, అందుకు సంబంధించిన శాస్త్రాధారాలు, వివరణలు.
సుత్త పీఠకం - గౌతమ బుద్ధుడు స్వయంగా బోధించినవని చెప్పబడే సూత్రాలు
అభిధమ్మ పీఠకం - గౌతమ బుద్ధుని బోధనలను విపులీకరించే సూత్రాలు
గ్రంధాలలో ఉన్న ప్రకారం గౌతమబుద్ధుని పరినిర్వాణానంతరం కొలది కాలానికే మొదటి బౌద్ధ మండలి సమావేశమయ్యింది. ఈ సమావేశానికి మహాకాశ్యపుడు అనే బౌద్ధ భిక్షువు సభాధిపత్యం నిర్వహించాడు. ఈ మండలి లక్ష్యాలు - బుద్ధుని బోధనలను మననం చేయడం (సూత్రాలు లేదా సుత్త), సంఘాలలో పాటించవలసిన నియమాలను క్రమబద్ధం చేయడం (వినయం). గౌతమ బుద్ధుని సహచరుడు అయిన ఆనందుడు చెప్పిన విషయాలు సుత్త పిటకం అయ్యాయి. అభిధమ్మ, ఉపాలి అనే శిష్యులు చెప్పిన విషయాలు వినయ పిటకం, అభిధమ్మ పిటకం అయ్యాయి. ఈ పిటకాలు కొంతకాలం మౌఖికంగా ఇతరులకు సంక్రమించాయి. మరి కొంత కాలం తరువాత గాని గ్రంధస్తం కాలేదు. ఈ పిటకాలలో బుద్ధుని బోధనలు, జీవితంలో ఘటనలు, వేదాంత, శాస్త్ర సంవాదనలు, ఇతర నియమాలు అనేకం ఉన్నాయి.


థేరవాదులు, మరికొంత మంది ఆరంభ కాలపు బౌద్ధులు పాళీభాషలోని తమ గ్రంధాలు స్వయంగా బుద్ధుడు బోధించిన విషయాల సంగ్రహమేనని విశ్వసిస్తారు. థేరవాద సూత్ర గ్రంధాలలో షుమారు 40 లక్షల పదాలున్నాయి. "మహాయాన సూత్రాలు" వంటి ఇతర సూత్రాలు కూడా స్వయంగా బుద్ధుడే బోధించాడని, కాని అవి రహస్యంగా చెప్పబడడం వల్ల సామాన్యులకు తెలియలేదని ఆయా వాదులు విశ్వసిస్తారు. నాగులు, లేదా బోధిసత్వుల ద్వారా ఆ రహస్యాలు తరువాత అందుబాటులోకి వచ్చాయని వారి నమ్మకం. షుమారు 600 మహాయాన సూత్రాలు సంస్కృతం లేదా చైనా లేదా టిబెటన్ భాషలో ఇప్పుడు లభిస్తున్నాయి. మహాయాన సూత్రాలను థేరవాదులు విశ్వసించరు.



తెలుగునాట బౌద్ధం:---

బౌద్ధమతం ఆరంభ దశనుండి ఆంధ్ర ప్రదేశ ప్రాంతలో విశేషమయన ఆదరణ పొందింది. అశోకునికి ముందే, అనగా బుద్ధుని కాలం నుండే ఆంధ్రదేశంలో బౌద్ధమతం ప్రాచుర్యంలో ఉన్నదని పెక్కు ఆధారాల వల్ల తెలియవస్తుంది. అశోకుని శిలాశాసనం ప్రకారం ఆంధ్ర దేశం అప్పటికే "ధర్మవిషయం"లో ఉంది. గుంటుపల్లి, భట్టిప్రోలు వంటి బౌద్ధ క్షేత్రాలు హీనయాన బౌద్ధం కాలం నాటివి. (క్రీ.పూ. 300 నాటివి.) విశేషించి భట్టిప్రోలును బుద్ధుడే స్వయంగా సందర్శించాడని ఒక అభిప్రాయం ఉంది. భట్టిప్రోలులోని ధాతు కరండం బుద్ధుని శరీర ధాతువులకు చెందినది కావచ్చును. అశోకుని కాలంలోను, తరువాత శాతవాహనుల కాలంలోను బౌద్ధాన్ని రాజకుటుంబాలు విశేషంగా ఆదరించారు. రాజుల హిందూమతావలంబులైనా గాని రాణివాసం బౌద్ధ సంఘాలకు పెద్దయెత్తున దానాలు చేసినట్లు ఆధారాలున్నాయి. ఉత్తర హిందూస్తానానికి, శ్రీలంకకు మధ్య జరిగిన బౌద్ధ పరివ్రాజకుల రాకపోకలలో వేంగిదేశం ముఖ్యమైన మార్గం మరియు కూడలిగా ఉండేది. తరువాత మహాయానం ఆంధ్రదేశంలోని నాగార్జునుని తత్వంతో ప్రావర్భవించింది. ధరణికోట, విజయపురి వంటి మహారామాలు ఆంధ్రదేశంలో బౌద్ధం అత్యున్నత స్థితిలో ఉన్ననాటి చిహ్నాలు.

చిహ్నాలు:--

మహాయాన బౌద్ధం, వజ్రాయన బౌద్ధం లో ఎనిమిది శుభసూచకమైన చిహ్నాలున్నాయి.

ఛత్రము (గొడుగు గుర్తు)
బంగారు చేప
the Treasure Vase
పద్మము
శంఖము
the Endless Knot
ధ్వజం
ధర్మ చక్రం

ఇస్లాం మతం


ఏకేశ్వరవాద ప్రాతిపదిక పైన ముహమ్మద్ ఏడవ శతాబ్దంలో స్థాపించిన ఒక మతము. 140 నుండి 180 కోట్ల జనాభాతో క్రైస్తవం తరువాత ఇస్లాం మతం రెండవ అతి పెద్ద మతం[1].

ఇస్లాం అనునది మతము, ముస్లిం అనగా ఇస్లాం మతావలంబీకుడు.

ఇస్లాం అనే పదానికి మూలం అరబీ భాషాపదం 'సలెమ', అనగా శాంతి, స్వఛ్ఛత, అర్పణ, అణకువ మరియు సత్ శీలత. ధార్మిక పరంగా చూస్తే ఇస్లాం అనగా భగవదేఛ్ఛకు అర్పించడం మరియు అతడి ధర్మానికి అనుగుణంగా నడచుకోవడం. ముస్లిం అనగా భగవదేఛ్ఛకు లోబడి, స్వయాన్ని భగవంతుడికి అప్పగించేవాడు, శాంతి కాముకుడు, శాంతి స్థాపకుడు. మహమ్మద్ ప్రవక్త ప్రవచించిన మార్గాన్ని, ధర్మాన్ని అవలంబించువాడు. ముస్లిం లకు పరమ పవిత్రం దేవుని (అల్లాహ్) వాక్కు, ఆదేశము ఖురాన్, మరియు మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు/ఉల్లేఖనాలు హదీసులు. అల్లాహ్ వాక్కు ఖురాను ప్రకారం ఆదమ్ ఆది పురుషుడు మరియు ప్రథమ ప్రవక్త. ముహమ్మద్ చివరి ప్రవక్త.




విషయ సూచిక :-----------

1 ఇస్లాం ఐదు మూలస్థంభాలు
2 విశ్వాసము
3 అల్లాహ్
4 ఖురాన్
5 మలాయిక (దేవదూతలు)
6 ముహమ్మద్ ప్రవక్త
7 ఆచరణీయాలు
8 ప్రళయాంతము
9 మోక్షము
10 చరిత్ర
10.1 ఖిలాఫత్ ప్రారంభం (632–750)
11.1 జనగణన
11.2 మసీదులు
11.3 కుటుంబ జీవితం
11.4 కేలండర్
12 ఇతర మతములు
13 విభాగాలు
13.1 సున్నీ
13.2 షియా
13.3 సూఫీ తత్వము
13.4 ఇతరములు


ఇస్లాం ఐదు మూలస్థంభాలు:---

ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం, భగవంతుడు (అల్లాహ్) తన ఆఖరి ప్రవక్త ముహమ్మద్ ను ఉపదేశకుడుగా పంపాడు, ఖురాను (పవిత్ర గ్రంథం) అవతరింపజేశాడు. ఇస్లాం ఐదు మూలస్థంభాలు 1. షహాద (విశ్వాసం), 2. సలాహ్ (నమాజ్ లేదా ప్రార్థన), 3. సౌమ్ (ఉపవాసం), 4. జకాత్ (దాన ధర్మం), 5. హజ్ (పుణ్య యాత్ర).


విశ్వాసము:--

ఖురాను ప్రకారం ప్రతి ముస్లిం అల్లాహ్, అవతరింపబడ్డ గ్రంధాలు , దేవదూతలు, ప్రవక్తలు, ప్రళయదినం పై విశ్వాసం వుంచవలెను. హదీసుల ప్రకారం 1,24,000 (లక్షా ఇరవై నాలుగు వేల) ప్రవక్తలు అవతరించారు. ఖురానులో 25 ప్రవక్తల ప్రస్తావన కలదు. అనగా ఖురానులో ప్రస్తావనకు రాని ప్రవక్తలు 1,23,975. మానవజాతి పుట్టుక ఆదమ్ ప్రవక్త నుండి మహమ్మద్ ప్రవక్త పుట్టుక మధ్యకాలంలో 1,23,998 ప్రవక్తలు అవతరించారు. ప్రతి యుగంలోనూ ప్రతి ఖండంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి జాతిలోనూ ఈశ్వరుడు (అల్లాహ్) ప్రవక్తలను అవతరింపజేశాడు. ప్రతి ప్రవక్త ఈశ్వరుడి (అల్లాహ్) హెచ్చరికలను ప్రజానీకానికి చేరవేస్తాడు. ప్రతి ప్రవక్తకాలంలోని ప్రవక్తల అనుయాయులందరూ ముస్లిములే, కాని క్రొత్త ప్రవక్త అవతరించినచో అతడిని అవలంబించవలసి యుంటుంది. ఉదాహరణకు ఇబ్రాహీం ప్రవక్త (అబ్రహాము) అనుయాయులు ఇస్మాయీల్, ఇస్ హాఖ్ లను అవలంబించారు. వీరి అనుయాయులు (మోషే) ను అవలంబించారు. వీరి అనుయాయులు (యేసు) ను అవలంబించారు. ఇది ప్రవక్తల గొలుసుక్రమం. వీరందరూ ఈ క్రమంలోని అంతిమ ప్రవక్త అయిన మహమ్మదు ను అవలంబించవలెను. ఈ విశ్వాసం గలవారే ముస్లింలు. ఈవిధంగా విశ్వాసం (ఈమాన్) వుంచేవారిని విశ్వాసులు లేక మోమిన్ (ఆస్తికులు) అని, అవిశ్వాసులను కాఫిర్ (నాస్తికులు) లేక తిరస్కారులు అని అంటారు.



అల్లాహ్:--

అల్లాహ్ ఆ సర్వేశ్వరుడి నామం. సకల చరాచర జగత్తును సృష్టించిన మహాసృష్టికర్త. ఇస్లాం లో ఏకేశ్వరోపాసన కఠోర నియమము. అల్లాహ్ పై విశ్వాసప్రకటనను షహాద అని, మరియు ఏకేశ్వర విశ్వాసాన్ని తౌహీద్ అంటారు. అల్లాహ్ యొక్క 99 విశేషణాత్మక నామవాచకాలు కలవు. ముస్లింలు భగవన్నామస్మరణ చేయునపుడు ఈనామాలన్నీ స్మరిస్తారు.



ఖురాన్:---

అల్లాహ్ చే జిబ్రయీల్ దేవదూత ద్వారా మహమ్మద్ ప్రవక్త పై అవతరింప బడ్డ దైవగ్రంథం ఈ ఖురాన్. క్రీ.శ. 610 - 632 ల మధ్య మక్కా మరియు మదీనా లో అవతరింపబడినది. ఖురాన్ అనగా పఠించడం.

ఇందులో

30 పారాలు లేక 'జుజ్'లు గలవు.
114 సూరాలు గలవు
6,236 ఆయత్ లు గలవు.
మక్కా లో అవతరింపబడిన సూరాలను మక్కీ సూరాలు అని, మదీనా లో అవతరింపబడిన సూరాలను మదనీ సూరాలు అని అంటారు. మొదటి ఖలీఫా అయిన అబూబక్ర్ కాలంలో వీటినన్నిటినీ క్రోడీకరించి ఒక గ్రంధరూపాన్నిచ్చారు. ఖురాన్ ను కంఠస్తం చేసినవారిని హాఫిజ్-అల్-ఖురాన్ అంటారు. ఖురాన్ గ్రంథంలో భగవంతుని (అల్లాహ్), ఆదేశాలు, హితోక్తులు, విశ్వసృష్టి, మానవసృష్టి, మానవజీవన చరిత్ర, దైవమార్గం అనుసరించినవారి విజయాలు, అనుసరించనివారి వినాశనాలు, మానవజాతి కొరకు ప్రకృతినియమాలు, సద్బోధనలు గలవు. ఇస్లామీయ ప్రభుత్వాలు గల దేశాలలో ఖురాన్ ఆదేశాల ప్రకారం చట్టాలు నడుపబడుచున్నాయి.



[మార్చు] మలాయిక (దేవదూతలు):--

దేవదూతకు అరబ్బీలో మలక్ అని పర్షియన్ లో ఫరిష్తా అని, బహువచనంలో మలాయిక 'ఫరిష్తే' అని అంటారు. దేవదూతలలో ముఖ్యులు నలుగురు. 1. జిబ్రయీల్, 2. మీకాయీల్, 3. ఇజ్రాయీల్, 4. ఇస్రాఫీల్.



ముహమ్మద్ ప్రవక్త:--

ముహమ్మద్ ప్రవక్త, ప్రవక్తల గొలుసుక్రమంలోని ఆఖరు ప్రవక్త. ఇస్లాం ప్రవక్తల గొలుసు ఆదమ్ ప్రవక్తతో ప్రారంభమైనది, ఇస్లాం ఆదమ్ తోనే స్థాపింపబడినది. ఇస్లాం ప్రవక్తలలో ఆఖరి ప్రవక్త ముహమ్మద్. క్రీ.శ. 570 ఏప్రిల్ 20 న మక్కా నగరంలో జన్మించారు. తండ్రి 'అబ్దుల్లా' తల్లి 'ఆమినా'. తన 40 యేట వరకూ సాధారణ జీవితం గడిపిన ముహమ్మద్ ప్రవక్తకు, హిరా గుహ యందు ధ్యానంలో యుండగా జిబ్రయీల్ దూత ప్రత్యక్షమై అల్లాహ్ ఆదేశాలను మరియు ఖురాన్ యొక్క మొదటి సూరా ను అవతరింపజేశారు. ఈ సూరా 'ఇఖ్రా బిస్మి రబ్బుకల్లజి ఖలఖ్' అనే ఆయత్ తో ప్రారంభమైనది. దీనర్థం "(ఇఖ్రా) చదువు, అల్లాహ్ (పరమేశ్వరుడు) ఒక్కడేనని, అతడే సర్వాన్నీ సృష్టించాడని....'. ఈ అవతరణ పొందిన ముహమ్మద్ తన ప్రవక్త జీవితం ప్రారంభించారు. బహుఈశ్వరాధకులైన అరబ్ పాగన్లు ఇతన్ని నానా కష్టాలు పెట్టారు. క్రీ.శ. 622 లో మక్కా నుండి మదీనా కు హిజ్రత్ (వలస) వెళ్ళారు. ఈ సంవత్సరం నుండే ఇస్లామీయ కేలండర్ ఆరంభమైనది. మదీనా లో స్థిరపడిన ముహమ్మద్ కు మక్కా వాసులనుండి అగచాట్లు తప్పలేదు. ఇస్లామీయ రీతి నచ్చని మక్కావాసులు మదీనా వాసులపై అనేక యుద్దాలు చేశారు. ఈ యుద్ధాలకు నాయకత్వం వహించిన ముహమ్మద్ ఒకటీ రెండూ యుద్ధాలు తప్ప అన్నింటిలోనూ విజయాలను చవిచూసారు. ఆఖరుకు ముస్లిం సమూహాలు మక్కానూ రక్తపాత రహితంగా కైవసం చేసుకున్నారు. క్రీ.శ. 632 లో ముహమ్మద్ ప్రవక్త పరమదించారు. ముహమ్మద్ ప్రవక్త ఆచరణలను సున్నహ్ అనీ ఉపదేశాలను హదీసులు అనీ వ్యవహరిస్తారు. ఖురాన్ ఆదేశాల తరువాత సున్నహ్ మరియు హదీసులే ముస్లింలకు ప్రామాణిక ఆదేశాలు.


ఆచరణీయాలు:--

ఇస్లామీయ ప్రపంచం లేదా ప్రపంచంలోని ముస్లింలు ఖురాన్, షరియా మరియు హదీసులను ఆచరిస్తారు. ముస్లింల సాంప్రదాయాలు వీటినుండి ఉద్భవించినవే. ముస్లింల ఆచారాలు, ముస్లిం సాంప్రదాయాల నుండి మరియు ప్రాదేశిక ఆచార వ్యవహారాలనుండి ఉద్భవించినవి.


ప్రళయాంతము:--

ఒకానొక రోజు సర్వసృష్టీ అంతమగును. ఆ రోజునే ఇస్లాం లో యౌమ్-అల్-ఖియామ (అరబ్బీ : يوم القيامة) (ఉర్దూ : ఖయామత్)అర్థం 'ప్రళయాంతదినం', సృష్టి యొక్క ఆఖరి రోజు. ఖయామత్ పై విశ్వాసముంచడాన్ని అఖీదా అంటారు. ఖయామత్ గురించి ఖురాన్ లోను, హదీసుల లోనూ క్షుణ్ణంగా వర్ణింపబడినది. ఉలేమాలు అయిన అల్-ఘజాలి, ఇబ్న్ కసీర్, ఇబ్న్ మాజా, ముహమ్మద్ అల్-బుఖారి మొదలగువారు విశదీకరించారు. ప్రతి ముస్లిం మరియు ముస్లిమేతరులు తమ తమ కర్మానుసారం అల్లాహ్ చే తీర్పు చెప్పబడెదరు - ఖురాన్ 74:38. ఖురానులో 75వ సూరా అల్-ఖియామ పేరుతో గలదు.


మోక్షము:--

ముస్లింలు ఖురాన్, షరియా, మరియు హదీసుల ప్రకారం నడుచుకుంటూ, అల్లాహ్ కు తమవిధేయతను ప్రకటించి, సన్మార్గంలో నడచినప్పుడే మోక్షము కలుగుతుంది. ఈ మోక్షాన్నే ముస్లింలు మగ్ ఫిరత్ అంటారు. ఈ మగ్ ఫిరత్ పొందినవారే స్వర్గం (జన్నత్) లో ప్రవేశిస్తారు.


చరిత్ర:--


ఇస్లామీయ చారిత్రక పురోగతి వలన, ఇస్లామీయ ప్రపంచం అంతర్ మరియు బాహ్య ప్రపంచంలో రాజకీయ, ఆర్థిక, సైనిక రంగాలలో ఎంతో మార్పు వచ్చింది. ముహమ్మద్ ప్రవక్త ఖురాన్ పఠించిన ఓ వందేళ్ళ కాలంలోనే పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం నుండి తూర్పున మధ్య ఆసియా వరకూ ఇస్లామీయ సామ్రాజ్యం వ్యాపించింది. ఈ క్రొత్త రాజకీయ స్థితులు, ప్రజాయుద్ధాలను లేవదీసి క్రొత్త రాజ్యాలు ఏర్పాటయేలా చేసింది. ఈ క్రొత్త రాజ్యాల మధ్య దారితీసిన యుద్ధాలలో వెలుపలి దేశాల సహాయాలు కూడా పొందాయి. ఇస్లామీయ సామ్రాజ్యం ఆఫ్రికా,భారత ఉపఖండం మరియు తూర్పు ఆసియా దేశాలలోనూ విస్తరించింది. ఇస్లామీయ నాగరికత మధ్య యుగం లో అభివృద్ధి చెందిన నాగరికతగా వెలసిల్లింది. కాని యూరప్ దేశాలలో ఆర్థిక సైనిక పురోగతివలన, అంతగా వ్యాప్తి చెందలేక పోయింది. 18వ మరియు 19వ శతాబ్దాలలో, ఇస్లామీయ రాజ్యాలు ఉదాహరణకు ఉస్మానియా సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం మొదలగునవి యూరప్ రాజరిక వ్యవస్థ కబంధ హస్తాలలోకి వెళ్ళాయి. 20వ శతాబ్దంలో ఇస్లామీయ పునరుజ్జీవనం మరియు ఆర్థిక పురోగతుల మూలంగా ఇస్లామీయ ప్రపంచం పునరుజ్జీవనం మరియు అంత॰కలహాలకు గురైంది.[2]



ఖిలాఫత్ ప్రారంభం (632–750):--


హిజ్రీ శకానికి ముందు, ముహమ్మద్ ప్రవక్త, మక్కా నగరంలో తన ప్రవచనాలను బోధించసాగారు. మదీనా నగరానికి హిజ్రత్ చేసిన తరువాత, అచటనుండి అరేబియా అంతటినీ ఏకీకృతం చేశారు. క్రీ.శ. 632 లో ముహమ్మద్ ప్రవక్త మరణం తరువాత, ముస్లిం సమూహాలలో ఆందోళనలు బయలు దేరాయి. ముహమ్మద్ ప్రవక్త ఉన్నంతకాలము ముస్లింలందరూ సమిష్టిగా ప్రవక్తగారి ఆధ్వర్యంలోని నాయకత్వాన్ని అంగీకరించారు. వీరి తరువాత నాయకుడెవ్వరనే ప్రశ్న తలెత్తింది. ఈ ఆందోళణకు కారణం అదే. ముఖ్యమైన సహాబాలు మరియు అనేక తెగల నాయకులందరూ కలసి అబూబక్ర్ ను తమ నాయకునిగా అనగా ఖలీఫాగా ఎన్నుకున్నారు. ముహమ్మద్ ప్రవక్త జీవించి యున్నపుడు వారి అభీష్టం కూడా, వారి తరువాత అబూబక్ర్ ముస్లింల నాయకుడు కావాలని. ఈ విషయమెరిగిన సహాబాలు, ప్రధానంగా ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ అబూబక్ర్ ను తమ నాయకునిగా ప్రకటించారు. ఆనాటి 'ఖారిజీలు' అబూబక్ర్ నియామకం పట్ల తమ నిరసనను ప్రకటించారు. (ఈ ఖారిజీలు ప్రతి నిర్ణయాన్నీ విమర్శించేవారు. ముహమ్మద్ ప్రవక్త తన జీవనకాలంలో, తన అనుయాయులకు, వీరి పట్ల అప్రమత్తంగా వుండండి, రాబోయే ఫిత్నాలకు వీరే కారణభూతులౌతారని సెలవిచ్చారు.) ముహమ్మద్ ప్రవక్త వారసునిగా, వారి అల్లుడైన అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ను ఖలీఫాగా ఎన్నుకోవాలని గళం విప్పారు. కాని వీరికి సంఖ్యాబలం లభించలేదు. ఇంకొక ప్రధాన విషయం 'అలీ' స్వయంగా తన మద్దతును అబూబక్ర్ కు ప్రకటించి, ఖారిజీల గళాన్ని బలంలేకుండా చేశారు. అబూబక్ర్ ముందు తక్షణ కర్తవ్యంగా, బైజాంటియన్ (తూర్పు రోమన్ సామ్రాజ్యం) లను నిరోధించడం, వీటి కొరకు యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ఈ యుద్ధాలకు రిద్దా యుద్ధాలు అని వ్యవహరించారు.[3]


750 లో ఖిలాఫత్ ప్రాంతం.634 లో అబూబక్ర్ మరణం తరువాత, ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ ఖలీఫాగా ఎన్నికయ్యాడు. ఇతని తరువాత ఉస్మాన్ మరియు అలీ ఇబ్న్ అబీ తాలిబ్ లు ఖలీఫాలయ్యారు. ఈ నలుగురికీ రాషిదూన్ ఖలీఫాలు లేదా మార్గదర్శకం గావింపబడ్డ ఖలీఫాలు అని వ్యవహరిస్తారు. వీరి కాలంలో ముస్లింల రాజ్యం బైజాంటియన్ మరియ్ పర్షియన్ సామ్రాజ్యం వరకూ వ్యాపించినది.[4] ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ 644 లో షహీద్ అయిన తరువాత, ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ ఖిలాఫత్ వారసుడిగా ప్రకటింపబడ్డారు. ఇతను అనేక సవాళ్ళను వ్యతిరేకతలను ఎదుర్కొన్నారు. 656 లో ఇతనూ షహీద్ గావింపబడ్డారు, అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ఖలీఫాగా ఎన్నికయ్యారు. ఇతని కాలంలో మొదటి ఫిత్నా (ఖలీఫాల పట్ల తిరుగుబాటు) బయలుదేరింది. ఖారిజీలు 661లో 'అలీ'ని బలిగొన్నారు. వీరి తరువాత ముఆవియా ఖలీఫాగా ఎన్నికయ్యారు. ముఆవియా ఉమయ్యద్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.[5] ఈ ఖలీఫా విషయాల మూలంగా ముస్లిం సమాజంలో షియా తత్వం బయలుదేరి వర్గ విభజన జరిగినది. అలీ ఖిలాఫత్ కు ముందు ఉన్నటువంటి ముగ్గురి ఖలీఫాలను ఖలీఫాలుగా స్వీకరించినవారు సున్నీ ముస్లింలయ్యారు. నిరాకరించినవారు కొద్ది సంఖ్యలో గలవారు షియాలుగా వేరు పడ్డారు.[6] 680 లో ముఆవియా మరణించిన తరువాత, ఖలీఫా వారసుల గూర్చి తిరిగీ తర్జన భర్జనలు జరగసాగాయి, ఇవి తిరిగీ తిరుగుబాట్లవరకూ తీసుకెళ్ళాయి, దీనినే "రెండవ ఫిత్నా" గా వ్యవహరిస్తారు. ఈ తరువాయి ఉమయ్యద్ సామ్రాజ్యం 70 యేండ్లపాటు సాగింది. ప్రాంతాలైన మగ్రిబ్ (పశ్చిమం) మరియు అల్-అందులుస్ ( ఇబీరియన్ ద్వీపకల్పం ), ప్రాచీన విసిగోథిక్ హస్పానియా (స్పెయిన్)) మరియు పశ్చిమ ప్రాంతాలైన నర్బోనీస్ గాల్ ద్వారా సింధ్ ప్రాంతం, మధ్య ఆసియా మొదలగునవి ముస్లింల వశమయ్యాయి. [7] ఈ కాలంలోనే ముస్లిం-అరబ్బులు ప్రాపంచిక విషయాలపై ప్రశ్నలు లేవనెత్తారు వీరినే జాహిద్ లు గా వ్యవహరిస్తారు. ధార్మికులైన వారికి ప్రపంచ విషయాల పరిత్యాగమే ఉత్తమమని హసన్ బస్రి ఓ ఉద్యమాన్ని లేవదీశాడు. క్రమేపీ ఈ ఉద్యమం సూఫీ తత్వం అవతంచడానికి దోహదపడింది. [8]

ఈ ఉమయ్యద్ ల నిరంకుశం మూలంగా, ఇస్లాం కేవలం అరబ్బులకు మాత్రమే మతము గా భావింపబదినది. [9] ఈ ఉమయ్యద్ ల విత్తము, ముస్లిమేతరులైన జిమ్మీల పన్నులరూపంలో వసూలయ్యే మొత్తాలపైనే ఆధారపడినది. ఒక ముస్లిమేతరుడు ఇస్లాంలోకి ప్రవేశించాలంటే, ముందు అరబ్బులవద్ద సరకులు కొనేవాడి (గాహక్) గా మారే పరిస్థితి వుండేది. ఇస్లాంలో ప్రవేశించిననూ వీరికి అధములుగా కొన్ని అరబ్ సమూహాలు చూసేవి. ఈ 'నవముస్లిం' మవాలీ అని సంబోధించేవారు. ఈ మవాలీలు ఇస్లాం ప్రసాదించే సంపూర్ణ స్వాతంత్ర్యాలు పొందలేక పోయేవారు. ఈ వ్యవహారం నచ్చని ముహమ్మద్ ప్రవక్త పినతండి అబ్బాస్ ఇబ్న్ అబ్ద్ ముత్తలిబ్ వారసులు వ్యతిరేకించి అబ్బాసీయ సామ్రాజ్యాన్ని క్రీ.శ. 750 లో స్థాపించారు. [10] ఈ అబ్బాసీయుల కాలంలో ఇస్లామీయ సామ్రాజ్యం వేగంగా అభివృద్ధి చెంది ఇస్లామీయ స్వర్ణయుగానికి నాంది పలికింది. ఈ సామ్రాజ్యానికి రాజధాని బాగ్దాద్ నగరం. [11]



స్వర్ణయుగం (750–1258):--


.9వ శతాబ్దం ఆఖరువరకు, అబ్బాసీ ఖలీఫాలు, తమ సామ్రాజ్యాన్ని పటిష్టపరచుకున్నారు. వీరి సామ్రాజ్యం, ఉత్తర ఆఫ్రికా, పర్షియా మరియు మధ్యాసియా లోని అనేక చిన్న చిన్న రాజ్యాలు ఏకీకృతమైనవి. ఏకేశ్వరవాదమూ వీరి సామ్రాజ్యవిస్తరణకు పనికొచ్చింది, ఈ విధంగా వీరి సామ్రాజ్యం విస్తరించి విశాలమైన ముస్లిం ప్రపంచం ఏర్పడడానికి దోహదపడింది. ఖలీఫాల మతపరమైన విధివిధానాలలో షియాలైన ఫాతిమిద్ ల ఆధిపత్యం ప్రగాఢంగా తన ప్రభావాన్ని చూపించింది. క్రీ.శ. 1055 లో సెల్జుక్ తుర్కులు అబ్బాసీయుల సైనికాధిపత్యాన్ని తొలగించగలిగారు, ఖలీఫాలను మాత్రం గౌరవిస్తూనే వచ్చారు.[12] వీరి సామ్రాజ్య విస్తరణ రెండువిధాల సాగినది, ఒకతి శాంతిపరమైన మార్గం దావాహ్, రెండవది యుద్ధాలు. మూడవ విధం, వీరు సాగించిన వర్తకాలు. వీరు వర్తకాలు చేసే ప్రాంతాలలో నివాసాలు ఏర్పరచుకోవడం మరియు "దావాహ్" (ఇస్లాం మార్గంలో ధార్మిక పిలుపు) ను ఆచరించడం. వర్తకాలు సాగించి సామ్రాజ్యాల విస్తరణలు గావించిన ప్రాంతాలలో ఉప-సహారా పశ్చిమ ఆఫ్రికా, మధ్యాసియా, వోల్గా బల్గేరియా మరియు మలయా ద్వీపసమూహాలు.[13] ఈ స్వర్ణయుగం, కొత్త న్యాయ, తత్వ, మరియు ధార్మిక పురోగతులను చవిచూసింది. ఆరు ప్రముఖ హదీసుల క్రోడీకరణలు చేపట్టబడ్డాయి. నాలుగు ఇస్లామీయ పాఠశాల (మజహబ్)లు ప్రవేశపెట్టబడినాయి. ఇస్లామీయ చట్టాలు క్రోడీకరించి గ్రంధాలరూపమివ్వబడ్డాయి. 9వ శతాబ్దానికి చెందిన ఇమామ్ అల్ షాఫయీ హదీసుల క్రోడీకరణలకు సూత్రాలు ప్రతిపాదించాడు. ఆవిధంగా హదీసు క్రోడీకరణలకు మార్గం ఇంకనూ సులభమయ్యింది. ఈ సూత్రీకరణల ద్వారా ఇస్లామీయ పండితులలో తర్జనభర్జనలు తగ్గుముఖం పట్టాయి.

మసీదులు:--


మస్జిద్ లేదా మశీదు, ముస్లింల ప్రార్థనా ప్రదేశం, మసీదుకు అరబ్బీ నామం మస్జిద్. చిన్న చిన్న మస్జిద్ లు వుంటే అవి సాధారణ మస్జిద్, పెద్ద పెద్ద సమూహాల కొరకు మరీ ముఖ్యంగా శుక్రవారపు ప్రార్థనల కొరకు కేంద్రీయ మస్జిద్ లను 'జామా మస్జిద్' లేదా 'మస్జిద్ ఎ జామి' అని అంటారు. ప్రాధమికంగా ఈ మస్జిద్ లు ప్రార్థనా మందిరాలైనప్పటికీ, వీటిలో సామాజిక కార్యకలాపాలైన పాఠశాలలు, మదరసాలు సామాజిక కేంద్రాలు, మొదలగువాటి కొరకునూ ఉపయోగిస్తున్నారు. ఈ మస్జిద్ లకు మీనార్లు గుంబద్ లు, మిహ్రాబ్, మింబర్, వజూ ఖానాలు మొదలగునవి వుంటాయి.


కుటుంబ జీవితం:--


ఇస్లామీయ సమాజంలో మూలవ్యవస్థ విషయం "కుటుంబం", మరియు ఇస్లామ్ ఈ కుటుంబ సభ్యులందరికీ తగురీతిలో హక్కులను కల్పిస్తున్నది. కుటుంబ వ్యవస్థలో యజమాని 'తండ్రి', ఇతను కుటుంబపు బరువుబాధ్యతలు, ఆర్థిక విషయాలను, ఆలన పాలన పోషణలు చూస్తాడు. ఖురాన్ లో వారసత్వపు విషయాలన్నీ క్షుణ్ణంగా పొందుపరచబడ్డాయి. కుటుంబంలోని ఆస్తిలో స్త్రీహక్కు, పురుషుడి హక్కుతో సమానం. అనగా సగం ఆస్తి స్త్రీకి చెందుతుంది. అన్ని హక్కులూ సగం కల్పించబడ్డాయి.[44] ఇస్లాంలో పెళ్ళి లేదా నికాహ్ అనునది, పౌర-ఒడంబడిక. ఈ నికాహ్ కొరకు, ఇద్దరు సాక్షులు అవసరం. పెళ్ళికొడుకు పెళ్ళికుమార్తెకు భరణం "మహర్" చెల్లించాలి. మహర్ అనునది, పెళ్ళికుమారిడి తరపున పెళ్ళికుమార్తెకు ఓ బహుమతి. ఈవిషయం "నికాహ్ నామా"లో వ్రాయవలసి యుంటుంది.[45]

ఓ పురుషుడు నలుగురు భార్యలను గలిగి వుండవచ్చును. కానీ వీరికి సమాన హక్కులు పోషించగలిగే స్థితిమంతం పురుషుడు కలిగి వుండాలి. స్త్రీ ఒక పురుషుడిని మాత్రమే భర్తగా కలిగి వుండాలి. భర్తతో విడాకులు పొంది ఇంకో పెళ్ళి చేసుకొనవచ్చును. ఇస్లాంలో విడాకులుకు "తలాఖ్" అని వ్యవహరిస్తారు.[46] స్త్రీలు హిజాబ్ లేదా పరదా పద్దతిని పాటించాలి. దీనినే "ఘోషా" పద్దతి అని వ్యవహరిస్తారు, ఈ పద్దతి స్త్రీలను హుందాగా జీవించేందుకు దోహదపడుతుందని భావిస్తారు. ఈ నియమం పై పలు పండితుల వాగ్వివాదాలున్నాయి, విమర్శలూ, అంగీకారాలూ రెండునూవున్నది. కానీ అంగీకారాల శాతం బహు ఎక్కువ. నగర ప్రాంతాలలో ఈ ఘోషాపద్దతి కొద్ది తక్కువ కాన వస్తుంది

కేలండర్:--

ఇస్లామీయ కేలండర్ (అరబ్బీ : التقويم الهجري అత్-తఖ్వీమ్ అల్-హిజ్రి), ఇస్లామీయ దేశాలలో మరియు ముస్లింల సముదాయాలలో అవలంబింపబడుతున్న కేలండర్. ఇది చంద్రమాసాలపై ఆధారంగా గలది కావున దీనికి 'తఖ్వీమ్-హిజ్రి-ఖమరి' అని కూడా అంటారు. ఈ కేలండర్ లో 12 చంద్రమాసాలు మరియు దాదాపు 354 దినాలు గలవు. "హిజ్రీ శకా"నికి మూలం ముహమ్మద్ ప్రవక్త గారి హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్. మహమ్మదు ప్రవక్త మరియు అతని అనుయాయులు మక్కా నుండి మదీనా కు క్రీ.శ. 622 లో వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు.

సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో కలసి హిజ్రత్ (వలస చేసి) 'యస్రిబ్' నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి మదీనా (తెలుగార్థం: నగరం) లేదా "మదీనతున్-నబీ" లేదా నబీ (ప్రవక్త) గారి నగరం గా పేరు స్థిరపడింది. ముస్లింల శకం హిజ్రీ ప్రారంభమయింది. ఉమర్ కాలంలో 638 లో ఇస్లామీయ కేలండర్ ప్రారంభమయింది. మహమ్మదు ప్రవక్త గారి వలస క్రింది విధంగా జరిగినది


ఇతర మతములు:--


ఇస్లామీయ ధర్మశాస్త్రాల అనుసారం, ఇస్లాం, మానవకళ్యాణం కొరకు అల్లాహ్ చే ప్రసాదింపబడిన ఓ సరళమైన శాంతిమార్గం, ఈ మార్గం ఆదమ్ ప్రవక్త తో ప్రారంభమైనది.[49] చరిత్ర గతిలో ఈ ప్రామాణిక క్షీణించే దశలలో అల్లాహ్, ప్రజలకొరకు, తన ప్రవక్తలను అవతరింపజేస్తూ వచ్చాడు. [50] ఈ సిద్ధాంతం ప్రకారం ఇబ్రాహీం, మూసా, బనీ ఇస్రాయీల్ (హిబ్రూ జాతి) ప్రవక్తలు, వీరందరూ ఇస్లామీయ ప్రవక్తలే. ఇంకనూ ఈసా, ముహమ్మద్ ప్రవక్త, దైవసందేశాలను మోసుకొచ్చినవారే.[51][52] [53]

ఇస్లామీయ చట్టాలు ముస్లిమేతరులకు వివిధ వర్గాలలో విభజించారు, ఈ విభజనలకు మూలం ఇస్లామీయ రాజ్యాలతో ముస్లిమేతరుల సంబంధాలు. ఇస్లామీయ రాజ్యాలలో నివసించే యూదులు మరియు క్రైస్తవులకు జిమ్మీలు ("సంరక్షించబడిన ప్రజలు (protected peoples)") అని వర్గీకరించాలు. ఈ వర్గీకరణ ఒడంబడిక మూలంగా ఈ జిమ్మీల మతపరమైన, సామాజిక, ఆస్తిసంబంధ మరియు ఆర్థిక సంరక్షణ , ఇస్లామీయ ఖలీఫాలు లేదా రాజుల భుజస్కంధాలపై యుండేది. ఈ సంరక్షణ ప్రతిఫలంగా వీరి నుండి జిజియా పొందేవారు. ఈ విధమైన వ్యవస్థవలన జిమ్మీలు అన్ని రకములైన స్వేచ్ఛను పొందేవారు


విభాగాలు:----------------------------

ఇస్లాంలోని సమూహాలకు ఐదు మూలస్థంభాలపై ఎలాంటి తకరారు లేకపోయినప్పటికీ, అనేక ఇతర విషయాలపై తర్జనభర్జనలకు లోనై, అనేక విభాగాలుగా విడిపోయారు. ఇందులో ప్రధానమైనవి సున్నీ ఇస్లాం, మరియు షియా ఇస్లాం లు. ప్రపంచంలో సున్నీ ముస్లింలు దాదాపు 85% ఉండగా షియాముస్లింలు 15% గలరు.[61]




సున్నీ:--

సున్నీ ముస్లింలు ఇస్లామీయ సమూహంలో అతి పెద్ద సమూహం. ఇస్లామీయ జనాభాలోని 85% ఈ సున్నీ ముస్లింలే. అరబ్బీ భాషలో 'సున్నీ' అనగా, మార్గం లేదా దారి. ముహమ్మద్ ప్రవక్త ఆచరణీయాలను అమలు చేయువారు సున్నీలు. ఈ సున్నీ ముస్లిం సమూహం, రాషిదూన్ ఖలీఫాల పట్ల తమ సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తారు. (షియాలు ఇందుకు విరుద్ధం). ఈ సున్నీ ముస్లిం సమూహం మరియూ నాలుగు పాఠశాలలో విభజింపబడినది. ఈ సున్నీ పాఠశాలలనే మజహబ్ అని అంటారు. ఈ పాఠశాలలు హనఫీ, షాఫయీ, మాలికీ మరియు హంబలీ పాఠశాలలు.[62]


షియా:--

ఇస్లాంలో షియా ఇస్లాం లేదా 'షియా' అనునది ఒక శాఖ. వీరు సున్నీల తరువాత పెద్ద సంఖ్యలో గలరు. ముహమ్మద్ ప్రవక్త కాలంనుండే వీరు ప్రత్యేక వర్గంగా వుంటూ వచ్చారు. వీరు మహమ్మద్ ప్రవక్తపై విశ్వాసముంచరు అనే అపవాదు ఉన్నది. కాని ఇది నిజంగాదు. వీరు అహ్లె బైత్ అనగా ప్రవక్తగారి కుటుంబం పట్ల ఎక్కువగా తమ ప్రేమాభిమానాలు చాటుతారు. సున్నీలకు షియాలకు ప్రధాన తేడా, సున్నీలు ప్రధానంగా సున్నహ్ పట్ల తమ జీవితాలను ప్రతిబింబించేలా చూసుకుంటారు. షియాలు సున్నహ్ పట్ల అంతగా ప్రగాఢ విశ్వాసం ప్రకటించరు. షియాలయందు ప్రధానం ఇమామ్. ఈ ఇమామ్ పరంపర అలీ ఇబ్న్ అబీ తాలిబ్ (ప్రవక్తగారి అల్లుడు, ఫాతిమా గారి భర్త) నుండి ప్రారంభమైనది. [63][64] సున్నీలు షరియా న్యాయశాస్త్రాలను పాటిస్తే, షియాలు జాఫరి న్యాయశాస్త్రం అవలంబిస్తారు.[65] షియా ఇస్లాం అనేక శాఖలుగా విభజింపబడియున్నది. వీరిలో ప్రధానం ఇస్నా అసరియా (12 ఇమామ్ లను అనుసరించేవారు), మిగతావారు ఇస్మాయీలి, జైదియ్యా లు.[66]



సూఫీ తత్వము:--


సూఫీ తత్వము; ఇస్లాం మతము లో ఒక ఆధ్యాత్మిక ఆచారం ఈ సూఫీ తత్వం. ఈ తత్వం ప్రకారం స్వీయ ఆధ్యాత్మికా మార్గాన ఈశ్వర ప్రేమను పొందడం ధ్యేయం.[67] ఇస్లామీయ ధర్మశాస్త్రాల ప్రకారం షరియా మరియు ఫిఖహ్ లు ఇస్లామీయ ప్రధాన మార్గాలైతే, సాధారణ ముస్లిం సమూహాల ప్రకారం సూఫీ తత్వము ఒక ఉపమార్గము. ఈ సూఫీ తత్వము, దిశ, దశ, దార్శనికత మరియు మార్గ దర్శకత్వము లేని కారణంగా 'గాలివాట మార్గం' గా ముస్లింలు అభివర్ణిస్తారు. మరియు దీనిని ఉలేమాలు, బిద్ అత్ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ మార్గం, మార్గ దర్శకత్వం లేనికారణంగా, అంధమార్గంగానూ, అంధవిశ్వాసాల మయంగానూ, గమ్యంలేని, స్థిరత్వంలేని మార్గంగానూ అభివర్ణించబడుతుంది. ఇవి అక్షర సత్యాలే, కాని, ఈ తత్వంలోని విశ్వసోదర ప్రేమ మాత్రం శ్లాఘింపదగినది. ఈ సూఫీ తరీఖాలు సున్నీ ఇస్లాం గాని షియా ఇస్లాం గాని కలిగివున్నవే. [68]


ఇతరములు:-

ఖారిజీలు, వీరు ఒక వర్గం వారు, ఇస్లాం ఆవిర్భవించినప్పటినుండి, వీరు వేరుగానే వుంటూ వచ్చారు. ఈ వర్గంలోని కేవలం ఒకే ఒక శాఖ ఇప్పటికి వున్నది, దీనినే ఇబాదిజం అని అంటారు. వీరు ఖురాన్, షరియా, హదీసులు మరియు సున్నహ్ ల పట్ల అంతగా శ్రద్ధ వహించరు. వీరికి ప్రధానం వీరి ఇమామ్. "ఖారిజీ" అనగా "విసర్జించబడిన" లేక 'బాహ్యమైన', వీరు ఇస్లామ్ నుండి బాహ్యంగానే వుంటూ వస్తున్నారు. వీరు ప్రధానంగా ఒమన్ లో వుంటున్నారు