20, ఆగస్టు 2010, శుక్రవారం

గురుగ్రంధ సాహిబ్

గురుగ్రంధ సాహిబ్ లేదా ఆది గ్రంధ్, లేదా ఆది శ్రీ గురు గ్రంథ్ సాహిబ్, సిక్కు మతస్తుల పవిత్ర గ్రంధం మరియు ఆఖరి గురువు.

గురు గోవింద్ సింగ్ (1666-1708), సిక్కుల గురువు లలో పదవ గురువు, ఆది గ్రంధ్ ను తన వారసురాలిగా ప్రకటించాడు, మానవులలో గురువులుగా ప్రకటించే విధానాన్ని స్వస్తిపలికి, గ్రంధమైన "ఆది గ్రంధ్" ను తన తరువాత గురువుగా ప్రకటించాడు. ఈ గ్రంధం పవిత్రగ్రంధంగానే గాక, పది-గురువుల జీవనవిధానంగానూ పరిగణింపబడినది. గురుగ్రంధ సాహిబ్, ప్రార్థనలకొరకు ఒక వనరుగా పరిగణింపబడినది.మరియుసిక్కు మతములో ప్రార్థనాంగము.

గురు అర్జున్ దేవ్ (1563-1606) చే మొదటిసారిగా ఆది గ్రంధం కూర్పు చేయబడినది. ఇందులో మొదటి ఐదు సిక్కు గురువులు మరియు హిందూ ముస్లింల సాంప్రదాయాలకు చెందిన అనేక గురువుల గురించి వ్రాయబడినది. గ్రంధాన్ని అసలు రూపం ఇచ్చినవారు భాయ్ గురుదాస్ మరియు తరువాత భాయ్ మణిసింగ్. పదవ గురువు పరమదించిన తరువాత, ఆదిగ్రంధ్ చేతివ్రాత ప్రతులను బాబా దీప్ సింగ్ తయారుచేసి పంచిపెట్టాడు. గురుగ్రంధ సాహిబ్ గ్రంధము 1430 పుటలు కలిగిన గ్రంధము. సిఖ్ గురువుల కాలంలో, 1469 నుండి 1708 వరకు గ్రంధరూపం ఇవ్వబడినది. ఈ గ్రంధం స్తోత్రం రూపంలో వున్నది.




గురుగ్రంథ్ సాహిబ్ వాణి


కొన్ని ముఖ్యమైన వాణులు :-

1.ప్రపంచంలోని మానవులంతా సమానమే
2.స్త్రీలందరూ సమానమే
3.అందరికీ ఒకే భగవంతుడు
4.సత్యమునే పలికి సత్యముగా జీవించు
5.ఐదు విషయాలపట్ల శ్రద్ధ వహించు
6.దేవుడి ఆజ్ఞపై జీవించు (ఒకే దేవుడి నిర్ణయం)
7.మానవత్వం, దయ, జాలి, ప్రేమ లను ఆచరించు
8.జీవించి యుండగానే పరమాత్మను చేరే మార్గ తత్వము.
9.గురువు బోధనల ద్వారా దైనందిన జీవితంలోని సమస్యలనుండి బయటపడటం.
10.ఇందులో కథలు లేవు, జీవనమార్గాన్ని సూచించే సూక్తులు, విశాలతత్వంతో జీవించే మార్గాలూ వున్నవి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి